MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Sun Venus Conjunction: సూర్య శుక్రుల కలయికతో ఈ 3 రాశులవారికి గోల్డెన్ టైమ్.. మీ రాశి ఉందా?

Sun Venus Conjunction: సూర్య శుక్రుల కలయికతో ఈ 3 రాశులవారికి గోల్డెన్ టైమ్.. మీ రాశి ఉందా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం త్వరలో సూర్య, శుక్ర గ్రహాలు మీన రాశిలో కలవనున్నాయి. దానివల్ల శక్తివంతమైన శుక్రాదిత్య రాజయోగం ఏర్పడనుంది. ఈ రాజయోగం మూడు రాశుల వారికి అదృష్టం, సంపద రెట్టింపు చేయనుంది. మరి ఆ 3 రాశులవారికి ఏయో విషయాల్లో కలిసివస్తుందో చూడండి.

2 Min read
Author : Kavitha G
Published : Mar 03 2026, 05:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
శుక్రాదిత్య రాజయోగం
Image Credit : Pixabay

శుక్రాదిత్య రాజయోగం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్య, శుక్ర గ్రహాలు ప్రతినెలా రాశులను మారుస్తుంటాయి. మార్చిలో ఈ రెండు గ్రహాల సంచారం వల్ల మీన రాశిలో శుక్రాదిత్య రాజయోగం ఏర్పడనుంది. ప్రస్తుతం సూర్యుడు కుంభరాశిలో, శుక్రుడు తన ఉచ్ఛ స్థానమైన మీన రాశిలో ఉన్నాడు. పండితుల ప్రకారం, మార్చి 15న సూర్యుడు కూడా మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో ఏర్పడే శుక్రాదిత్య రాజయోగం మూడు రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తుంది. మరి ఆ అదృష్ట రాశులేవో చూద్దామా.. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మీన రాశి
Image Credit : Getty

మీన రాశి

మీన రాశివారికి శుక్రాదిత్య రాజయోగం అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఈ సమయంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. విదేశాల్లో చదువుకోవాలనే విద్యార్థుల కల నెరవేరే అవకాశం ఉంది. ఆదాయంతో పాటు, ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడుల నుంచి మంచి లాభాలు పొందుతారు.

34
మిథున రాశి
Image Credit : Pixabay

మిథున రాశి

సూర్య, శుక్రల దయతో మిథున రాశి వారికి ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. సమాజంలో గౌరవం, గుర్తింపు పెరుగుతాయి. కుటుంబ సంబంధాలు బలపడతాయి. జీవితంలో సానుకూల మార్పులు చూస్తారు. వైవాహిక జీవితంలో ప్రేమ, సామరస్యం ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారంలో మంచి ఫలితాలు చూసే అవకాశం ఉంది. కెరీర్‌లో పురోగతికి మార్గాలు తెరుచుకుంటాయి. తండ్రితో సంబంధాలు మెరుగుపడతాయి. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది.

44
తుల రాశి
Image Credit : Asianet News

తుల రాశి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రాదిత్య రాజయోగం తుల రాశి వారికి శుభప్రదంగా, ప్రయోజనకరంగా ఉంటుంది. పెళ్లికాని వారికి మంచి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. వ్యాపారాలలో గతంలో ఎన్నడూ చూడని లాభాలు చూస్తారు. నిరుద్యోగులకు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అవకాశం దక్కుతుంది. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు లేదా జీతం పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సౌకర్యాలు పెరుగుతాయి. పెట్టుబడులకు ఇది మంచి సమయం. కానీ ఆలోచించి సరైన చోట పెట్టుబడి పెట్టడం మంచిది. కొత్త ఇల్లు, లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశాలు బలంగా ఉన్నాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు విలువైన వస్తువులను బహుమతులుగా పొందుతారు!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి దూరప్రాంతాల నుంచి అందిన వార్త ఆనందం కలిగిస్తుంది!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు కీలక విషయాల్లో సొంత ఆలోచనలతో ముందుకు సాగడం మంచిది!
Related Stories
Recommended image1
Planets Retrograde: 4 గ్రహాల వక్రగమనం.. అదృష్టం మొత్తం ఈ 6 రాశులదే.. డబ్బే డబ్బు!
Recommended image2
Holi 2026: హోలీ పండగ నుంచి ఈ 4 రాశులవారి జీవితం మారిపోవడం పక్కా.. అన్నీ శుభవార్తలే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved