Astrology: శ్రావణం కంటే ముందే శని తిరోగమనం.. ఈ రాశుల వారు జర భద్రం..
Astrology: శ్రావణ మాసంలో శివుడు తన అనుగ్రహాన్ని కురిపిస్తాడు కానీ ఈ సమయంలో మీన రాశిలో శని గ్రహం తిరోగమనంలో కదులుతుంది. ఈ ఫలితంగా కొన్ని రాశుల వారిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. శనీశ్వరుడు తిరోగమనం ప్రభావంతో ఏ రాశులు కష్టాల బారిన పడతాయో తెలుసుకుందాం.

శని తిరోగమనం
శ్రావణ మాసం ప్రారంభానికి ముందే శని వక్రగతిలోకి వెళ్తాడు. ఇది అన్ని రాశులపై ప్రభావం చూపుతుంది. దీని వల్ల ఆర్థిక నష్టాలు, మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలు రావొచ్చు. అయితే.. 3 రాశుల వారిపై మాత్రం తీవ్ర నష్టాలను చవిచూడవచ్చు..
ఆ రాశులకు రాహుకాలమే!
శ్రావణ మాసం జూలై నుండి ప్రారంభమై ఆగస్టు వరకు ఉండగా.. శని తిరోగమనం జూలై 13 నుండి నవంబర్ 28 వరకు కొనసాగుతుంది. అంటే శ్రావణం మొత్తం శని వ్యతిరేక దిశలో ప్రయాణిస్తాడు. ఈ కారణంగా మిథునం, మేషం, వృశ్చికం రాశులవారికి ఇది కష్టాలు, ఆర్థిక నష్టాలు, ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు రావొచ్చు.
మిథున రాశి
శని వక్రగతి మిథున రాశి వారికి ఆర్థికంగా ప్రతికూలంగా ప్రభావితం చేయవచ్చు. పెట్టుబడుల్లో నష్టాలు, తీవ్రమైన ఖర్చులు, ఆర్థిక ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.
మేష రాశి
శని వక్రగతి సమయంలో మేష రాశి వారికి ఆర్థిక ఒత్తిడి, అనవసర ఖర్చులు పెరుగుతాయి. వ్యక్తిగత జీవితంలో విభేదాలు, ఉద్రిక్తతలు ఎదురవవచ్చు. ఈ సమయంలో నిర్ణయాలు తీసుకోవడంలో అలసత్వం, అధిక ఆత్మవిశ్వాసం అస్సలు మంచిదికాదు. జాగ్రత్తగా, ఆలోచించి వ్యవహరించాలి.
వృశ్చిక రాశి
శని వక్రగతి వల్ల వృశ్చిక రాశి వారికి మానసిక ఒత్తిడి, నష్టాలు తీసుకురావచ్చు. మనసు చంచలంగా ఉండే అవకాశం ఉంది, అందువల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆర్థిక పరిస్థితి దిగజారవచ్చు. ఉద్యోగాల్లో సవాళ్లు, పని ఒత్తిడి అధికంగా ఉండొచ్చు. ఈ కాలంలో శాంతిగా, స్థిరంగా వ్యవహరించాలి.