Zodiac Signs: సొంత రాశిలోకి కుజుడు.. ఈ మూడు రాశులకు పట్టిందల్లా బంగారమే!
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. త్వరలో కుజ గ్రహం సొంత రాశిలో సంచరించనుంది. దీనివల్ల మూడు రాశులవారికి మంచి రోజులు మొదలు కానున్నాయి. మరి ఏ రాశివారికి కుజ గ్రహం అదృష్టాన్ని తీసుకువస్తుందో ఇక్కడ తెలుసుకుందాం.

రుచక రాజయోగం:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. సెప్టెంబర్‌లో కుజ గ్రహం తన సొంత రాశి అయిన వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తుంది. దీనివల్ల రుచక రాజయోగం ఏర్పడుతుంది. జ్యోతిష్యంలో ఈ రాజయోగాన్ని చాలా శుభప్రదంగా భావిస్తారు. రాజయోగం ప్రభావంతో కొన్ని రాశుల వారి భవిష్యత్తు మారవచ్చు. మరి ఏ రాశులవారికి కుజుడి సొంతరాశి సంచారం ఆనందం, అదృష్టాన్ని తెస్తుందో ఇక్కడ తెలుసుకుందాం.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి రుచక రాజయోగం సానుకూలంగా ఉంటుంది. కుజుడు ఈ రాశికి అధిపతి. ఈ సమయంలో కుజుడు ఈ రాశి ఆరవ ఇంట్లో సంచరిస్తాడు. కాబట్టి ఈ రాశివారు కోర్టు కేసుల్లో విజయం సాధించవచ్చు. ఇంట్లో ఆనందం పెరుగుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. ఉద్యోగులకు పదోన్నతి దక్కవచ్చు.
సింహ రాశి
సింహ రాశి వారికి రుచక రాజయోగం శుభ ఫలితాలను ఇస్తుంది. వీరికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. కుజుడు ఈ రాశి నాల్గవ ఇంట్లో సంచరిస్తాడు. కాబట్టి ఈ సమయంలో ఈ రాశివారికి సుఖ, సంతోషాలు పెరుగుతాయి. ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. ఉద్యోగం, వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. పూర్వీకుల నుంచి ఆస్తి వచ్చే అవకాశం ఉంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి రుచక రాజయోగం శుభప్రదం. కుజుడు ఈ రాశివారి జాతకంలో ఉద్యోగ, వ్యాపార స్థానానికి చేరుకుంటాడు. ఈ సమయంలో వీరు ఉద్యోగం, వ్యాపారాల్లో మంచి విజయం సాధించవచ్చు. వేరే కంపెనీ నుంచి మంచి ఆఫర్ కూడా రావచ్చు. ఈ రాశివారికి ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.