Zodiac Signs: సూర్యోదయం, సూర్యాస్తమయాల్లో మార్పు.. ఈ 3 రాశులకు అన్ని శుభాలే!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ 21న సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో తేడా ఉండనుంది. దీన్ని ఉత్తరాయణం అంటారు. ఈ రోజున సూర్యోదయం కాస్త ముందుగా.. సూర్యాస్తమయం కాస్త ఆలస్యంగా అవుతుందట. దీనివల్ల 3 రాశులవారికి మేలు జరుగనుంది. మరి ఆ రాశులేంటో చూద్దామా...

జూన్ 21న ఉత్తరాయణం
సాధారణంగా ఒక రోజులో 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి ఉంటుంది. కానీ జూన్ 21న పగటి సమయం కాస్త ఎక్కువగా ఉంటుంది. ఆ రోజున సూర్యోదయం ఉదయం 5:24కి, సూర్యాస్తమయం సాయంత్రం 7:22కి ఉంటుంది. ప్రదేశాన్ని బట్టి ఈ సమయం మారవచ్చు. సాధారణ రోజులతో పోలిస్తే జూన్ 21న సూర్య కిరణాలు భూమిపై 14 నుంచి 16 గంటల వరకు పడతాయి. దీనివల్ల కొన్ని రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయట. మరి ఆ రాశులేంటో చూద్దామా..
మేష రాశి
మేష రాశిని సూర్యుడికి ఇష్టమైన రాశిగా భావిస్తారు. జూన్ నెలలో సూర్య సంచారం వల్ల వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి. వ్యాపారులకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. డబ్బు కష్టాలు తీరతాయి. పెళ్లైన వారు జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ప్రేమ జీవితంలోని సమస్యలు తొలగిపోతాయి. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది.
సింహ రాశి
జూన్‌లో సూర్య సంచారం వల్ల సింహ రాశి వారికి ఎక్కువ లాభం ఉంటుంది. బంధువులతో సంబంధాలు బాగుంటాయి. వివాహితులకు సుఖసౌకర్యాలు లభిస్తాయి. వ్యాపారులు మంచి చోట పెట్టుబడి పెట్టడం వల్ల లాభాలు పొందుతారు. ఈ నెలలో ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగులకు ప్రయాణాలు కలిసివస్తాయి.
ధనుస్సు రాశి
మేష, సింహ రాశులతో పాటు ధనుస్సు రాశి వారికి కూడా జూన్ నెలలో సూర్య గోచారం వల్ల ప్రయోజనం ఉంటుంది. వ్యాపారులకు ఆర్థిక లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగులకు మంచి ఫలితాలు లభిస్తాయి. సామాజిక గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.

