- Home
- Astrology
- Sun Transit: ఆరుద్ర నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 3 రాశులవారు జాగ్రత్తగా లేకపోతే నష్టాలు తప్పవు!
Sun Transit: ఆరుద్ర నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 3 రాశులవారు జాగ్రత్తగా లేకపోతే నష్టాలు తప్పవు!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు సమయానుసారం రాశులు, నక్షత్రాలు మారుస్తూ ఉంటాయి. గ్రహాల మార్పు ప్రభావం 12 రాశులపై పడుతుంది. త్వరలో సూర్యుడు ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. దీనివల్ల 3 రాశుల వారికి కష్టకాలం మొదలుకానుంది. ఆ రాశులేంటో చూద్దామా..

సూర్యుడి రాశి మార్పు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు.. రాశులు, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. ఈ ప్రభావం వల్ల కొన్ని రాశులవారికి మేలు జరుగుతుంది. మరికొన్ని రాశులవారికి చెడు జరిగే అవకాశం ఉంటుంది. సూర్యుడు ప్రస్తుతం మృగశిర నక్షత్రంలో సంచరిస్తున్నాడు. జూన్ 22న అంటే ఆదివారం ఉదయం 6:28 కి ఈ నక్షత్రాన్ని విడిచి ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. జ్యోతిష్యం ప్రకారం ఆరుద్ర నక్షత్రంలో సూర్య గోచారాన్ని శుభంగా భావిస్తారు. కానీ సూర్యుడు వెళ్లే నక్షత్రానికి అధిపతి రాహువు. అంటే ఆరుద్ర నక్షత్రానికి అధిపతి రాహువు. రాహువు అధిపతిగా ఉండటం వల్ల సూర్య సంచారం కొన్ని రాశులవారికి అశుభంగా మారనుంది. ముఖ్యంగా 3 రాశులవారు సూర్య సంచారం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మరి ఆ రాశులేంటో.. అందులో మీ రాశి ఉందో చెక్ చేసుకోండి.
మిథున రాశి
మిథున రాశి వారికి ఆరుద్ర నక్షత్రంలో సూర్య సంచారం మానసిక అశాంతిని కలిగిస్తుంది. ఆరుద్ర నక్షత్రం మిథున రాశికి సంబంధించింది. రాహువు ప్రభావం ఈ రాశివారి జీవితంలో గందరగోళం, ఆందోళనను పెంచుతుంది. కాబట్టి ఈ సమయంలో మీరు నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. తప్పుగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఉద్యోగం, పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదంటున్నారు నిపుణులు. కుటుంబ వాతావరణంలో కూడా కొన్ని విభేదాలు రావచ్చని చెబుతున్నారు. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని సూచిస్తున్నారు.
పరిహారం:
జ్యోతిష్య నిపుణుల ప్రకారం ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని 'ఓం రాణ్ రహవే నమః' మంత్రాన్ని 108 సార్లు జపించండి. మంచి ఫలితాలు ఉంటాయి.
కన్య రాశి
కన్య రాశి వారికి సూర్య సంచార సమయంలో ఉద్యోగంలో అడ్డంకులు ఎదురవుతాయి. సహోద్యోగులు లేదా ఉన్నతాధికారులతో విభేదాలు రావచ్చు. పని భారం పెరగవచ్చు. మీ కష్టానికి తగిన ఫలితం దక్కదు. దీనివల్ల మీ మనసులో నిరాశ కలుగుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కడుపు సంబంధిత సమస్యలు వేధిస్తాయి. నిద్రలేమి వల్ల చికాకుగా అనిపిస్తుంది. ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోవాలి. లేకపోతే నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
పరిహారం:
శనివారం ఒక నీలిరంగు పువ్వు, కొన్ని నల్ల నువ్వులు తీసుకుని, మీ తలపై నుంచి 7 సార్లు తిప్పి, ప్రవహించే నీటిలో లేదా అరటి చెట్టు కింద వదలేయాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
ధనుస్సు రాశి
ఆరుద్ర నక్షత్రంలో సూర్య సంచారం.. ధనుస్సు రాశి వారికి వ్యక్తిగత జీవితంలో గందరగోళాన్ని సృష్టిస్తుంది. వైవాహిక జీవితంలో లేదా ప్రేమ సంబంధాల్లో అపనమ్మకం లేదా అనవసర వాదనలు జరుగుతాయి. రాహువు ప్రభావం తప్పుడు అవగాహనను పెంచుతుంది. ఇది సంబంధాల్లో దూరం పెంచుతుంది. ఈ సమయంలో ప్రశాంతంగా పరిస్థితిని ఎదుర్కోవాలి. అలాగే విదేశి ప్రయాణం లేదా చట్టపరమైన విషయాలకు సంబంధించి ఏదైనా ముఖ్యమైన నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేయడం మంచిది. ఆధ్యాత్మిక కార్యకలాపాలపై దృష్టి పెట్టడం మీకు ప్రయోజనకరం.
పరిహారం:
జ్యోతిష్య నిపుణుల ప్రకారం మంగళవారం లేదా శనివారం ఒక నిమ్మకాయ, కొబ్బరికాయ తీసుకుని మీ తల చుట్టూ 7 సార్లు తిప్పండి. తర్వాత కొద్దిగా ప్రవహించే నీటిలో వేసి, 'దుర్గా చాలీసా' లేదా 'రాహు కవచం' పఠించండి. మంచి జరుగుతుంది.