Sun Transit: సింహ రాశిలోకి సూర్యుడు.. ఈ రాశుల జీవితాల్లో ఊహించని మార్పులు!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి నెలా సూర్యుడు తన రాశిని మారుస్తాడు. ఈ రాశి మార్పును సంక్రాంతి అంటారు. త్వరలో సూర్యుడు సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. దానివల్ల కొన్ని రాశులవారి జీవితాల్లో ఊహించని మార్పులు రానున్నాయి. మరి ఆ రాశులేంటో చూద్దామా..

సూర్యుడి రాశిమార్పు..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆగస్టు 17న సూర్యుడు సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుని శుభ ప్రభావంతో ఒక వ్యక్తి జీవితంలో గౌరవాన్ని పొందుతాడు. స్థానం, ప్రతిష్ట పెరుగుతాయి. జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడిని జీవశక్తికి కారకుడిగా భావిస్తారు. సింహ రాశిలోకి ప్రవేశించిన సూర్యుడు.. కొన్ని రాశుల వారికి ప్రయోజనం చేకూరుస్తాడు. మరి ఆ రాశులేంటో.. వారికి ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.
మేష రాశి
సూర్య సంచార శుభ ప్రభావంతో మేష రాశి వారికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. భూమి లేదా వాహనం కొనుగోలు చేయవచ్చు. ప్రేమ సంబంధాలు బాగుంటాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. ఏ పని చేసినా విజయం మీ సొంతం అవుతుంది.
మిథున రాశి
మిథున రాశి వారికి సూర్య సంచారం చాలా శుభప్రదం. దాంపత్య జీవితం అద్భుతంగా ఉంటుంది. విదేశీ ప్రయాణం చేయవచ్చు. జీవనశైలి మెరుగుపడుతుంది. జీవితంలో ఆనందం పెరుగుతుంది. పాత పెట్టుబడుల నుంచి ఆదాయం వస్తుంది. కుటుంబ జీవితంలో సంతోషం, శాంతి ఉంటాయి.
సింహ రాశి
సూర్య సంచారం ప్రభావంతో సింహ రాశి వారు సౌకర్యాలు, ఐశ్వర్యాల మధ్య సమయం గడుపుతారు. డబ్బు పెరుగుతుంది. విజయానికి అడ్డంకులు తొలగిపోతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి సూర్య సంచారం లాభదాయకం. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతి దక్కుతుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. జీవితంలో ఊహించని సానుకూల మార్పులు ఉంటాయి.