Birth Date: ఈ 4 తేదీల్లో పుట్టిన వారు ఎక్కడ ఉంటే, అక్కడ డబ్బుకు లోటు ఉండదు
న్యూమరాలజీ ప్రకారం, కొన్ని తేదీల్లో పుట్టిన వారు భవిష్యత్తులో కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంది.

Birth date
న్యూమరాలజీ మన జీవితాలను చాలా బాగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా మనం పుట్టిన తేదీ ఆధారంగా మన వ్యక్తిత్వాన్ని, భవిష్యత్తును తెలుసుకోవచ్చు. ఈ సంఖ్యాశాస్త్రం ప్రకారం, కొన్ని తేదీల్లో పుట్టిన వారికి అదృష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. మరి, ఆ తేదీలేంటో చూద్దామా..
ఏ నెలలో అయినా 3, 12, 21, 30 తేదీల్లో జన్మించిన వ్యక్తులు నెంబర్ 3 కిందకు వస్తారు. ఈ సంఖ్యను గురువు పరిపాలిస్తాడు. అందుకే, వీరికి లక్ష్మీదేవి కృప చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు ఉన్న ఇంట్లో ధనానికి ఎప్పుడూ లోటు ఉండదు.
నెంబర్ 3..
సంఖ్యాశాస్త్రం ప్రకారం, ఏ నెలలోనైనా 3 వ తేదీలో జన్మించిన వ్యక్తులు చాలా ప్రశాంతంగా , సౌమ్యంగా ఉంటారు. ముఖ్యంగా వీరు తండ్రికి ఇష్టులైన వ్యక్తులు. వీరు తమ తండ్రికి అదృష్టాన్ని ఇస్తారు. వీరివల్ల ఇంట్లో లక్ష్మీదేవి కృప ఉంటుంది. ఈ తేదీన జన్మించిన స్త్రీలు పుట్టిల్లు , అత్తవారి ఇంటికి ధనం, ఆనందం , అదృష్టాన్ని తెస్తారు.
నెంబర్ 12..
సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏ నెలలోనైనా 12వ తేదీన జన్మించిన వ్యక్తులు లక్ష్మీదేవికి ఇష్టులైన వ్యక్తులు. వీరు చేసే వ్యాపారం బాగుంటుంది. వీరు తమ తల్లిదండ్రులకు అదృష్టాన్ని ఇస్తారు. సమాజంలో వీరికి మంచి గౌరవం, మర్యాద లభిస్తుంది. వీరివల్ల ఇంట్లో డబ్బు సమస్య రాదు. వచ్చినా వెంటనే తీరిపోతుంది. ఈ తేదీన జన్మించిన ఆడపిల్లలు ఉన్న ఇంట్లో ధనం, శ్రేయస్సు, ఆనందం పెరుగుతాయి.
నెంబర్ 21
సంఖ్యాశాస్త్రం ప్రకారం, ఏ నెలలోనైనా 21వ తేదీన జన్మించిన వ్యక్తులు తమ తల్లిదండ్రులకు కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడతారు. ఈ తేదీన జన్మించిన వ్యక్తులు చాలా తెలివైనవారు. వారు సాధించాలనుకున్నది సరిగ్గా ప్రణాళిక వేసుకుని సాధిస్తారు. వారి కలలు నిజమయ్యే అవకాశం ఉంది. ఈ తేదీన జన్మించిన స్త్రీలు అత్తవారి ఇంట్లో అడుగుపెట్టగానే ఆ ఇంటికి సకల ఐశ్వర్యాలు లభిస్తాయి.
నెంబర్ 30
సంఖ్యాశాస్త్రం ప్రకారం, ఏ నెలలోనైనా30వ తేదీన జన్మించిన వ్యక్తుల వల్ల ఆ ఇల్లు చాలా అందంగా మారుతుంది. వీరు కష్టజీవులు, ఏదైనా సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ తేదీన జన్మించిన వ్యక్తులు చూడటానికి చాలా అందంగా ఉంటారు. వీరు సౌమ్య స్వభావులు. ఈ తేదీన జన్మించిన వ్యక్తిని వివాహం చేసుకున్నవారికి జీవితంలో అదృష్టం కలుగుతుంది.