Zodiac signs:ఈ రాశులవారు నలుపు రంగు ధరిస్తే.. అదృష్టం దూరమైనట్లే..!
Zodiac signs: నలుపు రంగు శని గ్రహానికి సంబంధించిన రంగుగా పేర్కొంటారు. శనీశ్వరుడి రంగు అయిన ఈ నలుపు అందరికీ శుభ ఫలితాలను అందించదు. అందుకే కొన్ని రాశుల వారు ఈ రంగుకు దూరంగా ఉండాలి.

Zodiac signs
నలుపు రంగును ఇష్టపడేవారు చాలా మంది ఉంటారు. ఆ రంగు దుస్తులు వేసుకుంటే తమ కాన్ఫిడెన్స్ పెరుగుతుందని చాలా మంది ఫీలౌతూ ఉంటారు. అయితే, జోతిష్య శాస్త్రం ప్రకారం, శని దేవుడికి ప్రతీక అయిన ఈ నలుపు రంగు అందరికీ కలిసి రాదు. కొన్ని రాశులకు ఈ రంగు అదృష్టాన్ని తెస్తే, మరి కొందరికి సమస్యలను తెస్తుంది. మరి ఎవరు ఈ రంగు ధరించకూడదో ఇప్పుడు చూద్దాం...
నలుపు రంగు అస్సలు ధరించకూడని రాశులు ఇవే...
1.ధనుస్సు రాశి ( Sagittarius): ఈ రాశివారికి నలుపు రంగు శుభం కాదు. ఈ రాశివారు ఈ రంగు ధరిస్తే.. వారి అదృష్టం తగ్గుతుంది. అందుకే, ఈ రాశివారు ఈ రంగుకు దూరంగా ఉండటం మంచిది కాదు.
2.సింహ రాశి (Leo): నలుపు రంగు ప్రభావం వీరిపై చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు ఈ రంగు నివారించడం ఉత్తమం.
మీన రాశి (Pisces): వీరు నలుపుకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇది మీలో అయోమయాన్ని (Confusion) పెంచుతుంది.
మేష రాశి (Aries): నలుపు రంగు వీరికి కోపాన్ని పెంచుతుంది. కాబట్టి చాలా తక్కువగా వాడాలి.
మిథున రాశి (Gemini): వీరు కూడా నలుపును తక్కువగా వాడాలి. ఇది మీ మనసును ప్రతికూలంగా మారుస్తుంది.
కర్కాటక రాశి (Cancer): వీరు ఎప్పుడూ కాకుండా, కేవలం అప్పుడప్పుడు మాత్రమే నలుపు రంగును ధరించాలి.
ఈ రాశులకు నలుపు రంగు అదృష్టాన్ని తెస్తుంది...
కుంభ రాశి (Aquarius): నలుపు రంగు ఈ రాశివారికి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
తుల రాశి (Libra): నలుపు వీరికి చాలా శుభప్రదం. ఇది మీ ఆకర్షణ శక్తిని రెట్టింపు చేస్తుంది.
వృషభ రాశి (Taurus): వీరికి నలుపు రంగు ధరించడం వల్ల అదృష్టం కలిసి రావడమే కాకుండా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
వృశ్చిక రాశి (Scorpio): వీరికి నలుపు చాలా శుభప్రదం. ఇది మీకు మానసిక బలాన్ని, శక్తిని ఇస్తుంది.
కన్య రాశి (Virgo): నలుపు రంగు వీరికి హుందాతనాన్ని, గాంభీర్యాన్ని ఇస్తుంది.
మకర రాశి (Capricorn): మకర రాశి వారికి నలుపు చాలా అనుకూలమైన రంగు. ఇది మీకు విజయాన్ని చేకూరుస్తుంది.
ముఖ్య గమనిక: ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లేటప్పుడు లేదా పూజా కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు పైన చెప్పిన సూచనలు పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య నిపుణులు చెబుతుంటారు.

