- Home
- Astrology
- Sun Venus Conjunction: సూర్య, శుక్రుల కలయిక.. ఈ 5 రాశులవారికి అదృష్టం తలుపు తట్టినట్లే!
Sun Venus Conjunction: సూర్య, శుక్రుల కలయిక.. ఈ 5 రాశులవారికి అదృష్టం తలుపు తట్టినట్లే!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం త్వరలో సూర్యుడు, శుక్రుడు ధనుస్సు రాశిని విడిచి మకరరాశిలోకి ప్రవేశించనున్నారు. ఈ ప్రభావం వల్ల అత్యంత శక్తివంతమైన శుక్రాదిత్య రాజయోగం ఏర్పడనుంది. ఈ యోగం 5 రాశులవారికి అద్భుతమైన ప్రయోజనాలు అందించనుంది. ఆ రాశులేంటో చూద్దాం.

శుక్రాదిత్య రాజయోగం జనవరి 2026
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రస్తుతం సూర్య, శుక్ర గ్రహాలు ధనుస్సు రాశిలో సంచరిస్తున్నాయి. జనవరి 14న సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటికే శుక్రుడు కూడా మకరరాశిలో ఉంటాడు. మకరరాశిలో సూర్య, శుక్రుల కలయిక వల్ల శక్తివంతమైన శుక్రాదిత్య యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కొన్ని రాశులవారికి అదృష్టాన్ని తీసుకురానుంది. ఆ రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం.
మేష రాశి
మేషరాశి 10వ ఇంట్లో సూర్య, శుక్రల కలయిక జరగనుంది. దీనివల్ల ఈ రాశివారికి వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. ఉద్యోగ మార్పు కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. తండ్రి నుంచి ఆస్తులు వచ్చే అవకాశం ఉంది. పూర్వీకుల ఆస్తి ద్వారా లాభం ఉంటుంది. పెండింగ్ లో ఉన్న పనులు చకచకా పూర్తవుతాయి.
మిథున రాశి
మిథున రాశి 7వ ఇంట్లో శుక్రాదిత్య రాజయోగం ఏర్పడనుంది. ఈ సమయంలో ఈ రాశివారికి వ్యాపారాల్లో సూపర్ గా కలిసివస్తుంది. లాభాలు రెట్టింపవుతాయి. వ్యాపార భాగస్వామ్యాలు, సంబంధాలు మెరుగుపడతాయి. ఉద్యోగాల్లో ఉన్నతాధికారుల ఆదరణ పెరుగుతుంది. అన్నివైపుల నుంచి ఆదాయం వస్తుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆగిపోయిన పెళ్లిళ్లు జరుగుతాయి. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది.
సింహ రాశి
సింహరాశి అధిపతి సూర్యుడు. కాబట్టి శుక్రాదిత్య రాజయోగం ఈ రాశివారికి మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశివారికి అన్నింట్లో అదృష్టం కలిసివస్తుంది. ముఖ్యంగా కళలు, మీడియా రంగాల వారికి డబ్బు, కీర్తి లభిస్తాయి. పిల్లల ద్వారా శుభవార్తలు అందుతాయి. వారి పురోగతి ఆనందాన్నిస్తుంది. ఈ రాశివారికి ఊహించని ధన లాభం, ఆస్తి యోగాలు ఉన్నాయి.
కన్య రాశి
కన్య రాశి 4వ ఇంట్లో సూర్య, శుక్రుల కలయిక జరగనుంది. దానివల్ల వీరి జీవితంలో సుఖ, సంతోషాలు పెరుగుతాయి. ఆస్తి లాభం కలుగుతుంది. కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేస్తారు. తల్లి వైపు నుంచి సహాయం అందుతుంది. కుటుంబ సమస్యలు తీరుతాయి. దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో స్థిరమైన పురోగతి ఉంటుంది. వ్యాపారాలు లాభాల బాట పడతాయి.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి శుక్రాదిత్య రాజయోగం శుభ ఫలితాలనిస్తుంది. ఈ యోగం ప్రభావంతో ఈ రాశివారి ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి. వీరి మాటతీరు అందరినీ ఆకట్టుకునే విధంగా మారుతుంది. చేపట్టిన పనుల్లో విజయం లభిస్తుంది. అన్నివైపుల నుంచి ఆదాయం వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త అందుతుంది.

