- Home
- Astrology
- Zodiac Signs: ఈ 5 రాశుల వారిపై దిష్టి ప్రభావం ఎక్కువ .. జాగ్రత్తగా లేకపోతే కష్టాలు తప్పవు!
Zodiac Signs: ఈ 5 రాశుల వారిపై దిష్టి ప్రభావం ఎక్కువ .. జాగ్రత్తగా లేకపోతే కష్టాలు తప్పవు!
హిందూ ధర్మంలో దిష్టి లేదా చెడు కన్నును.. తీవ్రంగా పరిగణిస్తారు. ఇది జీవిత గమనాన్ని ప్రభావితం చేస్తుందని నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశులవారు చెడుకన్ను ప్రభావానికి ఎక్కువగా లోనవుతారట. మరి ఆ రాశులేంటో ఓసారి తెలుసుకోండి.

ఏ రాశులవారికి దిష్టి ఎక్కువగా తగులుద్ది?
జ్యోతిష్య శాస్త్రంలో చెడుకన్ను లేదా ప్రతికూల శక్తిని తీవ్రంగా పరిగణిస్తారు. ఒక వ్యక్తి అసూయ మరొకరికి హాని కలిగిస్తుందని నమ్ముతారు. జీవితంలో చాలాసార్లు ఎలాంటి కారణం లేకుండా వచ్చే అడ్డంకులు, మానసిక ఒత్తిడి లేదా ఆకస్మిక సమస్యలు చెడుకన్నుకు సంకేతం. కొన్ని రాశులవారు చాలా సున్నితంగా, ఆకర్షణీయంగా ఉండడం వల్ల తరచూ ప్రతికూల ప్రభావానికి లోనవుతుంటారు. ఏ రాశి వారికి దిష్టి ఎక్కువగా తగులుతుంది? అది వారిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇక్కడ తెలుసుకుందాం.
మిథున రాశి
జ్యోతిష్య శాస్త్రంలో మిథున రాశి వారిని ఎమోషనల్ పర్సన్ గా పరిగణిస్తారు. ఈ రాశివారు విశాలమైన మనసు కలిగి ఉంటారు. వారు ఇతరులతో ఎంత త్వరగా కలిసిపోతారో.. అంతే త్వరగా ఇతరుల అసూయ, ప్రతికూల ప్రకంపనలను కూడా గ్రహిస్తారు. వారిపై ప్రతికూల శక్తి పడినప్పుడు ఆందోళన, ఒత్తిడి, మానసిక స్థితి మార్పులను ఎదుర్కొంటారు. కొన్నిసార్లు వారు శక్తిని కోల్పోతారు. ఏ పని చేయడానికి కూడా ఇష్టపడరు.
కర్కాటక రాశి
కర్కాటక రాశివారు బయటకు గంభీరంగా కనిపిస్తారు. కానీ లోపల చాలా సాఫ్ట్ గా ఉంటారు. కుటుంబాన్ని ప్రేమిస్తారు. వీరి స్నేహపూర్వక స్వభావం ఇతరులను ఆకర్షిస్తుంది. కానీ అదే అసూయకు కూడా కారణమవుతుంది. వీరిపై చెడు కన్ను పడినప్పుడు మానసిక అస్థిరతను ఎదుర్కొంటారు. భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోలేరు.
కన్య రాశి
కన్య రాశిలో జన్మించిన వ్యక్తులు చురుకైన మనసు, ఖచ్చితమైన విశ్లేషణాత్మక సామర్థ్యాలను కలిగి ఉంటారు. కానీ వారి అతిగా ఆలోచించే అలవాటు వారిని దుష్ట శక్తి ప్రభావానికి గురి చేస్తుంది. వారిపై చెడుకన్ను పడినప్పుడు వారు తీవ్ర చంచలత్వం, నిద్రలేమి, శారీరక బలహీనత వంటి లక్షణాలను అనుభవిస్తారు.
తుల రాశి
తుల రాశివారు వారు సౌమ్యంగా, బ్యాలెన్స్డ్ గా ఉంటారు. ఈ లక్షణం ఇతరుల అసూయకు కారణమవుతుంది. వీరు త్వరగా చెడుకన్ను ప్రభావానికి గురవుతారు. వీరికి దిష్టి తగిలినప్పుడు మనసు కలత చెందుతుంది. అలసట, చిరాకు కనిపిస్తాయి.
మీన రాశి
మీన రాశి వారు అత్యంత సున్నితంగా, ఆధ్యాత్మికంగా ఉంటారు. వీరు సాధారణంగా ఇతరుల భావాలను చాలా లోతుగా అర్థం చేసుకుంటారు. ప్రతికూల శక్తి వీరిపై చాలా త్వరగా ప్రభావం చూపుతుంది. దీనివల్ల వీరు ఎమోషనల్ గా అస్థిరంగా మారవచ్చు.