MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Birth Stars: ఈ 5 నక్షత్రాల్లో పుట్టినవారు మహా ముదుర్లు.. మాటలతో మాయ చేసేస్తారు!

Birth Stars: ఈ 5 నక్షత్రాల్లో పుట్టినవారు మహా ముదుర్లు.. మాటలతో మాయ చేసేస్తారు!

మాటకు అపారమైన శక్తి ఉంటుంది. మనసును గెలుచుకోవాలన్న మాటే. బంధాన్ని దూరం చేయలన్నా మాటే. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ వాక్చాతుర్యం సాధారణమైంది కాదు. కొన్ని నక్షత్రాల్లో పుట్టినవారికి మాట్లాడే శైలి ప్రత్యేకంగా ఉంటుందట. ఆ నక్షత్రాలేవో ఇక్కడ చూద్దాం. 

2 Min read
Author : Kavitha G
Published : Feb 24 2026, 05:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Birth Stars Astrology
Image Credit : Getty

Birth Stars Astrology

జ్యోతిష్య శాస్త్రంలో జన్మ నక్షత్రానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. నక్షత్ర స్థితి వ్యక్తుల స్వభావం, ఆలోచనా తీరు, మాట తీరు, ప్రవర్తనలపై బలమైన ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా కొన్ని నక్షత్రాల్లో పుట్టినవారు తమ మాటలతో ఎదుటివారిని ఆకట్టుకునే అద్భుతమైన సామర్థ్యం కలిగి ఉంటారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. మాటల్లో మాధుర్యం, ఆలోచనల్లో చురుకుదనం, పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునే నైపుణ్యం వీరిలో సహజంగా ఉంటాయట. మరి ఈ లక్షణాలు ఏ నక్షత్రంలో జన్మించినవారికి ఉంటాయో తెలుసుకుందామా..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మృగశిర నక్షత్రం
Image Credit : Getty

మృగశిర నక్షత్రం

మృగశిర నక్షత్రంలో పుట్టినవారు తెలివిగా ఉంటారు. మాట్లాడే ముందు బాగా ఆలోచిస్తారు, కానీ మాట్లాడిన తర్వాత ఎదుటివారిపై గాఢమైన ముద్ర వేస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ నక్షత్రానికి అధిపతి కుజుడు. అందువల్ల వీరిలో ధైర్యం, చురుకుదనం కలిసి ఉంటాయి. వీరు వాదనల్లో గెలవడమే కాకుండా, తమ మాటలతో ఎదుటివారి మనసును కూడా గెలుచుకోగలరు. మార్కెటింగ్, టీచింగ్, వ్యాపారం వంటి రంగాల్లో వీరు బాగా రాణిస్తారు.

36
రోహిణి నక్షత్రం
Image Credit : AI

రోహిణి నక్షత్రం

రోహిణి నక్షత్రం చంద్రుని ఆధీనంలో ఉంటుంది. ఈ నక్షత్రంలో జన్మించినవారి మాటల్లో ఆకర్షణ, ఎమోషనల్ టచ్ ఎక్కువగా ఉంటాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. కఠినమైన విషయాన్ని కూడా మృదువుగా చెప్పగల సమర్థులు వీరు. కుటుంబం, ప్రేమ, స్నేహ సంబంధాల్లో వీరి మాటల మాధుర్యం పెద్ద పాత్ర పోషిస్తుంది. అయితే, కొన్నిసార్లు వీరు తమ ప్రయోజనాల కోసం కూడా ఈ మాటతీరును ఉపయోగించవచ్చని పండితులు చెబుతున్నారు.

46
స్వాతి నక్షత్రం
Image Credit : Getty

స్వాతి నక్షత్రం

స్వాతి నక్షత్రం వాయుదేవుని ప్రభావంలో ఉంటుంది. ఈ నక్షత్రంలో పుట్టినవారు స్వతంత్ర భావాలు కలిగి ఉంటారు. చాలా చురుకుగా ఉంటారు. వీరి మాటల్లో వేగం, తర్కం, స్పష్టత ఉంటాయి. ఏదైనా సమావేశంలో లేదా చర్చలో వీరు మాట్లాడితే అందరి దృష్టి వీరిపైనే ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ నక్షత్ర జాతకులు పరిస్థితులకు తగ్గట్టు తమ మాటల్ని మార్చుకుంటారు. ఇదే వీరి బలం.

56
అనూరాధ నక్షత్రం
Image Credit : Getty

అనూరాధ నక్షత్రం

అనూరాధ నక్షత్రంలో జన్మించిన వారిపై శని ప్రభావం ఉంటుంది. సాధారణంగా శని ప్రభావం ఉన్నవారు లోతైన ఆలోచనలతో, గంభీర స్వభావంతో ఉంటారు. వీరి మాటలు తక్కువగా ఉంటాయి కానీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరు వ్యూహాత్మకంగా మాట్లాడుతారు. రాజకీయాల్లో బాగా రాణిస్తారు. 

66
రేవతి నక్షత్రం
Image Credit : Asianet News

రేవతి నక్షత్రం

రేవతి నక్షత్రం బుధుడి ఆధీనంలో ఉంటుంది. బుధుడు వాక్చాతుర్యానికి కారకుడు. కాబట్టి ఈ నక్షత్రంలో పుట్టినవారు సహజంగానే మంచి వక్తలు. వీరి మాటల్లో చమత్కారం, తెలివి, సమయస్ఫూర్తి స్పష్టంగా కనిపిస్తాయి. ఒక సమస్యను సున్నితంగా పరిష్కరించడంలో, వివాదాలను చర్చల ద్వారా ముగించడంలో వీరు ముందుంటారు. పండితుల ప్రకారం ఈ నక్షత్ర జాతకులు రచన, సాహిత్యం, మీడియా రంగాలలో విశేషంగా రాణిస్తారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు!
Recommended image2
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Related Stories
Recommended image1
Planetary Transits: మార్చిలో ముఖ్య గ్రహాల సంచారం.. ఈ 6 రాశులవారి తలరాత మారడం పక్కా!
Recommended image2
Ketu Transit: కేతువు నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులవారికి అదృష్టం తలుపు తట్టడం ఖాయం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved