- Home
- Astrology
- Zodiac sign: ఈ రాశికి ఈ వారం లక్కే లక్కు.. కానీ ఒక్క విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి
Zodiac sign: ఈ రాశికి ఈ వారం లక్కే లక్కు.. కానీ ఒక్క విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి
Zodiac sign: మార్చిలో మరో వారం మొదలవుతోంది. 15 నుంచి 21వ తేదీ వరకు సింహరాశి వారికి మంచి సూచనలు కనిపిస్తున్నాయి. కానీ కొన్ని విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. మొత్తం మీద ఈ వారం సింహ రాశి వారికి ఎలా ఉండనుందంటే.

కెరీర్‌లో కీలక నిర్ణయాల సమయం
ఈ వారం ప్రారంభం ప్రయాణాలు, కొత్త విషయాలు నేర్చుకునే అవకాశాలతో మొదలవుతుంది. ఉద్యోగం విషయంలో కొన్ని ధైర్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు. అవి మిమ్మల్ని కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తీసుకువెళ్లినా, భవిష్యత్తులో మంచి ఫలితాలు ఇవ్వవచ్చు. ఆఫీసులో మీ దూరదృష్టి, ప్రణాళికలను అధికారులు మెచ్చుకుంటారు. మీ ఆలోచనలు సంస్థకు ఉపయోగపడతాయని భావించి మీకు పెద్ద బాధ్యతలు ఇవ్వవచ్చు. కొన్ని సందర్భాల్లో కొత్త ఉద్యోగం లేదా పెద్ద పదవికి సంబంధించిన ఆఫర్ కూడా రావచ్చు.
వ్యాపారంలో విదేశీ అవకాశాలు
వ్యాపారం చేసే వారికి వారం ప్రారంభంలో కొంత ఆలస్యం కనిపించవచ్చు. విదేశీ టారిఫ్‌లు లేదా ఎగుమతి నిబంధనల్లో మార్పులు రావడం వల్ల ప్లానింగ్ కొంత మారవచ్చు. అయితే ఆందోళన అవసరం లేదు. వారం మధ్య తర్వాత వ్యాపారంలో వేగం పెరుగుతుంది. విదేశీ సంబంధాలు, కొత్త కాంటాక్ట్స్ వల్ల మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సరైన ప్రణాళికతో ముందుకు సాగితే మంచి ఆదాయం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
ఆర్థిక పరిస్థితి బలపడే సూచనలు
ఈ వారం ఆర్థికంగా అదృష్టం మీవైపు ఉండే అవకాశం ఉంది. చాలా రోజులుగా ఆగిపోయిన డబ్బు తిరిగి రావచ్చు. అనుకోకుండా పెద్ద మొత్తంలో ధనం లభించే అవకాశం కూడా ఉంటుంది. ఇల్లు లేదా వాహనం కొనుగోలు వంటి విషయాల్లో మంచి ఫలితాలు కనిపించవచ్చు. అయితే సంపాదన పెరిగినా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.
కుటుంబం, ప్రేమ జీవితంలో ఆనందం
కుటుంబంలో పెద్దల ఆరోగ్యం మెరుగుపడటం వల్ల మీ మానసిక ఒత్తిడి తగ్గుతుంది. జీవిత భాగస్వామితో సంబంధాలు మరింత మధురంగా మారుతాయి. ఇద్దరూ కలిసి సంతోషంగా సమయం గడిపే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో జీవిత భాగస్వామితో కలిసి వారి ఇంటికి వెళ్లే అవకాశం ఉంటుంది. ప్రేమలో ఉన్నవారికి ఈ వారం మంచి సమయం. లవ్ పార్ట్నర్‌తో కలిసి ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఇంకా పెళ్లి కాని వారికి వివాహ అవకాశాలు కూడా రావచ్చు.
ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం
అయితే ఈ రాశివారు ఈ వారం ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. లివర్‌కు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆహారపు అలవాట్లలో నియంత్రణ పాటించడం మంచిది. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అన్ని కోణాల్లో ఆలోచించడం అవసరం. తొందరపడి తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు సమస్యలు తెచ్చిపెట్టవచ్చు. ఈ రాశి వారికి ఆరోగ్యం, శాంతి కోసం శివుడికి పాలు, పెరుగుతో అభిషేకం చేయడం మంచిదని సూచిస్తున్నారు.
గమనిక: పైన తెలిపిన విషయాలను ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం, పలువురు పండితులు తెలిపిన విషయాల ఆధారంగా అందించడమైంది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.

