Shani Mahayogam: శని మహారాజయోగం.. ఈ 5 రాశులకు గుడ్ టైం స్టార్ట్ అయినట్లే!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రస్తుతం శని వక్రగమనంలో ఉన్నాడు. దీనివల్ల మహా విపరీత రాజయోగం, కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడింది. వీటి ప్రభావం వల్ల 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారం కానుంది. మరి ఆ రాశులేంటో.. వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇక్కడ చూద్దాం.

మహా విపరీత రాజయోగం..
జూలై 13న శని మీనరాశిలో వక్రించడం వల్ల మహా విపరీత రాజయోగం, కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడింది. జ్యోతిష్యంలో ఈ రాజయోగాన్ని అత్యంత శక్తివంతమైనది, అరుదైనదిగా పరిగణిస్తారు. ఈ యోగం ఏర్పడటం వల్ల కొన్ని రాశులవారు సంపద, శ్రేయస్సు, కీర్తి, గౌరవాన్ని పొందుతారు. ముఖ్యంగా ఎవరి జాతకంలో శని శుభ స్థానంలో ఉంటాడో, వారు దీని నుంచి ఎక్కువ ప్రయోజనం పొందుతారు. మరి ఆ రాశులేంటో చూద్దామా..
మిథున రాశి
మిథున రాశివారికి విపరీత రాజయోగం శుభ ఫలితాలనిస్తుంది. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి, ఆర్థిక లాభం కలగవచ్చు. వ్యాపారంలో భాగస్వామ్యం ప్రయోజనకరం. వ్యాపారాల్లో కొత్త ఒప్పందాలు లేదా భాగస్వామ్యాల ద్వారా లాభపడవచ్చు. ఉద్యోగులకు జీతం పెరుగుదల, పదోన్నతి లభించవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కోరికలు నెరవేరుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశివారికి ఈ రాజయోగం సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఆకస్మిక ధనలాభం కలగవచ్చు. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. సంబంధాలు మెరుగుపడతాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు లభించవచ్చు.
మకర రాశి
మకర రాశివారికి విపరీత రాజయోగం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తిలో కొత్త విజయాలు సాధిస్తారు. వ్యాపారులకు ఈ సమయం కలిసివస్తుంది. కొత్త ప్రాజెక్టులను అమలు చేయడానికి అనుకూలం. విద్యార్థులు చదువులో విజయం సాధిస్తారు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశివారికి శని కేంద్ర త్రికోణ రాజయోగం శుభప్రదం. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయి. అదృష్టం వారికి అనుకూలంగా ఉంటుంది. పెళ్లికాని వారికి పెళ్లి ప్రతిపాదనలు రావచ్చు. ఇంటి నిర్మాణం, వాహనం కొనుగోలు లేదా పెద్ద పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. వ్యాపారాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆగిపోయిన పనులు చకచక పూర్తవుతాయి.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశివారికి శని కేంద్ర త్రికోణ రాజయోగం మంచి ఫలితాలనిస్తుంది. ఆస్తి, వాహనం, ఇల్లు కొనుగోలు చేయవచ్చు. జీవితం ప్రశాంతంగా ఉంటుంది. శని దశ ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి. మంచి వివాహ ప్రతిపాదనలు రావచ్చు. భాగస్వామ్య వ్యాపారంలో లాభాలు రావచ్చు. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. పాత అప్పుల నుంచి బయటపడే అవకాశం ఉంది.