Dream Astrology: కలలో పదే పదే ఇవి కనిపిస్తే.. త్వరలో కోటీశ్వరులు కావడం ఖాయం!
నిద్రలో ఉన్నప్పుడు కలలు రావడం సహజం. కానీ కొన్ని కలలు మన మనసును ఊహించని విధంగా కదిలిస్తాయి. స్వప్న శాస్త్రం ప్రకారం కొన్ని రకాల కలలు భవిష్యత్తులో ఆర్థిక విజయానికి, సంపదకు సంకేతాలు. మరి కలలో ఏం కనిపిస్తే నిజ జీవితంలో మంచి జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

Dream Astrology
కలలు భవిష్యత్తును నేరుగా చెప్పకపోయినా, రాబోయే మార్పులకు సంకేతాలని స్వప్న శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా ధనం, సంపద, ఐశ్వర్యానికి సంబంధించిన కలలు వచ్చినప్పుడు వాటికి ప్రత్యేకమైన అర్థాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. కొన్ని కలలు సాధారణంగా కనిపించినా, వాటి వెనుక ఉన్న సంకేతాలు మాత్రం అసాధారణంగా ఉంటాయని చెబుతున్నారు.
లక్ష్మీదేవి దర్శనం
స్వప్నశాస్త్రం ప్రకారం కలలో లక్ష్మీదేవి దర్శనం కలగడం అత్యంత శుభ సూచికం. లక్ష్మీదేవి ప్రశాంతంగా కనిపించడం, చిరునవ్వుతో ఆశీర్వదించడం, లేదా దీపాల మధ్య దర్శనమివ్వడం అంటే ధనయోగం ప్రారంభమవుతుందని నమ్మకం. ముఖ్యంగా ఈ కల తెల్లవారుజామున వస్తే త్వరలో గొప్ప ఎదుగుదల ఉంటుందని సంకేతం. ఇది అకస్మాత్తుగా వచ్చే లాభం, కొత్త అవకాశాలు లేదా దీర్ఘకాల సంపదకు దారితీసే మార్గం కావచ్చు.
బంగారం కనిపిస్తే..
అలాగే కలలో బంగారం కనిపించడం కూడా కోటీశ్వర యోగానికి సంకేతంగా స్వప్నశాస్త్రం చెబుతోంది. బంగారు నాణేలు, బంగారు ఆభరణాలు, లేదా బంగారు కిరీటం లాంటివి కలలో కనిపిస్తే, అది సంపద పెరుగుదల, విలువ పెరిగే ఆస్తుల సూచన. ముఖ్యంగా బంగారం మీ చేతిలోకి రావడం లేదా ఎవరో బహుమతిగా ఇవ్వడం కనిపిస్తే, ఊహించని మార్గంలో డబ్బు రావచ్చని పండితులు చెబుతున్నారు.
పాము కనిపించడం..
పాము కలలో కనిపించడం చాలామందిని భయపెడుతుంది. కానీ స్వప్నశాస్త్రం ప్రకారం పాము ధనానికి, గుప్త సంపదకు సంకేతం. ముఖ్యంగా పెద్ద పాము ప్రశాంతంగా కనిపించడం, లేదా పాము మీకు హాని చేయకుండా వెళ్లిపోవడం అంటే, భూమి, ఆస్తి, వ్యాపారంలో పెద్ద లాభం వచ్చే అవకాశం ఉందని నమ్మకం.
నీరు ప్రవహించడం..
కలలో నీరు స్వచ్ఛంగా ప్రవహించడం కూడా గొప్ప సంపదకు సూచనగా స్వప్నశాస్త్రం చెబుతోంది. నది, జలపాతం, లేదా బావిలో నీరు ఉప్పొంగి రావడం లాంటి కలలు ఆర్థిక ప్రవాహం పెరగడానికి సంకేతం. నీరు ఎంత స్వచ్ఛంగా, ప్రశాంతంగా ఉంటే, డబ్బు కూడా అంతే స్థిరంగా, నిరంతరంగా వస్తుందని పండితులు చెబుతున్నారు.
కలలో ఏనుగు కనిపిస్తే
కలలో ఏనుగు కనిపించడం కూడా రాజయోగానికి, మహా సంపదకు సంకేతంగా స్వప్నశాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా అలంకరించిన ఏనుగు, లేదా ఏనుగు ఆశీర్వదిస్తున్నట్లు కనిపిస్తే, అది అధికారం, గౌరవంతో కూడిన సంపదకు సూచన. వ్యాపారులు, ఉద్యోగులు, రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ కల వస్తే, పెద్ద స్థాయి ఎదుగుదల కనిపిస్తుందని నమ్మకం. ఏనుగు ఎక్కి ప్రయాణించే కల వస్తే మీ స్థాయి పూర్తిగా మారబోతోందని సూచన.
నిధి దొరకడం
కలలో నిధి దొరకడం లేదా పాత నాణేలు లభించడం కూడా కోటీశ్వర యోగానికి సంకేతం. ఇది వారసత్వ ధనం, లాంగ్‌టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫలితం, లేదా గతంలో చేసిన మంచి పనులకు ఫలితం రూపంలో సంపద వచ్చే సూచనగా స్వప్నశాస్త్రం చెబుతోంది. ఈ కల వచ్చినవారు ఊహించని ఆర్థిక అవకాశాలను అందిపుచ్చుకుంటారు.
అలాగే పాలు, నెయ్యి, తెల్లని పదార్థాలు కలలో చూడటం కూడా ధనయోగానికి సూచన. ఇవి శుద్ధి, సమృద్ధికి ప్రతీకలు. ముఖ్యంగా పాలు పొంగి పొర్లడం కలలో కనిపిస్తే, ఆదాయం పెరగడం, ఇంట్లో ఐశ్వర్యం నిలవడం వంటివి జరుగుతాయని స్వప్న శాస్త్రం చెబుతోంది.

