Zodiac Signs: మిథునరాశిలో మూడు గ్రహాల కలయిక.. ఈ రాశులకు డబ్బుకు లోటుండదు!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు సమయానుసారం రాశులు, నక్షత్రాలను మారుస్తుంటాయి. ప్రస్తుతం గురు, శుక్ర గ్రహాలు మిథున రాశిలో సంచరిస్తున్నాయి. త్వరలో చంద్రుడు ఈ రాశిలోకి ప్రవేశించనున్నాడు. తద్వారా 3 రాశుల వారికి మేలు జరగనుంది.

మిథున రాశిలో గురు, శుక్ర, చంద్ర గ్రహాల కలయిక
పంచాంగం ప్రకారం ప్రస్తుతం గురు, శుక్ర గ్రహాలు మిథున రాశిలో సంచరిస్తున్నాయి. సాధారణంగా గురు గ్రహం ఒక రాశిలో దాదాపు 12 నెలలు ఉంటుంది. శుక్ర గ్రహం 23 నుంచి 60 రోజుల వరకు ఉంటుంది. ఆగస్టు 18న చంద్రుడు కూడా మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆగస్టు 20 వరకు అక్కడే ఉంటాడు. మిథున రాశిలో గురు, శుక్ర, చంద్రుల కలయిక కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. మరి ఆ రాశులేంటో చూద్దామా..
మిథున రాశి
గురు, శుక్ర, చంద్రుల సంయోగం మిథున రాశివారికి కలిసి వస్తుంది. ఈ రాశివారికి ఆర్థిక సమస్యలు తొలగుతాయి. ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం దక్కుతుంది. వృత్తి, వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులు అధికారుల అండదండలతో మంచి ఫలితాలు పొందుతారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది.
కర్కాటక రాశి
మిథున రాశిలో చంద్ర, శుక్ర, గురుల సంయోగం కర్కాటక రాశి వారి జీవితంలో ఆనందాన్ని తెస్తుంది. యువతకు వ్యాపార అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగుల కష్టానికి ఫలితం దక్కుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం దక్కవచ్చు.
తుల రాశి
తుల రాశి వారికి చంద్ర, శుక్ర, గురు గ్రహాల మహా సంయోగం వల్ల లాభం చేకూరుతుంది. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తిలో ప్రగతి సాధిస్తారు. ప్రేమ బందాలు బలపడుతాయి. వ్యాపారాల్లో పెద్ద ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వృద్ధులు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి.