MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Astrology
  • Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు డబ్బు విషయంలో చాలా స్మార్ట్.. ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేయరు!

Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు డబ్బు విషయంలో చాలా స్మార్ట్.. ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేయరు!

డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో, దాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం. కొందరు బాగా సంపాదించినా చేతిలో డబ్బు ఉండదు. మరికొందరికి సాధారణ ఆదాయం ఉన్నా ఆర్థికంగా బలంగా ఉంటారు. మరి ఏ తేదీల్లో పుట్టినవారు డబ్బు విషయంలో స్మార్ట్ గా ఉంటారో ఇక్కడ చూద్దాం. 

2 Min read
Author : Kavitha G
Published : Jan 26 2026, 01:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Birth Date Astrology
Image Credit : Asianet News

Birth Date Astrology

జ్యోతిష్య శాస్త్రం, సంఖ్యా శాస్త్రం ప్రకారం.. పుట్టిన తేదీ, మన ఆలోచనా విధానం, నిర్ణయాలు, ముఖ్యంగా డబ్బు విషయంలో మన వైఖరిపై ప్రభావం చూపుతుంది. సాధారణంగా డబ్బులు ప్రతి ఒక్కరూ సంపాదిస్తారు, కానీ కొంతమంది మాత్రమే డబ్బును ఎలా నిలబెట్టుకోవాలి, ఎలా పెంపు చేసుకోవాలి అనే విషయంలో తెలివిగా వ్యవహరిస్తారు. జ్యోతిష్య పండితుల ప్రకారం, కొన్ని ప్రత్యేకమైన తేదీల్లో పుట్టినవారికి సహజంగానే ఆర్థిక విషయాల్లో స్పష్టత, ముందుచూపు ఉంటుంది. ఆ తేదీలేంటో చూసేయండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
1వ తేదీ- సూర్యుడి ప్రభావం..
Image Credit : Getty

1వ తేదీ- సూర్యుడి ప్రభావం..

సంఖ్యా శాస్త్రం ప్రకారం ఏ నెలలో అయినా 1 వ తేదీన పుట్టినవారు సూర్యుడి ప్రభావంలో ఉంటారు. సూర్యుడు నాయకత్వం, ఆత్మవిశ్వాసానికి ప్రతీక. ఈ తేదీన పుట్టినవారు డబ్బు విషయంలో రిస్క్ తీసుకోవడానికి భయపడరు. కానీ ఆ రిస్క్ కూడా లెక్కలు వేసుకొని తీసుకుంటారు. జ్యోతిష్య పండితుల ప్రకారం, వీళ్లు తమ సంపాదనపై పూర్తి నియంత్రణ కలిగి ఉంటారు. ఇతరుల మీద ఆధారపడకుండా సొంతంగా ఎదగాలనే తపన వీరిలో ఎక్కువ. ఖర్చు చేసే ముందు ఆలోచించడం, భవిష్యత్తు కోసం సేవ్ చేయడం వీళ్ల సహజ స్వభావం. అందుకే 1 తేదీన పుట్టినవారు లేట్ గా అయినా ఆర్థికంగా బలంగా నిలబడతారు.

Related Articles

Related image1
Dream Astrology: కలలో పదే పదే ఇవి కనిపిస్తే.. త్వరలో కోటీశ్వరులు కావడం ఖాయం!
Related image2
Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారికి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అవకాశాలు దక్కుతాయి!
35
5వ తేదీ- బుధుడి ప్రభావం
Image Credit : stockPhoto

5వ తేదీ- బుధుడి ప్రభావం

ఏ నెలలో అయినా 5వ తేదీన పుట్టినవారు బుధుడి ప్రభావంలో ఉంటారు. బుధుడు తెలివితేటలు, కమ్యూనికేషన్‌, వ్యాపార నైపుణ్యాలకు కారకుడు. ఈ తేదీన పుట్టినవారు డబ్బును ఎలా పెంపు చేయాలి అన్న విషయంపై క్లియర్ గా ఉంటారు. వీళ్లు ఒకే ఆదాయ మార్గంపై ఆధారపడరు. పండితుల ప్రకారం, వీళ్లకు కొత్త అవకాశాలు కనిపెట్టే శక్తి ఉంటుంది. చిన్న పెట్టుబడితో పెద్ద లాభం ఎలా పొందాలో వీళ్లకు బాగా తెలుసు. ఖర్చు విషయంలో కొంచెం చంచలంగా ఉన్నా, అవసరమైన సమయంలో డబ్బును కంట్రోల్ చేయగలగడం వీరి ప్రత్యేకత.

45
6వ తేదీ- శుక్రుడి ప్రభావం
Image Credit : Pixabay

6వ తేదీ- శుక్రుడి ప్రభావం

సంఖ్యా శాస్త్రం ప్రకారం 6వ తేదీన పుట్టినవారు శుక్రుడి అధీనంలో ఉంటారు. శుక్రుడు సంపద, సౌఖ్యం, విలాసానికి ప్రతీక. కానీ వీళ్ల తెలివితేటలు కేవలం ఖర్చు చేయడంలోనే కాదు, సేవింగ్స్ లో కూడా ఉంటాయి. జ్యోతిష్య నిపుణుల ప్రకారం, 6వ తేదీన పుట్టినవారు డబ్బును, జీవితాన్ని సుఖంగా మార్చే సాధనంగా చూస్తారు. కానీ అవసరం లేని చోట ఖర్చు పెట్టరు. కుటుంబం, భవిష్యత్తు భద్రత కోసం సేవింగ్స్ చేయడం వీళ్లకు చాలా ముఖ్యం. వీళ్లు డబ్బును ఆకర్షించే శక్తి కలిగి ఉంటారని జ్యోతిష్య విశ్లేషణలు చెబుతున్నాయి.

55
8వ తేదీ- శని ప్రభావం
Image Credit : Getty

8వ తేదీ- శని ప్రభావం

ఏ నెలలో అయినా 8వ తేదీన పుట్టినవారు శనిగ్రహ ప్రభావంలో ఉంటారు. శని కష్టానికి, క్రమశిక్షణకు, దీర్ఘకాల ఫలితాలకు కారకుడు. ఈ తేదీన పుట్టినవారికి డబ్బు సులభంగా రాదు, కానీ వచ్చిన డబ్బు చాలా కాలం నిలబడుతుంది. పండితుల ప్రకారం, వీళ్లు ఆర్థిక విషయాల్లో చాలా గంభీరంగా ఆలోచిస్తారు. అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉంటారు. పెట్టుబడుల విషయంలో దీర్ఘకాల ప్రయోజనాన్ని చూస్తారు. చిన్న లాభాల కంటే పెద్ద లక్ష్యాల మీదే వీళ్ల దృష్టి ఎక్కువగా ఉంటుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Moon Jupiter Conjunction: 4 రోజులు ఓపిక పడితే చాలు.. ఈ 5 రాశులవారికి గోల్డెన్ టైమ్ స్టార్ట్!
Recommended image2
Rahu Kuja Transit: ఈ 4 రాశుల వారు సరిగ్గా 17 రోజుల్లోపు శుభవార్త వినే అవకాశం, మీ రాశి ఉందా?
Recommended image3
Today Rasi Phalalu: నేడు 2 రాశులవారికి ఆకస్మిక ధనలాభం.. చేపట్టిన పనుల్లో విజయం!
Related Stories
Recommended image1
Dream Astrology: కలలో పదే పదే ఇవి కనిపిస్తే.. త్వరలో కోటీశ్వరులు కావడం ఖాయం!
Recommended image2
Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారికి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అవకాశాలు దక్కుతాయి!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved