Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారితో జాగ్రత్త.. లవ్ ని, లవర్ ని ఈజీగా వదిలేస్తారు!
సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేకమైన తేదీల్లో పుట్టినవారు ప్రేమ బంధాన్ని చాలా ఈజీగా వదిలేస్తారట. చిన్న కారణం దొరికినా ప్రేమకు గుడ్ బై చెప్పేస్తారట. మరి ఏ తేదీల్లో పుట్టినవారు ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటారో ఇక్కడ చూద్దాం.

ఏ తేదీల్లో పుట్టినవారు ప్రేమ బంధాన్ని ఈజీగా వదిలేస్తారు?
ప్రేమ.. అందమైన భావన. కొందరు ప్రేమికులు వారి బంధాన్ని నిలబెట్టుకునేందుకు ఏదైనా చేస్తారు. ఎంత దూరమైనా వెళ్తారు. మరికొందరు మాత్రం చిన్న కారణంతో కూడా బంధాన్ని వదిలేస్తారు. సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన వ్యక్తులు చాలా తేలికగా ప్రేమకు గుడ్‌బై చెప్పేస్తారట. మరి ఏ తేదీల్లో జన్మించినవారు ఇలా ఉంటారో ఓసారి చూసేయండి.
ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో పుట్టినవారు
ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో పుట్టినవారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. వీరికి స్వతంత్రమే మొదటి ప్రాధాన్యం. ప్రేమలో ఏ చిన్న అడ్డంకి వచ్చినా.. దాన్ని తట్టుకుని ముందుకెళ్లడం కన్నా, వదిలేసి జీవితాన్ని ప్లాన్ చేసుకోవడమే మంచిది అనుకుంటారు. ప్రతి దానికి లాజిక్ వెతుకుతారు.
5, 14, 23 తేదీల్లో పుట్టినవారు..
సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏ నెలలో అయినా 5, 14, 23 తేదీల్లో జన్మించిన వారు ఫాస్ట్ గా ఎదగాలి అనుకుంటారు. ఆడుపాడుతూ జీవించాలనుకుంటారు. ఈ తేదీల్లో పుట్టినవారు చాలా భిన్నంగా ఉంటారు. ఒకే బంధంలో ఉండడం.. ఎమోషన్లతో నిండిపోయే జీవితం వీరికి బోరుగా అనిపిస్తుంది. మొదట ప్రేమిస్తారు కానీ… చిన్న కారణం దొరికితే చాలు గుడ్ బై చెప్పేస్తారు. అవకాశాల కోసం ఎదురు చూస్తూ ప్రేమను తక్కువచేసి చూస్తారు.
7, 16, 25 తేదీల్లో జన్మించినవారు
ఏ నెలలో అయినా 7, 16, 25 తేదీల్లో జన్మించిన వారు అంతర్ముఖులు. ఎక్కువగా ఫీలయ్యే స్వభావం కలిగినవారు. ఈ స్వభావం వల్ల ప్రేమలో ఒక్క చెడు అనుభవం ఎదురైతే చాలు.. ఆ బంధాన్ని వదిలేస్తారు. తమ మనస్సు ఇంకోసారి దెబ్బ తినకూడదని అనుకుంటారు. వీరు బంధాలకంటే ప్రశాంతతకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.
4, 13, 22, 31 తేదీల్లో పుట్టినవారు..
న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో అయినా 4, 13, 22, 31 తేదీల్లో పుట్టినవారు ఖచ్చితత్వానికి పెద్దపీట వేస్తారు. ఒకసారి ప్రేమలో పడితే, వారు ఎలా ఆశిస్తున్నారో అలా ఎదుటివారు ఉండకపోతే.. వారు ఆ బంధాన్ని వదిలేయడానికి వెనకాడరు. ప్రేమ బంధంలో ఏ చిన్న ఆటంకం వచ్చినా ఆ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తారు.
గమనిక
ఈ సమాచారం.. పాఠకుల ఆసక్తి మేరకు పలువురు జ్యోతిష్య నిపుణుల సూచనల ఆధారంగా అందించింది మాత్రమే.

