Zodiac Signs: కన్య రాశిలోకి కుజుడు.. ఈ 5 రాశులవారికి కష్టాలు తప్పవు!
శక్తి, ధైర్యం, పరాక్రమానికి కారకుడైన కుజుడు జూలై చివరి వారంలో కన్య రాశిలోకి ప్రవేశించనున్నాడు. కుజుడి రాశిమార్పు వల్ల 5 రాశులవారికి అశుభ ఫలితాలున్నాయి. మరి ఆ రాశులేంటో ఓసారి చూసేయండి.
- FB
- TW
- Linkdin
Follow Us

కుజుడి సంచారం..
జూలై 28న కుజుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది కుజ, బుధ గ్రహాల మధ్య సంయోగాన్ని సృష్టిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కుజుడు, బుధుడు శత్రు గ్రహాలు. వాటి సంయోగం 5 రాశుల వారికి అశుభ ఫలితాలనిస్తుంది. ఉద్యోగం నుంచి ఆర్థిక పరిస్థితి వరకు చాలా నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఆ రాశులేంటో చూద్దామా..
మిథున రాశి
కుజ గ్రహ సంచారం మిథున రాశి వారికి ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. అనవసరమైన వాటికి డబ్బు ఖర్చు చేస్తారు. ఇంట్లో అశాంతి పెరుగుతుంది. ఉద్యోగంలో చికాకు వాతావరణం ఉంటుంది. బంధువులతో వివాదాలు తలెత్తవచ్చు.
తుల రాశి
తుల రాశి వారికి ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. ఆరోగ్యం సహకరించదు. ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంటా బయట గంధరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. ప్రత్యర్థులు గట్టి పోటీ ఇస్తారు.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి కుజ, బుధ గ్రహాల సంయోగం వల్ల వృత్తి జీవితంలో సవాళ్లు ఎదురవుతాయి. ఎక్కువ శ్రద్ధతో పనిచేయాల్సి ఉంటుంది. ఆఫీస్ రాజకీయాలకు దూరంగా ఉండడం మంచిది. కష్టానికి తగిన ఫలితం దక్కదు.
మకర రాశి
మకర రాశి వారికి ఈ సమయం అస్సలు కలిసిరాదు. ఈ రాశివారు ప్రయాణాలు మానుకోవాలి. చాలా జాగ్రత్తగా పనిచేయాలి. గాయాలు అయ్యే అవకాశం ఉంది. ఓపికగా ఉంటే ఈ సమయం సులువుగా గడిచిపోతుంది.
మీన రాశి
మీన రాశివారికి భాగస్వామ్య వ్యాపారాల్లో నష్టాలు రావచ్చు. లేదా భాగస్వామ్యం ముగిసిపోవచ్చు. వైవాహిక జీవితంలో కూడా సమస్యలు రావచ్చు. ఓర్పు, అవగాహనతో వ్యవహరిస్తే మంచిది. గొడవలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.