Birth Month: ఈ నెలలో పుట్టినవారు డబ్బు విపరీతంగా ఖర్చు చేస్తారు.. ఎందుకో తెలుసా?
డబ్బు ప్రతి ఒక్కరికీ అవసరమే. కానీ కొందరు ఒక్క రూపాయి ఖర్చు చేయాలన్నా పదిసార్లు ఆలోచిస్తే, మరికొందరు ఏమాత్రం సంకోచం లేకుండా డబ్బును మంచి నీళ్లలా ఖర్చు చేస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ నెలలో పుట్టినవారు డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారో తెలుసా?

ఏ నెలలో పుట్టినవారు డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పుట్టిన నెల, గ్రహాధిపత్యం.. మన ఆలోచనా విధానం, అలవాట్లు, ముఖ్యంగా మన సంపాదనపై ప్రభావం చూపుతాయి. డబ్బు ఎక్కువగా ఖర్చు చేసే స్వభావం చాలామందికి ఉంటుంది. అయితే ఇది అలవాటు మాత్రమే కాదు. కొన్ని నెలల్లో పుట్టినవారికి అది సహజంగా వచ్చే లక్షణం అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. మరి ఏ నెలలో పుట్టినవారు డబ్బులు విపరీతంగా ఖర్చు చేస్తారో ఇక్కడ తెలుసుకుందాం.
మార్చి నెల
మార్చి నెలలో పుట్టినవారు డబ్బును ఎక్కువగా ఖర్చు చేస్తారు. గురు గ్రహ ప్రభావం వల్ల వీరిలో దయ, కరుణ, సహాయం చేయాలనే మనసు ఎక్కువగా ఉంటుంది. అందుకే వీరు తమ అవసరాలకన్నా ఇతరుల అవసరాలకే డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఎవరు బాధలో ఉన్నా.. లెక్కలు చూడకుండా సహాయం చేస్తారు. దానం, గిఫ్టులు, స్నేహితుల కోసం ఖర్చు చేయడం వంటివి వీరి జీవితంలో ప్లానింగ్ లేకుండా జరిగిపోతాయి.
జులై నెల
జులై నెలలో పుట్టినవారు కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. చంద్రుడి ప్రభావం వల్ల వీరి మనసు భావోద్వేగాలతో నిండి ఉంటుంది. ఇంటి సౌకర్యాలు, కుటుంబ సభ్యుల అవసరాలు, పిల్లల భవిష్యత్తు వంటివి వీరి ఖర్చులో ప్రధాన భాగం. ఇల్లు బాగుండాలి, మన వాళ్లు సంతోషంగా ఉండాలి.. అనే భావనతో ఎక్కువగా ఖర్చు చేస్తారు. వీరు డబ్బు దాచుకోవడం కంటే, తమ వాళ్లకు భద్రత కల్పించడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.
ఆగస్టు నెల
ఆగస్టు నెలలో పుట్టినవారు పేరు, ప్రతిష్ఠ, ఆత్మగౌరవం కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారు. సూర్యుడి ప్రభావం వల్ల వీరిలో నాయకత్వ లక్షణాలు, గొప్పగా కనిపించాలనే తపన ఎక్కువగా ఉంటుంది. లైఫ్‌స్టైల్, బ్రాండెడ్ వస్తువులు, స్టేటస్‌ను చూపించే ఖర్చులు వీరికి ఇష్టం. ఇతరుల ముందు తక్కువగా కనిపించకూడదనే భావనతో కొన్నిసార్లు అవసరానికి మించి ఖర్చు చేస్తారు.
అక్టోబర్ నెల
అక్టోబర్ నెలలో పుట్టినవారు అందం, ఆనందం కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారు. శుక్రుడి ప్రభావం వల్ల ఫ్యాషన్, అలంకరణ, వినోదం వంటి వాటిపై డబ్బు ఖర్చు చేస్తారు. మంచి దుస్తులు, బయట తిరగడం, స్నేహితులతో సమయం గడపడం వంటివి వీరి జీవనశైలిలో భాగం. ఆనందాన్ని కొనుగోలు చేయడంలో వీరు ఏమాత్రం వెనుకాడరు. ఎంత ఖర్చు అయినా పర్లేదు కానీ జీవితం అందంగా ఉండాలనే భావన వీరిలో బలంగా ఉంటుంది.
డిసెంబర్ నెల
డిసెంబర్ నెలలో పుట్టినవారు మంచి మంచి అనుభూతుల కోసం డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు. గురు గ్రహ ప్రభావంతో వీరిలో ఆశావాదం, విశాల దృష్టి, స్వేచ్ఛగా ఉండాలనే కోరిక ఎక్కువ. వీరు ట్రావెల్, చదువు, కొత్త అనుభవాలు, జ్ఞానం కోసం డబ్బు ఖర్చు చేస్తారు. ఇప్పుడు ఖర్చు చేసినా రేపు సంపాదించుకోగలను అనే నమ్మకం వీరిని ధైర్యంగా నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. అయితే ఈ ఆశావాదం కొన్నిసార్లు ఇబ్బందులపాలు చేయవచ్చు.

