Today Rasi Phalalu: నేడు ఈ రెండు రాశులవారికి విపరీతంగా కలిసివస్తుంది! మీది ఏ రాశి?
Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 22.05.2026 శుక్రవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

మేష రాశి ఫలాలు
దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.
వృషభ రాశి ఫలాలు
ఆర్థిక వ్యవహారాలు చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. మిత్రులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ప్రతిబంధకాలు ఉంటాయి. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో అధికారులతో చికాకులు పెరుగుతాయి.
మిథున రాశి ఫలాలు
ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. విలువైన వస్తు లాభాలు పొందుతారు. చాలా కాలంగా పడిన శ్రమ ఫలిస్తుంది. కొత్త పనులు చేపడతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
కర్కాటక రాశి ఫలాలు
చేపట్టిన పనులలో శ్రమ అధికమవుతుంది. బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలించవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు అనుకూలించవు.
సింహ రాశి ఫలాలు
సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.
కన్య రాశి ఫలాలు
వివాదానికి సంబంధించి ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. ఆర్థికంగా మరింత మెరుగైన వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో నష్టాల నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
తుల రాశి ఫలాలు
ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. సన్నిహితులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. వ్యాపారాలలో కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది.
వృశ్చిక రాశి ఫలాలు
సోదరులతో కలహా సూచనలు ఉన్నాయి. నూతన రుణాలు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ విషయాల్లో ఆకస్మికంగా నిర్ణయాలు మార్పుకుంటారు. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగాలలో ఊహించని ట్రాన్స్ ఫర్ సూచనలు ఉన్నాయి.
ధనుస్సు రాశి ఫలాలు
కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో మీ అంచనాలు నిజమవుతాయి.
మకర రాశి ఫలాలు
చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. ఆకస్మిక ధన లాభాలు ఉన్నాయి. భూ వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయాలు విస్తృతం అవుతాయి. వ్యాపార వ్యవహారాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారం అవుతాయి.
కుంభ రాశి ఫలాలు
నూతన రుణ యత్నాలు సాగిస్తారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపారాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. మిత్రులతో కలహా సూచనలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి.
మీన రాశి ఫలాలు
వృథా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. కొన్ని పనులు శ్రమతో కానీ పూర్తి కావు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.

