Birth Date: ఈ తేదీల్లో పుట్టిన పిల్లలకు తెలివి తేటలు చాలా ఎక్కువ..!
మనం పుట్టిన తేదీ ని ఆధారంగా చేసుకొని మన వ్యక్తిత్వం గురించి, భవిష్యత్తు గురించి కచ్చితంగా తెలుసుకోవచ్చు.

Birth Date
జోతిష్య శాస్త్రం మన జీవితాలను ఎంతలా ప్రభావితం చేస్తుందో.. న్యూమరాలజీ కూడా అంతే ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా న్యూమరాలజీ ప్రకారం మన భవిష్యత్తు, వ్యక్తిత్వం తెలుసుకోవచ్చు. ఎలాంటి కెరీర్ ఎంచుకుంటే భవిష్యత్తు బాగుంటుదో కూడా సంఖ్యా శాస్త్రం వివరిస్తుంది. మనం పుట్టిన తేదీ ని ఆధారంగా చేసుకొని ఈ విషయాలు తెలుసుకోవచ్చు. మరి, ఈ పుట్టిన తేదీ ఆధారంగా ఎక్కువ తెలివి తేటలు ఉంటాయో తెలుసుకుందామా…
నెంబర్ 2..
ఏ నెలలో అయినా 2, 11, 20, 29 తేదీల్లో జన్మించిన వారు నెంబర్ 2 కిందకు వస్తారు. సంఖ్యా శాస్త్రం ప్రకారం నెంబర్ 2ని చంద్రుడు కి సంబంధించిన సంఖ్యగా పరిగణిస్తారు. చంద్రుడి మనసు కి అధిపతి, అందుకే.. ఈ తేదీల్లో పుట్టిన పిల్లలు.. చాలా సున్నితంగా, ఎమోషనల్ గా ఉంటారు.
తెలివితేటలు ఎక్కువ..
ఈ తేదీల్లో పుట్టిన వారు ఎమోషనల్ గా ఉన్నా కూడా.. మానసికంగా చాలా చురుగ్గా ఉంటారు. ప్రతి పనిలోనూ వారు తమ మెదడు శక్తిని పూర్తిగా ఉపయోగిస్తారు. తెలివితేటలతో పూర్తి చేయాల్సిన పనులను వారు సులభంగా పూర్తి చేయగలరు. వీరి మెదడు చాలా షార్ప్ గా పని చేస్తుంది. ఆలోచించకుండా ఏ అడుగు వేయరు.
తీయగా మాట్లాడతారు..
ఈ తేదీల్లో పుట్టిన వారు స్వేచ్ఛను ఎక్కువగా కోరుకుంటారు. వీరి మాటల్లో ఫిల్టర్ ఏమీ ఉండదు. మనసులో ఏది ఉందో.. అదే డైరెక్ట్ గా కూడా చెబుతారు. కానీ, వీరి మాటలు ఘాటుగా ఉండవు. చాలా మృదువుగా మాట్లాడతారు. ప్రజలు వారి మాటలకు సులభంగా ఆకర్షితులవుతారు. తమ మాటలతో త్వరగా స్నేహితులను సంపాదిస్తారు. వారు ఎక్కడికి వెళ్ళినా అందరూ వారిని ఇష్టపడతారు.