Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు వ్యాపారం జోలికే వెళ్లకూడదు.. వెళితే అంతా నాశనమే..!
మీరు పుట్టిన తేదీ ఆధారంగా... వ్యాపారం, ఉద్యోగం.. ఈ రెండింటిలో మీరు సత్తా చాటగలరు..? ఏది ఎంచుకుంటే మీ భవిష్యత్తు బాగుంటుందో, న్యూమరాలజీ ఏం చెబుతుందో తెలుసుకోవాలని ఉందా?

birth date
న్యూమరాలజీ మన జీవితాలను చాలా ఎక్కువగానే ప్రభావితం చేస్తుంది. దీనిని ఆధారంగా చేసుకొని మనం కేవలం మన వ్యక్తిత్వం మాత్రమే కాదు, మనం ఎలాంటి రంగం ఎంచుకుంటామో కూడా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా వ్యాపారం, ఉద్యోగం.. ఈ రెండింటిలో ఏది ఎంచుకుంటే.. లైఫ్ బాగుంటుంది అనే విషయం ఇప్పుడు చూద్దాం. ప్రముఖ న్యూమరాలజీ స్పెషలిస్ట్ అరవింద్ ఈ విషయాలు మనకు తెలియజేశారు.
నెంబర్ 1( 1, 10, 19, 28)
ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 1 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారిలో సహజంగా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. అందుకే, వీరికి ఉద్యోగం సూట్ అవ్వదు. ఉద్యోగంలో అడుగుపెట్టినా కూడా చాలా బద్దకంగా ఉంటారు. ఆసక్తి లేకుండా పని చేస్తారు. అదే, ఈ తేదీల్లో పుట్టిన వారు వ్యాపారం ఎంచుకుంటే వారి జీవితం బాగుంటుంది. ఎలాంటి వ్యాపారం ఎంచుకున్నా కూడా వీరు బాగా రాణించగలరు. అలాంటి సత్తా వీరిలో ఉంది.
నెంబర్ 2( 2, 11, 20, 29)
ఏ నెలలో అయినా 2, 11, 20, 29 తేదీల్లో జన్మించిన వారు నెంబర్ 2 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా సౌమ్యంగా ఉంటారు. జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చినా దానికి అనుగుణంగా వారిని వారు మార్చుకోగలరు. అందుకే... వీరు వ్యాపారం కంటే.. ఉద్యోగాన్ని ఎంచుకోవడం బెస్ట్. ఉద్యోగంలో వీరు మంచి స్థాయికి వెళ్లగలరు.
నెంబర్ 3( 3, 12, 21, 30)
ఏ నెలలో అయినా 3, 12, 21, 30 తేదీల్లో జన్మించిన వారు నెంబర్ 3 కిందకు వస్తారు. వీరిని గురు గ్రహం పాలిస్తూ ఉంటుంది. అందుకే ఈ తేదీల్లో జన్మించినవారు జ్ఞానవంతులు కాగలరు. అంతేకాదు వీరు శ్రమజీవులు. కష్టపడే తత్వం చాలా ఎక్కువ. ఉద్యోగం, వ్యాపారం రెండింటిలోనూ విజయం సాధించగలరు.
నెంబర్ 4 (4, 13, 22, 31)
ఏ నెలలో అయినా 4, 13,22, 31 తేదీల్లో జన్మించిన వారు నెంబర్ 4 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారిపై రాహువు ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు కొంచెం రెబల్ లాంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారు. ఉద్యోగం కాకుండా, స్వంతంత్రంగా వ్యాపారం చేస్తే.. వీరు లైఫ్ లో మంచి స్థాయికి వెళ్లగలరు.
నెంబర్ 5 (5, 14,23)
ఏ నెలలో అయినా 5, 14, 23 తేదీల్లో జన్మించిన వారు నెంబర్ 5 కిందకు వస్తారు. ఈ తేదీల్లో జన్మించిన వారిపై బుధుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా వీరు చాలా చురుకుగా ఉంటారు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉంటాయి. మాటలతో అందరినీ ఆకట్టుకోగలరు. అందుకే.. వీరు ఉద్యోగాన్ని ఎంచుకోవడం ఉత్తమం. వ్యాపారాన్ని ఎంచుకోవాలి అంటే సరైన ప్లానింగ్ అవసరం.
నెంబర్ 6 (6, 15, 24)
ఏ నెలలో అయినా 6, 15, 24 తేదీల్లో జన్మించిన వారు నెంబర్ 6 కిందకు వస్తారు. ఈ తేదీల్లో జన్మించిన వారిని శుక్ర గ్రహం పరిపాలిస్తూ ఉంటుంది. వీరు ఆకర్షణ, నైపుణ్యానికి మారుపేరుగా నిలుస్తారు. ఏదైనా క్రియేటివ్ ఫీల్డ్ ఎంచుకుంటే వీరు మంచిగా రాణించగలరు. ముఖ్యంగా వ్యాపారం ఎంచుకుంటే... జీవితంలో మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉంది.
నెంబర్ 7( 7, 16,25)
ఏ నెలలో అయినా 7, 16, 25 తేదీల్లో జన్మించిన వారు నెంబర్ 7 కిందకు వస్తారు. వీరి పై కేతువు ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు ప్రతి దానిని చాలా ఎక్కువగా పరిశీలించగల సామర్థ్యం కలిగి ఉంటారు. వీరు వేగం కన్నా స్థిరత్వానికే ఎక్కువ మక్కువ చూపిస్తారు. కాబట్టి, వీరు ఉద్యోగం చేయడమే మంచిది.
నెంబర్ 8( 8, 17, 26)
ఏ నెలలో అయినా 8,17, 26 తేదీల్లో జన్మించిన వారు నెంబర్ 8 కిందకు వస్తారు. వీరిపై శని గ్రహ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. శని ప్రభావం కారణంగా వీరు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. ధైర్యంగా వ్యాపార రంగంలో అడుగుపెడితే పెద్ద ఫలితాలు సాధించగలరు. అందుకే, వీరు వ్యాపారంలో వీరు బాగా రాణించగలరు.
నెంబర్ 9( 9, 18, 27)
ఏ నెలలో అయినా 9, 18, 27 తేదీల్లో జన్మించిన వారిపై మంగళ గ్రహ ప్రభావం ఉంటుంది. వీరిలో పోరాట శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. సహజ స్ఫూర్తి కలిగి ఉంటారు. వీరు వ్యాపారం ఎంచుకుంటే.. చాలా బాగా రాణించగలరు. ఆ ధైర్యం వీరిలో ఉంది.