Birth Date: ఈ తేదీలలో పుట్టినవారు ఒక వయసు దాటాక రిచ్ అయిపోతారు
Birth Date: సంఖ్యా శాస్త్రం ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన వారికి కొన్ని ప్రత్యేక లక్షణాలు, వ్యక్తిత్వం, భవిష్యత్తు ఉంటాయి. వారి జీవితం మొదట కష్టాలు పడినా 35 ఏళ్లు దాటాక మాత్రం విజయం సాధిస్తారు. ఏ తేదీలలో జన్మించినవారికి ఇలా జరుగుతుందో తెలుసుకోండి.

న్యూమరాలజీ ఏం చెబుతోంది
అంక జ్యోతిషం లేదా సంఖ్యాశాస్త్రం అనేది ప్రతి మనిషి పుట్టిన తేదీని బట్టి జీవితం ఎలా ఉంటుందో చెప్పే శాస్త్రం. కొంతమంది చిన్న వయసులోనే డబ్బును, మంచి పేరును సంపాదిస్తారు. మరి కొంతమంది ఎన్ని కష్టాలు పడిన ఎంతగా శ్రమించినా కూడా చిన్న వయసులో ఏదీ సాధించలేరు. పుట్టిన తేదీని బట్టి వారి విజయం కూడా ఆధారపడి ఉంటుంది. కొన్ని తేదీల్లో పుట్టిన వారు 35 ఏళ్ల వయసు దాటిన తర్వాత అసలైన విజయాన్ని చూస్తారని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. వీరు చిన్న వయసులో ఎంత ప్రయత్నాలు చేసినా ఫలితాలు ఆలస్యంగా వస్తాయి. ఏ తేదీల్లో పుట్టిన వాళ్ళు ఓపికతో ఉంటే కష్టాలన్నీ కనుమరుగై మంచి విజయాన్ని అందుకుంటారో తెలుసుకోండి.
మూల సంఖ్య 3
ప్రతినెలా 3, 12, 21, 30వ తేదీల్లో జన్మించిన వారు వారి మూల సంఖ్య 3 అవుతుంది. అంటే వీరు పుట్టిన తేదీలోని అంకెలను కలిపితే మూడు అంకె వస్తుంది. వీరు తెలివైన వారు, కొత్తగా ఆలోచించేవారుగా చెప్పుకోవచ్చు. చదువు, ఉద్యోగం విషయంలో మాత్రం ప్రారంభ దశలో అడ్డంకులు ఎన్నో ఎదురవుతాయి. వారు ఎంత ప్రయత్నించినా అనుకున్న స్థాయికి చేరుకోలేరు. కానీ 35 ఏళ్లు దాటిన తర్వాత మాత్రం వీరి పరిస్థితి మారిపోతుంది. వారి ప్రతిభను గుర్తించేలా అవకాశాలు ఎదురొస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది.
మూల సంఖ్య 4
ప్రతినెలా 4, 13, 22, 31వ తేదీల్లో జన్మించిన వారి రాడిక్స్ నంబర్ నాలుగు అవుతుంది. వీరికి కష్టపడే స్వభావం ఎక్కువ. కొత్తగా ఆలోచిస్తారు. కానీ జీవిత ప్రారంభ దశలో మాత్రం స్థిరత్వం ఉండదు. ఉద్యోగంలో మార్పులు ఎక్కువగా ఉంటాయి. వ్యాపార పరంగా కూడా నష్టపోతారు. ఆర్థిక కష్టాలు పెరిగిపోతాయి. కానీ 35 ఏళ్లు దాటిన తర్వాత వీరి జీవితం మలుపు తీసుకుంటుంది. ఒక్కసారిగా అవకాశాలు వచ్చి పడతాయి. రియల్ ఎస్టేట్, విదేశీ సంబంధిత పనులు, సాంకేతిక రంగాల్లో వీరు లాభాలు పొందే అవకాశం ఉంటుంది.
మూల సంఖ్య 8
ప్రతినెలా 8, 17, 26వ తేదీల్లో జన్మించిన వారి మూల సంఖ్య ఎనిమిది అవుతుంది. వీరికి చాలా ఓపిక ఎక్కువ. బాధ్యతలు సంతోషంగా భుజాన వేసుకొని మోసేందుకు సిద్ధమవుతారు. అయితే వీరికి శ్రమకు తగ్గ ఫలితం మాత్రం రాదు. జీవితంలో చాలా ఆలస్యంగా విజయం దక్కుతుంది. చిన్న వయసులో అవమానాలు, ఆటంకాలు ఎదురవుతాయి. అయినా వెనక్కి తగ్గకుండా వీరు ముందుకే సాగుతారు. 35 ఏళ్లు దాటిన తర్వాత మాత్రం వీరు అసలైన విజయాన్ని అందుకుంటారు. పెద్ద సంస్థల్లో ఉన్నత పదవులు స్వీకరిస్తారు. సమాజంలో గుర్తింపు పెరుగుతుంది. కష్టానికి ఫలితం కూడా దక్కుతుంది.
మూల సంఖ్య 9
మూల సంఖ్య 9 కలిగిన వారు అంటే ప్రతి నెలలో 9, 18, 27వ తేదీల్లో జన్మించినవారు. వీరికి ధైర్యసాహసాలు ఎక్కువ. అలాగే నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువే. కానీ కోపం, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. చిన్న వయసులో ఎన్నో సమస్యల బారిన పడతారు. ఉద్యోగంలో, వ్యక్తిగత జీవితంలో వివాదాలు వస్తాయి. 35 ఏళ్లు దాటిన తర్వాత మాత్రం వీరు సరైన దిశలో నడుస్తారు. కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని పొందుతారు. పేరు, అధికారం లభిస్తాయి. వీరు ఆలస్యంగా అయినా జీవితంలో గొప్ప స్థాయికి చేరుకుంటారు. కాకపోతే ఓపికతో నమ్మకంగా పనిచేయడం చాలా ముఖ్యం.

