Health Tips: టీ తోపాటు పొరపాటున కూడా తినకూడని ఆహార పదార్థాలు ఇవే!
మనలో చాలామంది టీని ఇష్టంగా తాగుతుంటారు. రోజుకు నాలుగైదు సార్లు టీ తాగేవాళ్లు కూడా లేకపోలేదు. అయితే టీ తోపాటు లేదా టీ తాగిన వెంటనే కొన్ని పదార్థాలను తినకూడదట. దానివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయట. మరి ఆ పదార్థాలేంటో చూద్దామా…

టీ తాగిన తర్వాత తినకూడని పదార్థాలు
చాలామందికి ఉదయాన్నే టీ తాగే అలవాటు ఉంటుంది. మరికొందరు టైంతో సంబంధం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడే టీ తాగుతుంటారు. టీలో టానిన్, కెఫీన్ ఉంటాయి. ఇవి కొన్ని ఆహారాలతో కలిస్తే సమస్యలు వస్తాయి. కాబట్టి టీ తాగేటప్పుడు పొరపాటున కూడా తినకూడని ఆహారాలేంటో ఇక్కడ చూద్దాం.
సిట్రస్ పండ్లు
నిమ్మ, నారింజ వంటి సిట్రస్ పండ్లు టీతో కలిపి తినడం హానికరం. వీటిలోని విటమిన్ సి, టీలోని టానిన్‌తో కలిసి జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు వస్తాయి. నిమ్మరసాన్ని టీతో కలిపి తాగితే కడుపులో ఇబ్బంది కలుగుతుంది. టీ తాగాక కనీసం 30 నిమిషాల తర్వాత పండ్లు తినాలి.
పసుపు
పసుపు మన వంటింట్లో ముఖ్యమైనది. కానీ దీన్ని టీతో కలిపి తీసుకోకూడదు. పసుపులోని కర్క్యుమిన్, టీలోని టానిన్‌తో కలిసి ఐరన్ శోషణకు ఆటంకం కలిగిస్తుంది. దీనివల్ల శక్తి తగ్గుతుంది. రక్తహీనత వస్తుంది. టీ తాగిన 1-2 గంటల తర్వాత పసుపు వాడితే మంచిది.
ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలు
ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలు (పాలకూర, మెంతికూర, మాంసం) టీతో కలిపి తీసుకోకూడదు. టీలోని టానిన్ ఐరన్ శోషణకు ఆటంకం కలిగిస్తుంది. రక్తహీనత వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా శాఖాహారులు జాగ్రత్తగా ఉండాలి. టీ తాగిన 2 గంటల తర్వాత ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారం తినాలి.
స్వీట్లు
బిస్కెట్లు, కేక్‌లు, స్వీట్లను టీతో తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. టీలోని కెఫీన్, చక్కెర కలిసి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. సమోసా, పకోడీ వంటివి కూడా టీతో కలిపి తినకూడదు. జీర్ణక్రియ మందగిస్తుంది. మఖానా, గింజలు వంటి తేలికపాటి టిఫిన్స్ ని టీతో తీసుకోవచ్చు.
పాల ఉత్పత్తులు
పాలు, జున్ను, పెరుగు వంటి పాల ఉత్పత్తులు టీతో కలిపి తీసుకోకూడదు. టీలోని టానిన్, పాలలోని ప్రోటీన్‌తో కలిసి గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలను కలిగిస్తుంది. ఐస్‌క్రీం, చల్లటి నీరు వంటివి కూడా టీతో కలిపి తీసుకోకూడదు. శరీర ఉష్ణోగ్రతను ప్రభావితం చేస్తాయి. టీ తాగిన తర్వాత 1-2 గంటల వరకు పాల ఉత్పత్తులు, చల్లటి పదార్థాలు తీసుకోకూడదు.