Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారికి నరదిష్టి ఎక్కువ.. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది!
మన జీవితం కొన్నిసార్లు మన చేతుల్లో ఉండదు. ఎంత జాగ్రత్తగా ఉన్నా అనుకోని సమస్యలు, అడ్డంకులు, అపజయాలు ఎదురవుతుంటాయి. దీనికి కారణం నరదిష్టి ప్రభావమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కొన్ని తేదీల్లో పుట్టినవారిపై ఈ ప్రభావం ఎక్కువట. ఆ తేదీలేంటో చూద్దాం.

జన్మ తేదీ ప్రకారం నరదిష్టి ప్రభావం
కొందరి జీవితంలో అనుకోని అడ్డంకులు, ప్రమాదాలు లేదా మానసిక ఒత్తిడులు ఎక్కువగా ఎదురవుతుంటాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దీనికి గ్రహస్థితులు, జన్మ తేదీలు, నక్షత్ర ప్రభావాలు ప్రధాన కారణాలు. ముఖ్యంగా కొన్ని ప్రత్యేక తేదీల్లో పుట్టినవారిపై నరదిష్టి లేదా దురదృష్ట ప్రభావం ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్య విశ్లేషణలు చెబుతున్నాయి. ఆ తేదీలేంటో వివరంగా తెలుసుకుందాం.
ఏ నెలలో అయినా ఈ తేదీల్లో పుట్టినవారికి..
ఏ నెలలో అయినా 4, 8, 13, 17, 22, 26, 31 తేదీల్లో పుట్టినవారిపై నరదిష్టి ఎక్కువని జ్యోతిష్య విశ్లేషణలు చెబుతున్నాయి. ఈ ప్రభావం ఉన్నవారికి జీవితం నిదానంగా సాగడం, కష్టపడి సాధించాల్సిన పరిస్థితులు రావడం, అనవసరమైన వివాదాలు ఎదురుకావడం వంటివి జరుగుతుంటాయి. అంతేకాదు రాహు, కేతు ప్రభావం వల్ల అకస్మాత్తుగా సమస్యలు రావడం, మోసాలకు గురయ్యే అవకాశాలు, మానసిక అస్థిరత వంటివి ఎక్కువగా ఉంటాయి.
ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి
జ్యోతిష్య శాస్ర్తం ప్రకారం నరదిష్టి ఎక్కువగా ఉన్నవారు సాధారణంగా మంచి ఉద్దేశంతో చేసిన పనుల్లో కూడా చివరి దశలో అడ్డంకులు వస్తాయి. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే నష్టాలు వచ్చే అవకాశం ఎక్కువ. అలాగే రోడ్డు ప్రయాణాలు, యంత్రాలతో పనిచేసే సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి.
చిన్న మాట కూడా..
అలాగే ఈ తేదీల్లో పుట్టినవారు కోపాన్ని నియంత్రించుకోవడం, మాటల్లో సంయమనం పాటించడం చాలా అవసరం. ఎందుకంటే నరదిష్టి ప్రభావంలో ఉన్నప్పుడు చిన్న మాట పెద్ద గొడవకు దారితీయవచ్చు. అలాగే ఎవరినీ నమ్మి వెంటనే డబ్బు లేదా బాధ్యతలు అప్పగించకుండా, ప్రతి విషయాన్ని రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యంగా సంతకం చేసే ముందు పత్రాలను జాగ్రత్తగా చదవడం, చట్టపరమైన విషయాల్లో నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ఈ ప్రభావం శాశ్వతం కాదు..
జ్యోతిష్య నిపుణుల ప్రకారం నరదిష్టి శాశ్వతం కాదు. గ్రహ దశలు మారినప్పుడు, శుభగ్రహాల ప్రభావం పెరిగినప్పుడు ఈ దిష్టి ప్రభావం తగ్గుతుంది. భయపడకుండా జాగ్రత్తలు తీసుకోవడం, ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించడం ముఖ్యం. ప్రతిరోజూ ఉదయం సూర్య నమస్కారం చేయడం, శని లేదా రాహు కేతువులకు సంబంధించిన మంత్రాలను జపించడం, దానం చేయడం వంటి పరిహారాలు ఉపశమనం కలిగిస్తాయి.

