Saturn Transit: 30 ఏళ్ల తర్వాత సొంత నక్షత్రంలోకి శని.. ఈ 3 రాశుల పంట పండినట్లే!
జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది. శని సంచారం మానవ జీవితాల్లో ఊహించని మార్పులు తీసుకువస్తుంది. దాదాపు 30 ఏళ్ల తర్వాత శని గ్రహం తన సొంత నక్షత్రంలోకి ప్రవేశించనుంది. దీంతో 3 రాశుల వారి జీవితంలో కాసుల వర్షం కురువనుంది.

సొంత నక్షత్రంలోకి శని
శని నెమ్మదిగా కదిలే గ్రహం. కర్మ, న్యాయం, క్రమశిక్షణ, దీర్ఘకాలిక ఫలితాలకు ప్రసిద్ధి. శని ప్రతి కదలిక మానవ జీవితాల్లో ఊహించని మార్పులు తీసుకువస్తుంది. శని ప్రభావం ఉన్నప్పుడు జీవితంలో కష్టాలు, ఆలస్యాలు, బాధ్యతలు పెరిగినట్టు అనిపించినా.. నిజాయతీ, శ్రమ, సహనం ఉన్నవారికి శని దీర్ఘకాలిక స్థిరత్వం, గౌరవం, విజయం అందిస్తాడని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. త్వరలో (జనవరి 20) శని పూర్వాభాద్ర నక్షత్రం నుంచి ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి సంచరించనున్నాడు. ఈ నక్షత్రానికి అధిపతి శని. సొంత రాశి లోకి శని ప్రవేశం వల్ల 3 రాశులవారికి అద్భుతమైన ఫలితాలు దక్కనున్నాయి. ఆ రాశులేంటో, వారికి కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం.
వృషభ రాశి
వృషభ రాశివారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. గత ప్రయత్నాలు ఇప్పుడు ఫలిస్తాయి. కుటుంబంలో శాంతి, సంతోషం ఉంటాయి. భవిష్యత్ ప్రణాళికలకు బలమైన పునాది పడుతుంది. వ్యాపార విస్తరణ అవకాశాలు రావచ్చు. ఖర్చులు నియంత్రణలో ఉంటాయి. పెట్టుబడి నిర్ణయాలు లాభదాయకంగా మారుతాయి. సమాజంలో, సంబంధాలలో గౌరవం పెరుగుతుంది. ఆకస్మిక ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగాలలో మంచి గుర్తింపు దక్కుతుంది.
మకర రాశి
మకర రాశిని శని పాలిస్తాడు. కాబట్టి ఈ సంచారం మకర రాశివారికి ప్రత్యేక శక్తిని ఇస్తుంది. కెరీర్‌లో స్థిరమైన పురోగతి ఉంటుంది. బాధ్యతలు పెరిగినా ఫలితాలు బలంగా ఉంటాయి. పొదుపు, పెట్టుబడులు లాభాలను తెస్తాయి. ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేస్తారు. ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. దీర్ఘకాలిక అడ్డంకులు తొలగిపోతాయి. ఉద్యోగాలలో మీ కష్టానికి తగిన ఫలితం, ప్రశంసలు లభిస్తాయి. ప్రమోషన్ లేదా పదవి మార్పు అవకాశాలు ఉన్నాయి. శని ప్రభావంతో ఈ రాశివారి నాయకత్వ సామర్థ్యాలు పెరుగుతాయి.
మీన రాశి
శని తన సొంత నక్షత్రంలో సంచరించడం వల్ల మీన రాశివారికి స్థిరత్వం, శ్రేయస్సు కలుగుతాయి. నిలిచిపోయిన ప్రాజెక్టులు వేగం పుంజుకుంటాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడవచ్చు. కుటుంబ అవసరాలు సులభంగా తీరుతాయి. మీ కష్టానికి తగిన ఫలితాలు దక్కుతాయి. సమాజంలో, కుటుంబంలో మీరంటే గౌరవం, విశ్వాసం పెరుగుతాయి. పెద్దల నుంచి మద్ధతు, మార్గదర్శకత్వం లభిస్తుంది. మానసిక ఒత్తిడి తగ్గి ఆత్మవిశ్వాసం బలపడుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. సంతోషంగా, సంతృప్తిగా ఉంటారు.

