- Home
- Astrology
- Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారిని చూసి అందరూ అసూయపడతారు, వీరి ఎదుగుదల తట్టుకోలేరు..!
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారిని చూసి అందరూ అసూయపడతారు, వీరి ఎదుగుదల తట్టుకోలేరు..!
వారి వ్యక్తిత్వం ఎంత గొప్పగా ఉన్నా, నిజాయితీగా ఉన్నా.. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగినా కూడా వారిని అసహ్యించుకుంటూనే ఉంటారు.

Birth date
జీవితంలో ప్రతి వ్యక్తి ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటాడు. కొంత మంది తమ మాటలతో, ప్రవర్తనతో ఇతరుల మనసు వెంటనే గెలుచుకుంటారు. మరికొందరు మాత్రం ఎంత ప్రయత్నించినా, ఎన్ని మంచి పనులు చేసినా కూడా ఎవరినీ ఆకట్టుకోలేరు. వారి వ్యక్తిత్వం ఎంత గొప్పగా ఉన్నా, నిజాయితీగా ఉన్నా.. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగినా కూడా వారిని అసహ్యించుకుంటూనే ఉంటారు. వారి ముందు నువ్వుతూ మాట్లాడినా వెంటనే వెనక తిట్టేసుకుంటూ ఉంటారు. న్యూమరాలజీ ప్రకారం కూడా అలాంటివారిని గుర్తించొచ్చు. ముఖ్యంగా మనం పుట్టిన ఆధారంగా తెలుసుకోవచ్చు. ఏ తేదీల్లో పుట్టిన వారి ఎదుగుదలను అందరూ తట్టుకోలేరో ఇప్పుడు తెలుసుకుందాం..
నెంబర్ 4..
ఏ నెలలో అయినా 4, 13,22 తేదీల్లో జన్మించిన వారు నెంబర్ 4 కిందకు వస్తారు. ఈ తేదీల్లో జన్మించిన వారిపై రాహువు ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ తేదీల్లో జన్మించిన వారు చాలా ధైర్యవంతులు, తెలివైనవారు కూడా. ఎంత మందిలో ఉన్నా.. తమకంటూ ఒక గుర్తింపు సంపాదించుకోగలరు. వారి కృషి, పట్టుదల కారణంగా విజయాన్ని అందుకుంటారు. అయితే, వారు ఎక్కువ గుర్తింపు సంపాదించిన ప్రతిసారీ..వీరిని చూసి అందరూ అసూయపడతారు. ఆ అసూయతో వారిని కిందకు లాగాలని ప్రయత్నిస్తారు. వీరి ఎదుగుదలను చాలా మంది అస్సలు జీర్ణించుకోలేరు. ఏదో ఒక రూపంలో బాధపెట్టాలని చూస్తారు.
నెంబర్ 8..
ఏ నెలలో అయినా 8, 17, 26 తేదీల్లో జన్మించిన వారు నెంబర్ 8 కిందకు వస్తారు. వీరిపై శని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ తేదీల్లో జన్మించినవారు సహజంగా చాలా నిజాయితీతో ఉంటారు. ఇతరులను మోసం చేయాలనే ఆలోచన వీరికి కలలో కూడా రాదు. ఎవరైనా తమను మోసం చేసినా కూడా వీరు తట్టుకోలేరు. అయినా కూడా వీరి జీవితం సాఫీగా సాగకపోవచ్చు. తరచూ ఎదురు దెబ్బలు ఎదుర్కొంటూ ఉంటారు. అయినప్పటికీ, వారు నెమ్మదిగా ఎదగడానికి ప్రయత్నిస్తారు.వీరు కర్మను మాత్రమే నమ్ముతారు.
నెంబర్ 9..
ఏ నెలలో అయినా 9, 18, 27 తేదీల్లో పుట్టినవారు నెంబర్ 9 కిందకు వస్తారు. ఈ తేదీల్లో జన్మించిన వారిపై మంగళ గ్రహ ప్రభావం ఉంటుంది.వీరు చాలా ధైర్యవంతులు. న్యాయాన్ని నిలబెట్టడంలో వీరు ఎప్పుడూ తమవంతు ప్రయత్నం చేస్తారు. వీరు ముక్కుసూటిగా ఉండటం వల్ల, ఇతరులతో కొంత అసౌకర్యం తలెత్తే అవకాశం ఉంది. అయితే, వారు నిస్వార్థంగా, నిజాయితీతో ముందుకు సాగుతారు.