Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారికి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అవకాశాలు దక్కుతాయి!
Weekly Horoscope: ఈ వార ఫలాలు 25.1.2026 నుంచి 31.1.2026 వరకు సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల వార ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

ఈ వారం రాశి ఫలాలు
ఈ వార ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. అప్పుల బాధలు తొలగుతాయి. నూతన వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగ బాధ్యతలు చక్కగా నిర్వహిస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. కోర్టు వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి.
వృషభ రాశి ఫలాలు
అనుకున్న పనులు నిదానంగా పూర్తవుతాయి. మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వనాలు అందుకుంటారు. సోదరులతో స్థిరాస్తి విషయంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. గృహ నిర్మాణ యత్నాలు అనుకూలంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలు అనుకూలం.
మిథున రాశి ఫలాలు
ఆర్థికంగా కొంత ఇబ్బందికర వాతావరణం ఉన్నప్పటికీ అవసరానికి డబ్బు అందుతుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగి ముందుకు సాగుతారు. స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించి అవరోధాలు తొలగుతాయి. ఇంటా బయటా పరిస్థితులను అనుకూలంగా మారుతాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. వ్యాపార ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉంటాయి.
కర్కాటక రాశి ఫలాలు
ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సకాలంలో ఆప్తుల సహకారం అందుతుంది. సంఘంలో మీ విలువ మరింత పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి.
సింహ రాశి ఫలాలు
సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో వివాదాలు పరిష్కారమవుతాయి. సొంత ఆలోచనలు కలిసివస్తాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలం. ఇంటా బయటా కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. పాత విషయాలు గుర్తు చేసుకుంటారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. వ్యాపారాలు మరింత అనుకూలం.
కన్య రాశి ఫలాలు
ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. దూరపు బంధువుల నుంచి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలిస్తాయి. స్థిరాస్తి వ్యవహారాలలో సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. వ్యాపారాలు లాభాలబాట పడతాయి.
తుల రాశి ఫలాలు
వృత్తి, వ్యాపారాలలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు గతం కంటే మరింత ఆశాజనకంగా ఉంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులు మీ మాటతో విభేదిస్తారు.
వృశ్చిక రాశి ఫలాలు
చేపట్టిన పనుల్లో జాప్యం కలిగినా నిదానంగా పూర్తిచేస్తారు. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణాలు కొంతమేర తీరతాయి. నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు లభిస్తాయి. ఆప్తుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సూచనలు పాటించడం మంచిది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
ధనుస్సు రాశి ఫలాలు
కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ఇంటా బయటా అందరు మీ మాటతో విభేదిస్తారు. సన్నిహితుల ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. స్థిరాస్తి వివాదాల నుంచి కొంత వరకు బయటపడతారు. వ్యాపారాల్లో తీసుకున్న నిర్ణయాలు అంతగా అనుకూలించవు. ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగులు మరింత కష్టపడాల్సి వస్తుంది.
మకర రాశి ఫలాలు
కొన్ని పనులు చకచకా పూర్తి చేస్తారు. సమాజంలో పేరు కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. అందరిలోనూ మీరు ప్రత్యేకమైన గుర్తింపు పొందుతారు. శత్రువులు కుడా స్నేహితులుగా మారతారు. ఆర్థిక వ్యవహారాలలో ఆశించిన పురోగతి ఉంటుంది. వివాహ, ఉద్యోగ యత్నాలు కలిసివస్తాయి. వ్యాపారాలు గతం కంటే పుంజుకుంటాయి. వృత్తి, ఉద్యోగాలలో అనుకున్న పదవులు లభిస్తాయి.
కుంభ రాశి ఫలాలు
నూతన కార్యక్రమాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు. బంధువుల నుంచి అందిన సమాచారం సంతోషాన్నిస్తుంది. నిరుద్యోగులు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకున్న విధంగా సాగుతాయి. ఇంటి నిర్మాణ యత్నాల్లో అవరోధాలు తొలగుతాయి. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వారం చివరిలో కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి.
మీన రాశి ఫలాలు
కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. చేపట్టిన పనులలో కొంత జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. బంధువులతో మాటపట్టింపులు తొలగుతాయి. ప్రయాణాలలో కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి.

