MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Ketu Transit: కేతువు నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులవారికి అదృష్టం తలుపు తట్టడం ఖాయం!

Ketu Transit: కేతువు నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులవారికి అదృష్టం తలుపు తట్టడం ఖాయం!

జ్యోతిష్య శాస్త్రంలో కేతువు అత్యంత శక్తిమంతమైన గ్రహం. కేతువు తన రాశిని లేదా నక్షత్రాన్ని మార్చినప్పుడు వ్యక్తుల జీవితాల్లో పెద్ద మార్పులు చోటుచేసుకుంటాయి. త్వరలో జరగనున్న కేతువు నక్షత్ర మార్పు కొన్ని రాశులవారికి బోలెడు అదృష్టాన్ని తీసుకురానుంది.

2 Min read
Author : Kavitha G
Published : Feb 23 2026, 02:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కేతువు నక్షత్ర మార్పు..
Image Credit : Getty

కేతువు నక్షత్ర మార్పు..

జ్యోతిష్య శాస్త్రంలో కేతువు సంచారం చాలా ముఖ్యమైంది. కేతువును ఛాయా గ్రహం అంటారు. కేతువు ఆధ్యాత్మికత, మోక్షానికి కారకుడు. పండితుల ప్రకారం, కేతువు ఏప్రిల్ 20న మఖ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఈ నక్షత్రానికి అధిపతి కూడా కేతువే కాబట్టి, ఈ సంచారం చాలా శక్తిమంతంగా ఉంటుంది. మరి కేతువు నక్షత్ర మార్పు ఏయే రాశులవారికి మేలు చేస్తుందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వృశ్చిక రాశి
Image Credit : Getty

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి కేతువు సంచారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఆగిపోయిన పనులు నెమ్మదిగా పూర్తవుతాయి. కెరీర్‌లో ముందుకు వెళ్లేందుకు అవకాశాలు వస్తాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు లేదా మంచి అవకాశాలు దొరుకుతాయి. వ్యాపారులు కొత్త కస్టమర్ల వల్ల లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. జీవితంలో స్థిరత్వం వస్తుంది, ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది.

35
కర్కాటక రాశి
Image Credit : Getty

కర్కాటక రాశి

కేతువు నక్షత్ర మార్పు కర్కాటక రాశి వారి అదృష్టాన్ని బలపరుస్తుంది. జీవితంలో ముందుకు సాగడానికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో మార్పు లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో మంచి లాభాలు ఆశించవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పాత అప్పులు తీరిపోతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. బంధాలు బలపడతాయి. మానసికంగా చాలా పాజిటివ్‌గా ఉంటారు.

45
సింహ రాశి
Image Credit : Pixabay

సింహ రాశి

సింహ రాశి వారికి కేతువు సంచారం పురోగతిని, గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. ఉద్యోగాలలో గుర్తింపు పెరుగుతుంది. పై అధికారుల నుంచి మద్ధతు లభిస్తుంది. పాత పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఈ సమయంలో భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకుంటారు. ఆత్మవిశ్వాసం, సమతుల్యత పెరుగుతాయి.

55
ధనుస్సు రాశి
Image Credit : AI Generated

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి కేతువు సంచారం మేలు చేస్తుంది. ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. పెద్దల ఆశీర్వాదం దక్కుతుంది. ఉద్యోగ, వ్యాపారాలలో మంచి ఫలితాలు పొందుతారు. విదేశీ ప్రయాణాలు లేదా విదేశీ సంబంధిత అవకాశాలు మెరుగుపడతాయి. కొత్త విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఈ రాశివారి వ్యక్తిత్వం మరింత మెరుగుపడుతుంది. 

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. నూతన వాహన యోగం!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు విలువైన వస్తువులను బహుమతులుగా పొందుతారు!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి దూరప్రాంతాల నుంచి అందిన వార్త ఆనందం కలిగిస్తుంది!
Related Stories
Recommended image1
Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారికి జీవిత భాగస్వామి సలహా కలిసివస్తుంది!
Recommended image2
Birth Month: ఈ 4 నెలల్లో పుట్టినవారు కొంచెం కష్టపడినా చాలు.. కోటీశ్వరులవుతారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved