Rahu Gamanam: సంచలనం సృష్టించబోతున్న రాహువు, ఈ 4 రాశులకు మహర్దశ
Rahu Gamanam: కొత్త ఏడాదిలో రాహువు కొన్ని రాశుల వారికి బీభత్సంగా కలిసి వస్తుంది. రాహు భగవానుడి అనుగ్రహంతో వృషభం, మిథునం, కన్య, వృశ్చికం రాశులకు రాజయోగం దక్కే అవకాశం ఉంది. రాహువు వీరికి ఎన్నో మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాడు.

రాహువుతో రాజయోగం
జ్యోతిషశాస్త్రం రాహువును ఛాయాగ్రహంగా పిలుస్తారు. దుష్టగ్రహంగా కూడా భావిస్తారు. ఇతను సరైన స్థానంలో లేకపోతే జాతకుడికి నష్టాలు తప్పువు. ఇక మంచి స్థానంలో ఉంటే మాత్రం రాహువును భోగ కారకుడిగా పిలుచుకుంటారు. మీనరాశిలో సంచరిస్తున్న రాహువు నాలుగు రాశుల వారికి రాజయోగాన్ని అందించే అవకాశం ఉంది. 2026 నుంచి నాలుగు రాశుల వారికి మంచి మార్పులు మొదలవుతాయి. రాహువు వల్ల వీరికి ఎంతో మంచి జరుగుతుంది.
వృషభ రాశి
వృషభ రాశి వారికి రాహువు 2026లో మంచి ఫలితాలను అందిస్తారు. ఈ రాశివారి 11వ ఇంట్లో రాహువు ఉంటాడు. కాబట్టి ఎన్నో లాభాలను వీరికి అందించబోతున్నాడు. వీరి దేన్ని ముట్టుకున్నా లాభమే. మీరు రాహువు కోసం కొన్ని పరిహారాలు చేస్తే మరింతగా కలిసివస్తుంది. ఇందుకోసం శనివారం నల్ల మినుములు దానం చేయాలి. అలాగే "ఓం రాహవే నమః" అని 18 సార్లు జపిస్తే ఇంకా మంచిది.
మిథున రాశి
మిథున రాశి వారికి రాహువు కొత్త ఏడాదితో కలిసొచ్చే గ్రహంగా మారుతాడు. ఈ రాశివారి 10వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల వీరికి పెద్ద పదవులు వరించే అవకాశం ఉంది. మీ భవిష్యత్తుకు మరింత ప్రకాశవంతంగా ఉండాలంటే కొన్ని పరిహారాలు చేయాలి. ఇందుకోసం పేదలకు చెప్పులు, గొడుగు దానం చేయడం వంటివి పాటించాలి. అలాగే శ్రీకాళహస్తిలో రాహు-కేతు పూజ చేయించుకుంటే మంచిది. అలాగే ఓం శూలపాణయే నమః మంత్రాన్ని రోజూ జపించాలి.
కన్యా రాశి
కన్యా రాశివారికి రాహువు 2026లో అంతా కలిసి వస్తుంది. ఈ రాశివారిపై రాహువు ప్రత్యక్ష దృష్టి ఉంటుంది. ఇది మీ జాతకబలాన్ని పెంచుతుంది. మీ శత్రువులు తొలగిపోతారు. ఈ రాశివారు రాహుకాలంలో దుర్గాదేవికి నిమ్మకాయ దీపం వెలిగిస్తే మంచిది. అలాగే ఓం దుర్గాయై నమః అని108 సార్లు జపించాలి.
వృశ్చిక రాశి
ఈ రాశి వారికి అయిదవ ఇంట్లో రాహువు ఉండటం వల్ల వీరు కొత్త ఆస్తులు కొనే అవకాశం పుష్కలంగా ఉంది. వీరికి సంతాన యోగం కూడా కనిపిస్తోంది. ఇక మరింత మంచి ఫలితాల కోసం అన్నదానం వంటివి చేయాలి. అలాగే నాగ విగ్రహానికి పాలాభిషేకం వంటివి చేస్తే మంచిది. రాహు గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి.
రాహువు అనుగ్రహం కోసం మరిన్ని పరిహారాలు చేస్తే మంచిది. కులదైవాన్ని ఆరాధించడం, దుర్గా దేవిని పూజించడం, జంతువులకు ఆహారం పెట్టడం, రాహువుకు గంధం లేపనం చేయడం వల్ల కుటుంబంలో శాంతి కలుగుతుంది.

