Birth Date:ఈ తేదీల్లో పుట్టినవారి గుండె నిండా సీక్రెట్సే.. ఒక్కటి కూడా బయటపెట్టరు..!
Birth Date: న్యూమరాలజీ ప్రకారం, వ్యక్తుల ఆలోచనాతీరు, ప్రవర్తన వారు పుట్టిన తేదీ ఆధారపడి ఉంటుంది. కొన్ని తేదీల్లో పుట్టిన వారు పొరపాటున కూడా తమ నిజాలు బయటపట్టరు. అన్ని రహస్యాలను గుండెల్లోనే దాచుకుంటారు. ఆ తేదీలేంటో చూద్దాం..

నెంబర్ 7..
ఏ నెలలో అయినా 7, 16, 25 తేదీల్లో జన్మించిన వారంతా నెంబర్ 7 కిందకు చెందుతారు. ఈ నెంబర్ 7 కి కేతువు అధిపతి. ఈ నెంబర్ జ్ఞానం, గోప్యతకు మారుపేరు. ఈ తేదీల్లో పుట్టినవారు చాలా లోతైన ఆలోచనలు కలిగి ఉంటారు. మీరి మనసులో ఏం ఉంది అనే విషయం ఎవరూ కనిపెట్టలేరు. దేవుడు కూడా వీరి మనసులోని విషయాన్ని తెలుసుకోలేడు. అంత సీక్రెట్ గా ఉంటారు. తమ పాత ప్రేమ కథలు లేదా తమ కుటుంబానికి సంబంధించిన విషయాలను పొరపాటున కూడా ఎవరి ముందూ బయటపెట్టరు. ఒకవేళ వారిని డైరెక్ట్ గా ఈ విషయాలు అడిగితే.. ఆ టాపిక్ ని వెంటనే మార్చేస్తారు. కానీ, వీరు తెలివిగా ఎదుటివారి మనసులో ఏముంది అనే విషయాన్ని మాత్రం చాలా ఈజీగా తెలుసుకోగలరు.
నెంబర్ 4...
ఏ నెలలో అయినా 4, 13, 22, 31 తేదీల్లో పుట్టిన వారంతా ఈ నెంబర్ 4 కిందకు వస్తారు. ఈ నెంబర్ కి అధిపతి రాహువు. వీరు వ్యూహకర్తలు. వీరు చాలా తెలివైన వారు. తమ మనసులో ఏముంది అనే విషయాన్ని పొరపాటున కూడా బయటకు తెలియనివ్వరు. వీరు బయటకు ఒకలా, లోపల మరోలా ఉంటారు. వీరికి ప్రత్యేకంగా ఒక సీక్రెట్ వరల్డ్ ఉంటుంది. ఈ తేదీల్లో పుట్టిన వారు ఆర్థిక విషయాలు, వ్యక్తిగత బంధాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. నమ్మకమైన స్నేహితులకు కూడా తమ అసలు రహస్యాలు చెప్పరు. ఇక.. వీరు మాటలతో గారడీ చేస్తారు. వీరి సీక్రెట్స్ బయట పెట్టరు. కానీ.. ఎదుటివాళ్లను ప్రశ్నలతో తికమక పెట్టి.. వారి మనసులోని సీక్రెట్స్ ని తెలుసుకుంటారు.
నెంబర్ 8...
ఏ నెలలో అయినా 8, 17, 26 తేదీల్లో జన్మించిన వారంతా నెంబర్ 8 కి చెందినవారే. ఈ సంఖ్యకు శని అధిపతి. శని నిదానానికీ, గాంభీర్యానికీ సంకేతం. ఈ తేదీల్లో జన్మించిన వారు కూడా చాలా గంభీరంగా కనిపిస్తారు. అనవసరంగా ఒక్క మాట కూడా మాట్లాడరు. వీరు కుటుంబ గౌరవానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందుకే ఇంటికి సంబంధించిన ఏ సీక్రెట్ ని వీరు బయట పెట్టరు. పాత గాయాలను, ప్రేమ వైఫల్యాలను గుండెల్లోనే దాచుకుంటారు. ప్రాణం పోయినా బయటపెట్టరు. కానీ, వీరు సైకాలజిస్టుల్లాంటి వారు. అవతలి వ్యక్తి బాడీ లాంగ్వేజ్ చూసి వారు ఏం దాచి పెడుతున్నారో కనిపెట్టేస్తారు.
నెంబర్ 9...
ఏ నెలలో అయినా 9, 18, 27 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 9 కిందకు వస్తారు. ఈ సంఖ్యకు కుజుడు అధిపతి. వీరు కూడా అంతే చాలా సీక్రెట్ గా ఉంటారు. తమ సీక్రెట్స్ ని వీరు పొరపాటున కూడా బయటపెట్టరు. తమ బలహీనతలను కూడా ఎవరికీ తెలియనివ్వరు. బయటకు మాత్రం చాలా ధైర్యంగా కనిపిస్తారు. వీరు తమ సీక్రెట్స్ మాత్రమే కాదు.. ఎవరైనా తమను నమ్మి సీక్రెట్స్ చెబితే.. వాటిని కూడా చాలా గోప్యంగా ఉంచుతారు. పొరపాటున కూడా వాటిని ఎవరికీ చెప్పరు. అంత నమ్మకంగా ఉంటారు.

