Mercury Transit: 20 రోజులు ఓపికపడితే.. ఈ ఐదు రాశులకు ఐశ్వర్య ప్రాప్తి, ఊహించనంత డబ్బు
Mercury Transit: బుధగ్రహం ఫ్రిబవరిలో తిరోగమనంలో ఉంటాడు. ఈ తిరోగమనం కుంభ రాశిలో ఉండటం వల్ల కొన్ని రాశులకు స్వర్ణకాలం ప్రారంభం కానుంది. వారికి ఆర్థికంగా ఊహించని లాభాలు రావడంతో పాటు.. అదృష్టం కూడా పెరుగుతుంది.

Mercury Transit
వేద జోతిష్యశాస్త్రంలో బుధ గ్రహాన్ని వ్యాపారం, ఆర్థిక వ్యవస్థ, వాక్చాతుర్యానికి ప్రతీకగా పరిగణిస్తారు. అందుకే, బుధ గ్రహం తమ గమనాన్ని మార్చుకున్నప్పుడల్లా కొన్ని రాశులు చాలా ఎక్కువగా ప్రభావితమౌతాయి. ఫిబ్రవరి ప్రారంభంలో బుధుడు తిరోగమనంలో ఉంటాడు. దీని కారణంగా కొన్ని రాశుల అదృష్టం పెరగనుంది. ఉద్యోగంతో పాటు, స్టాక్ మార్కెట్ల ద్వారా కూడా డబ్బు సంపాదిస్తారు. మరి, ఆ అదృష్ట రాశులేంటో చూద్దాం...
మేష రాశి..
బుధుడు తిరోగమనంలో ఉండటం వృషభ రాశివారికి సానుకూల మార్పులను తెస్తుంది. ఊహించని విధంగా ఆదాయం పెరుగుతుంది. కొత్త వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే ఇదే సరైన సమయం. మంచి లాభాలు పొందుతారు. మీ సమయంలో మీరు ఏం చేసినా మంచి లాభాలు పొందుతారు. లాటరీ, స్టాక్ మార్కెట్ల నుంచి మీకు ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు.
వృశ్చిక రాశి..
బుధుడు తిరోగమనం వృశ్చిక రాశి వారికి అనుకూలమైన ఫలితాలను తెస్తుంది. ఈ సమయంలో ఇది మీకు సౌకర్యం, విలాసాన్ని తెస్తుంది.ఈ రాశివారు వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. పూర్వీకుల సంపద, ఆస్తిని కూడా వారసత్వంగా పొందుతారు. కుటుంబ సభ్యులతో బంధం బలపడుతుంది. ఉద్యోగం చేసేవారికి కొత్త ఉద్యోగం, ప్రమోషన్స్ లాంటివి రావచ్చు.
మకర రాశి..
బుధుడు తిరోగమనం మీకు ప్రయోజనకరమైన ఫలితాలను తెస్తుంది. మీ రాశి నుండి రెండవ ఇంట్లో బుధుడు తిరోగమనంలో ఉంటాడు. కాబట్టి, ఈ సమయంలో మీరు ఊహించని ఆర్థిక లాభాలను పొందుతారు. మీ మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు. విజయావకాశాలు పెరుగుతాయి. ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఈ నెల అంతా చాలా అనుకూలంగా ఉంటుంది.
మిథున రాశి...
బుధుడు తిరోగమనం చెందడం వల్ల మిథునరాశి వారికి లైఫ్ అద్భుతంగా మారుతుంది. పదోన్నతి, గౌరవం లేదా అదనపు బాధ్యతలు లభించే అవకాశం ఉంది. వ్యాపారంలో పెట్టుబడులు , భాగస్వామ్యాలు ప్రయోజనాలను తెస్తాయి. ఈ కాలంలో ఆరోగ్యం మెరుగుపడుతుంది. కృషికి పూర్తిగా ప్రతిఫలం లభిస్తుంది.ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయి.
కుంభ రాశి..
కుంభరాశి వారికి, బుధుడు తిరోగమనం ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. మీ ప్రతిభను అందరూ గుర్తిస్తారు. మీరు మనసు పెడితే.. కీర్తి, విజయావకాశాలు పెరుగుతాయి. ప్రేమ, వైవాహిక జీవితం ఆనందంగా మారుతుంది. అపార్థాలు తొలగిపోతాయి. ఆర్థికంగా మంచి స్థాయికి వెళ్లగలరు.

