Ketu- Moon Conjunction: ఉగాది తర్వాత కేతు-చంద్రుడి కలయిక.. ఈ రాశుల జీవితం స్వర్ణమయం
Ketu- Moon Conjunction: ఉగాది పండగ తర్వాత కేతు-చంద్రుడి కలయిక మార్చి 30న ఏర్పడనుంది. ఈ కలయిక కొన్ని రాశులకు అదృష్టాన్ని మోసుకురానుంది. ఆర్థికంగా బాగా కలిసిరానుంది.

Ketu Moon Conjunction
ఉగాది పండగ వచ్చేస్తుంది. ఈ ఉగాది పండగ తర్వాత కొన్ని రాశుల వారి జీవితాల్లో అద్భుతాలు జరగనున్నాయి.జోతిష్య శాస్త్రం ప్రకారం, ఉగాది పండగ చాలా శుభప్రదమైనది. ఈ ఉగాది పండగ తర్వాత కేతు గ్రహం చందమామతో కలయిక ఏర్పరచనుంది. ఈ రెండింటి కలయిక కారణంగా గ్రహణ యోగం ఏర్పడుతుంది.దీని కారణంగా కొన్ని రాశులకు శుభ ఫలితాలు కలగనున్నాయి. అదృష్టం రెట్టింపు కానుంది. మరి, ఆ రాశులేంటో చూద్దామా...
1.మిథున రాశి...
కేతువు- చంద్రుడి కలయిక మిథున రాశివారికి చాలా మేలు చేయనుంది.అన్ని విషయాల్లోనూ ధైర్యంగా ముందుకు అడుగువేస్తారు. కష్టపడి పని చేయడం ద్వారా అన్నింట్లోనూ విజయం సాధిస్తారు. ముఖ్యంగా ఆర్థికంగా వీరి జీవితం స్వర్ణమయం కానుంది. వ్యక్తిగత సంబంధాలు విభేదాలు, తగాదాలు మాయం అవుతాయి. పనిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ ఆనందం రెట్టింపు అవుతుంది. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. కెరీర్ లో పురోగతి సాధిస్తారు. మీ పనిని ఉన్నతాధికారులు ప్రశంసిస్తారు.
2.మీన రాశి...
ఈ కేతువు- చంద్రుడి కలయిక మీన రాశి వారికి కూడా చాలా ప్రయోజనకరంగా మారనుంది. ఈ సమయంలో ఈ రాశివారు తమ శత్రువులను ఓడిస్తారు. వివాహం కానివారికి వివాహం జరిగే అవకాశం ఉంది. కోరుకున్న భాగస్వామి జీవితంలోకి అడుగుపెడతారు. వ్యాపారంలో లాభాలు పొందుతారు. ఉద్యోగులకు కూడా ఇది శుభ సమయం. ఏ పని చేసినా.. అందులో విజయం సాధిస్తారు. అయితే.. ఎందులో అయినా పెట్టుబడులు పెట్టే ముందు ఒకటికి వందసార్లు ఆలోచించాలి. ఇతరులకు డబ్బు అప్పుగా ఇవ్వకూడదు.
3.వృశ్చిక రాశి...
కేతుడు- చంద్రుడి కలయిక వృశ్చిక రాశివారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశివారి జీవితంలో శుభ ఘడియలు మొదలైనట్లే. ముఖ్యంగా కెరీర్ లో గొప్ప స్థాయికి వెళతారు. ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఆర్థికంగా గొప్ప స్థాయికి వెళతారు. కోల్పోయిన డబ్బు తిరిగి పొందుతారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. కుటుంబంలో ప్రశాంతత పెరుగుతుంది.
3.ధనుస్సు రాశి..
కేతు- చంద్రుడి కలయిక ధనుస్సు రాశివారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి ఇది అనువైన సమయం. ఉన్నత విద్య పొందాలనే మీ కల నెరవేరుతుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు మీకు లభించే అవకాశం ఉంది. కెరీర్, విద్యలో గణనీయమైన మార్పులు ఉంటాయి. వైవాహిక జీవితం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది.

