- Home
- Astrology
- Birth Date: ఈ తేదీల్లో పుట్టిలన వారికి కష్టపడకుండానే.. సక్సెస్ వీళ్ల కాళ్ల దగ్గరకు వచ్చేస్తుంది..!
Birth Date: ఈ తేదీల్లో పుట్టిలన వారికి కష్టపడకుండానే.. సక్సెస్ వీళ్ల కాళ్ల దగ్గరకు వచ్చేస్తుంది..!
కొందరు మాత్రం కనీసం చిన్నపాటి ప్రయత్నం, ఎలాంటి కష్టం పడకుండానే వారికి కాళ్ల దగ్గరకు అన్నీ వచ్చేస్తాయి. వారు కోరుకుంటే చాలు జరిగిపోతాయి.

Birth date
జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అని తాపత్రయపడేవారు మనలో చాలా మంది ఉంటారు. తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి అహర్నిశలు ప్రయత్నించేవారు కూడా ఉంటారు. కానీ, కొందరికి ఎంత కష్టపడినా అనుకున్న విజయం సాధించలేరు. ఇదంతా తమ బ్యాడ్ లక్ అని బాధపడుతూ ఉంటారు. కానీ, కొందరు మాత్రం కనీసం చిన్నపాటి ప్రయత్నం, ఎలాంటి కష్టం పడకుండానే వారికి కాళ్ల దగ్గరకు అన్నీ వచ్చేస్తాయి. వారు కోరుకుంటే చాలు జరిగిపోతాయి. అలాంటి అదృష్టం చాలా తక్కువ మందికి ఉంటుంది. న్యూమరాలజీ ప్రకారం.. నాలుగు తేదీల్లో పుట్టిన వారికి ఈ లక్ చాలా ఎక్కువగా ఉంటుంది. వారు పెద్దగా కష్టపడకపోయినా కోరుకున్నది సంపాదించుకోగలరు. మరి, ఆ తేదీలేంటో చూద్దామా...
3వ తేదీ..
ఏ నెలలో అయినా 3వ తేదీలో జన్మించిన వారిలో సహజంగానే అయస్వాంత ఆకర్షణ శక్తులు ఉంటాయి. వారు చాలా బాగా మాట్లాడగలరు. లైఫ్ లో చాలా తొందరగా సక్సెస్ ని అందుకుంటారు. కొత్త వారితో అయినా ఎలాంటి భయం, సంకోచం లాంటివి లేకుండా మాట్లాడగల సామర్థ్యం వీరిలో ఉంటుంది. వీరు జీవితంలో ఏది సాధించాలన్నా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. అవకాశాలే వారిని ఎతుక్కుంటూ వచ్చేస్తాయి. ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరు వీరికి సహాయం చేస్తూనే ఉంటారు. వీరి మాట తీరు, చురుకుతనం అందరినీ ఆకట్టుకుంటుంది. మనుషులకు వీరు చాలా ఎక్కువ విలువ ఇస్తారు. ఈ లక్షణమే వీరికి అవకాశాలను తెచ్చి పెడుతుంది.
6వ తేదీ..
న్యూమరాలజీ ప్రకారం నెంబర్ 6 అనేది ప్రేమ, శాంతి, కుటుంబ సంబంధాలకు సంకేతం లాంటిది. ఈ తేదీల్లో జన్మించిన వారు తమ చుట్టూ ఉన్న వారితో చాలా పాజిటివ్ గా ఉంటారు. ఎవరితోనూ గొడవలు పడే మనస్తత్వం వీరిది కాదు. అందరితోనూ మంచిగా ఉంటారు. ఆ మంచితనమే వారిని విజయానికి దగ్గర చేస్తుంది. ఈ తేదీల్లో పుట్టిన వారికి చాలా మంది పరిచయం అవుతూనే ఉంటారు. ఆ పరిచయాలే వారికి కొత్త కొత్త అవకాశాలు తెచ్చి పెడతారు. దీంతో.. వీరికి విజయానికి చేరువ కావడం చాలా సులభం అవుతుంది.
11వ తేదీ..
ఏ నెలలో అయినా 11వ తేదీలో జన్మించిన వారు కూడా లైఫ్ లో పెద్దగా కష్టపడకుండానే విజయం సాధించగలరు. న్యూమరాలజీలో 11వ నెంబర్ ని చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ తేదీలో జన్మించిన వారు తమ శరీరాన్ని, మనసు రెండింటినీ బ్యాలెన్స్ చేయగలరు.వీరికి వారిపై నమ్మకం చాలా ఎక్కువ. ఆ నమ్మకమే వారికి అనేక అవకాశాలను తెచ్చి పెడుతుంది. తమ బలం ఏంటో తెలుసుకొని.. దానికి తగిన కెరీర్ ని ఎంచుకుంటారు. మంచి స్థాయికి ఎదుగుతారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తారు.
12వ తేదీ..
ఏ నెలలో అయినా 12వ తేదీలో జన్మించిన వారు లైఫ్ లో చాలా తొందరగా సక్సెస్ ని అందుకుంటారు. ఈ తేదీలో 1 అంటే నాయకత్వ లక్షణాలు కలిగి ఉండటం, 2 అంటే.. శాంతియుత శక్తిని కలిగి ఉండటం. ఈ రెండు బలాలు వీరికి ఉంటాయి. అంతర్గత దృక్పథం, విశ్వాసం, ఆధ్యాత్మికత వీరి బలాలు. వీరు మాకు ఇదే కావాలి అని పట్టుపట్టరు. విశ్వం తనకు ఎలాంటి అవకాశాలు ఇస్తే..వాటిని ఉపయోగించుకుంటుంది. దాని వల్లే వారు జీవితంలో తొందరగా విజయం సాధించగలరు.
ఈ నాలుగు తేదీల వారు ఎక్కువగా ‘ప్రయత్నం కన్నా ప్రవాహం’ వైపు మొగ్గు చూపుతారు. ఇది బలహీనత కాదు..అది ఆత్మవిశ్వాసం, సమయం మీద నమ్మకం, విశ్వం పట్ల గౌరవం. ఈ గుణాల ద్వారానే వారు జీవితంలోని గొప్ప అవకాశాలను ఆకర్షించగలుగుతారు.

