- Home
- Astrology
- Saturn Transit: 27 ఏళ్ల తర్వాత సొంత నక్షత్రంలోకి శని.. ఈ మూడు రాశులకు ఇక తిరుగు లేదు..!
Saturn Transit: 27 ఏళ్ల తర్వాత సొంత నక్షత్రంలోకి శని.. ఈ మూడు రాశులకు ఇక తిరుగు లేదు..!
Saturn Transit: జోతిష్యశాస్త్రం ప్రకారం, 27 సంవత్సరాల తర్వాత శని తన సొంత నక్షత్రమైన ఉత్తరాభాద్రపదలో ప్రవేశించనున్నాడు. ఇది కొన్ని రాశులకు అదృష్టాన్ని తీసుకువస్తుంది.

శని నక్షత్ర మార్పు..
వేద జోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాలు కాలానుగుణంగా నక్షత్రాలను, రాశులను మార్చుకుంటూ ఉంటాయి. ఈ మార్పు.. మన జీవితాలను చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటుంది.కర్మకు కారకుడు, న్యాయ నిర్ణేత అయిన శని గ్రహం జనవరి 20న తన సొంత నక్షత్రమైన ఉత్తరాభాద్రపద నక్షత్రంలో ప్రవేశించనున్నాడు. ఈ నక్షత్రానికి శని అధిపతి. దీని ఫలితంగా, కొన్ని రాశుల వారి అదృష్టం పెరుగుతుంది. ఆ రాశులేంటో చూద్దాం...
మకర రాశి..
సొంత నక్షత్రంలోకి శని సంచారం మకర రాశివారికి చాలా ప్రయోజనాలను కలిగించనుంది. శని మీ రాశి నుండి మూడో ఇంట్లో సంచరిస్తున్నాడు. అందువల్ల, ఈ సమయంలో మీ ధైర్యం, పరాక్రమం పెరుగుతాయి. మీ ఉద్యోగం, వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి బలపడతుంది. మీ ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. మీరు తీసుకునే సాహాసోపేతమైన నిర్ణయాలు విజయవంతమౌతాయి. ఈ సమయంలో మీకు విదేశాల నుంచి ప్రయోజనాలు లభిస్తాయి. తోడ బుట్టిన వారు కూడా ప్రతి విషయంలో సపోర్ట్ గా నిలుస్తారు.
కర్కాటక రాశి...
శని నక్షత్ర మార్పు.. కర్కాటక రాశివారి జీవితంలో చాలా మార్పులు తీసుకురానుంది. ఆ మార్పు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీకు విదేశీ అవకాశాలు కూడా రావచ్చు. శుభ కార్యాల్లో కూడా పాల్గొంటారు. జీవితంలో పాజిటివిటీ పెరుగుతుంది. మీకు ఉన్నతాధికారుల నుండి సపోర్ట్ లభిస్తుంది. కీర్తి పెరుగుతుంది. భవిష్యత్ ప్రణాళికల గురించి స్పష్టత వస్తుంది. మీ ఆత్మ విశ్వాసం బలపడుతుంది. ఈ సమయంలో విద్యార్థులు మంచి మార్కులు సాధించగలరు.
మిథున రాశి..
శని నక్షత్ర మార్పు మిథున రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. శని మీ రాశి నుండి కర్మ భావంలో సంచరిస్తున్నాడు. అందువల్ల, ఈ సమయంలో మీరు మీ పని , వ్యాపారంలో పురోగతిని అనుభవించవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి , వ్యాపారంలో వృద్ధి లభిస్తుంది. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి శుభవార్త లభించవచ్చు. ఈ సమయంలో మీరు కుటుంబ ఆస్తి నుండి కూడా ప్రయోజనం పొందవచ్చు. వ్యాపారాల్లో మంచి లాభాలు పొందుతారు.

