Jasmine: రాత్రికి రాత్రే మల్లెపూలు పూయాలంటే ఈ ట్రిక్ ఒక్కటి చాలు
Jasmine: వేసవిలో విరగకాసే మల్లెపూలకు మంచి డిమాండ్ ఉంటుంది. ప్రతి ఒక్కరు తమ ఇంట్లో పెంచుకోవాలనుకుంటారు. కానీ మొక్క పెరిగినా పూలు పూయవు. రాత్రికి రాత్రే మల్లెపూలు పూయాలంటే ఈ ట్రిక్ ఒక్కటి చాలు.

మల్లె చెట్టుకు కేవలం నీళ్లు పోస్తే సరిపోదు
మల్లె పూల సువాసన అంటే ఇష్టపడని వారుండరు. ఇంటి పెరట్లో మల్లె చెట్టు ఉండి, అది నిండా పూలతో కళకళలాడుతుంటే ఆ అందమే వేరు కదా. కానీ చాలా మంది ఇళ్లల్లో మల్లె చెట్టు పెరిగి పెద్దదైనా ఒక్క పువ్వు కూడా పూయడం లేదని బాధపడుతుంటారు. మల్లె చెట్టుకు కేవలం నీళ్లు పోస్తే సరిపోదు, దానికి చిన్నపాటి 'ట్రిక్స్' కూడా అవసరం. అవేంటో ఇప్పుడు చూద్దాం.
అద్భుతమైన ట్రిక్: ఎప్సమ్ సాల్ట్, పుల్లటి మజ్జిగ
మల్లె చెట్టులో మొగ్గలు రావడానికి, వచ్చిన మొగ్గలు రాలిపోకుండా ఉండటానికి ఈ మిశ్రమం అమృతంలా పనిచేస్తుంది.
ఒక లీటరు నీరు, ఒక స్పూన్ ఎప్సమ్ సాల్ట్ , అర గ్లాసు బాగా పులిసిన మజ్జిగ.
నీటిలో ఎప్సమ్ సాల్ట్ వేసి బాగా కరిగించండి. ఆ తర్వాత అందులో పుల్లటి మజ్జిగ కలపండి.
సాయంత్రం వేళ ఎండ తగ్గాక, ఈ నీటిని మొక్క మొదట్లో పోయాలి. అలాగే కొద్దిగా నీటిని ఆకులపై స్ప్రే చేయాలి.
ఎప్సమ్ సాల్ట్‌లోని మెగ్నీషియం మొక్కలో Photosynthesis పెంచి, మొగ్గలు త్వరగా రావడానికి సహాయపడుతుంది. మజ్జిగలోని బ్యాక్టీరియా మట్టిని సారవంతం చేస్తుంది.
వాటితో పాటు కూడా ఇలా చేయాలి
మల్లె పూల సీజన్ మొదలయ్యే ముందు చెట్టుకున్న ఆకులన్నింటినీ తుంచేయాలి. దీనివల్ల పూలు పెరుగుతాయి. ఆకులు తీసేసిన కొద్ది రోజుల్లోనే విపరీతంగా మొగ్గలు రావడం మీరు చూడొచ్చు.
మల్లె చెట్టుకు పాత కొమ్మలు ఉంటే పూలు పూయవు. ఎండిపోయిన, పాత కొమ్మలను కత్తిరిస్తే.. ఆ స్థానంలో కొత్త చిగుర్లు వచ్చి, ప్రతి చిగురు చివర గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయి. మల్లె మొక్కకు కనీసం 6 గంటల పాటు నేరుగా సూర్యరశ్మి తగలాలి. నీడలో ఉంటే మొక్క పెరుగుతుంది కానీ పూలు పూయవు.
సహజ సిద్ధమైన ఎరువులు వేయాలి
ప్రతిదానికి కెమికల్ కంటే ఇంట్లో దొరికే వస్తువులతో అద్భుత ఫలితాలు ఉంటాయి. అరటిపండు తొక్కలు ఎండబెట్టి పొడి చేసి మొక్కకు వేయండి. ఇందులో ఉండే పొటాషియం పూల సైజును పెంచుతుంది. బియ్యం, పప్పు కడిగిన తర్వాత నీటిని పారబోయకుండా మల్లె మొక్కకు పోయండి. ఇందులో ఉండే ఖనిజాలు మొక్క ఎదుగుదలకు తోడ్పడతాయి.
టీ పెట్టుకున్నాక మిగిలిన పొడిని కడిగి ఎండబెట్టి మొక్క మొదట్లో వేయండి. ఇది మట్టిలో ఎసిడిటీని పెంచి మల్లె పూలకు అనుకూలంగా మారుస్తుంది.
నెలకు రెండుసార్లు
ఎప్సమ్ సాల్ట్ ట్రిక్ నెలకు రెండుసార్లు చేయాలి. మంచి ఎండ తగిలేలా చూసుకుంటే.. మీ మల్లె చెట్టు రాత్రికి రాత్రే తెల్లని పువ్వులతో, సువాసనలతో మీ ఇంటిని నింపేస్తుంది.
