- Home
- Astrology
- Birth Date:మీ పుట్టిన తేదీ ప్రకారం,మీకు వచ్చే ఆరోగ్య సమస్యలు తెలుసుకోవచ్చని మీకు తెలుసా?
Birth Date:మీ పుట్టిన తేదీ ప్రకారం,మీకు వచ్చే ఆరోగ్య సమస్యలు తెలుసుకోవచ్చని మీకు తెలుసా?
పుట్టిన తేదీ ఆధారంగా చేసుకొని మన వ్యక్తిత్వం ఎలా ఉంటుందో మాత్రమేకాదు.. మనకు భవిష్యత్తులో వచ్చే ఆరోగ్య సమస్యలు కూడా తెలుసుకోవచ్చు.

birth date
జోతిష్యశాస్త్రం ప్రకారం.. మన పుట్టిన రోజు, సమయం ఆధారంగా మన భవిష్యత్తు ఎలా తెలుసుకోవచ్చో.. న్యూమరాలజీ ఆధారం గా కూడా మనం మన జీవితానికి సంబంధించిన చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ముఖ్యంగా పుట్టిన తేదీ ఆధారంగా చేసుకొని మన వ్యక్తిత్వం ఎలా ఉంటుందో మాత్రమేకాదు.. మనకు భవిష్యత్తులో వచ్చే ఆరోగ్య సమస్యలు కూడా తెలుసుకోవచ్చు. మరి, పుట్టిన తేదీ ప్రకారం.. ఎవరికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందో తెలుసుకుందామా...
నెంబర్ 1..
న్యూమరాలజీ ప్రకారం నెంబర్ 1 తేదీలో జన్మించిన వారు అత్యంత శక్తివంతమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో జన్మించిన వారు ఈ నెంబర్ 1 కిందకు వస్తారు. సహజంగా వీరు ఎప్పుడూ చాలా ఎనర్జిటిక్ గా ఉంటారు. కానీ.. వీరికి కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వీరు ఎక్కువగా అధిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఇంటి పని లేదా.. ఆఫీసు పని ఏదైనా సరే ఒత్తిడి మాత్రం కామన్ గా ఉంటుంది. న్యూమరాలజీ ప్రకారం, వీరికి అధిక రక్తపోటు( బీపీ), హార్ట్ సంబంధిత సమస్యలు, కంటి చూపులో మార్పులు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, వీరు ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండాలి. అలాగే, రెగ్యులర్ గా కంటి పరీక్షలు చేయించుకుంటూ ఉండడాలి.
నెంబర్ 2..
ఏ నెలలో అయినా 2, 11, 20, 29 తేదీల్లో జన్మించినవారు నెంబర్ 2 కిందకు వస్తారు. ఈ సంఖ్య చంద్రుడికి చెందినది. వీరికి భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. ఈ తేదీల్లో పుట్టిన వారికి కామన్ గా కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా.. జలుబు, దగ్గు, అసిడిటీ, కడుపు నొప్పి వంటి సమస్యలను తరచూ ఎదుర్కొనవచ్చు. వీరిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటంతో చిన్న వ్యాధులు సులభంగా వచ్చే అవకాశం ఉంది. తేమ వాతావరణం, గాలి మార్పులకు త్వరగా ప్రభావితమవుతారు. అందుకే, ఈ తేదీల్లో జన్మించిన వారు తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే రోగనిరోధక శక్తి ఇంప్రూవ్ అవుతుంది. అప్పుడు జబ్బున పడే అవకాశం తక్కువగా ఉంటుంది.
నెంబర్ 3..
ఏ నెలలో అయినా 3, 12, 21, 30 తేదీల్లో జన్మించినవారు నెంబర్ 3 కిందకు వస్తారు.3 సంఖ్య గురు గ్రహానికి చెందినది. ఈ వ్యక్తులు సహజంగా చురుకుగా ఉంటారు. ప్రసన్నంగా ఉండే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. కానీ వీరిలో ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు, దుమ్ము అలెర్జీలు, మూత్రనాళాల ఇన్ఫెక్షన్లు, బరువు పెరగడం వంటి సమస్యలు కనిపించవచ్చు. వీరు ఆరోగ్యంపై శ్రద్ధ చూపించి, పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. వ్యాయామం, యోగా, ప్రాణాయామం వంటివి చాలా ఉపయోగకరం. ముఖ్యంగా అధిక బరువును కంట్రోల్ లో ఉంచుకోవడానికి బయట ఆహారాలకు దూరంగా ఉండాలి.
నెంబర్ 4..
ఏ నెలలో అయినా 4, 13, 22, 31 తేదీల్లో జన్మించినవారు నెంబర్ 4 కిందకు వస్తారు. ఈ సంఖ్యలు రాహుని సూచిస్తాయి. వీరు విభిన్నంగా ఆలోచించే స్వభావం కలిగివుంటారు. శారీరకంగా వీరికి తలనొప్పులు, మైగ్రేన్, శ్వాసకోశ సమస్యలు, గొంతు ఇన్ఫెక్షన్లు వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే జుట్టు సమస్యలు కూడా ఎక్కువగా కనిపించవచ్చు. వేడి , శీతల వాతావరణాల్లో మార్పులు వీరిపై ప్రభావం చూపవచ్చు. శరీరాన్ని ఆహారం ద్వారా కూలింగ్ ఉంచడం మంచిది. సీజన్ మారినప్పుడు కాస్త ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. అప్పుడే ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు.
నెంబర్ 5..
ఏ నెలలో అయినా 5, 14, 23 తేదీల్లో జన్మించినవారు నెంబర్ 5 కిందకు వస్తారు. నెంబర్ 5 అనేది బుధుడికి చెందినది. ఈ వ్యక్తులు చురుకైనవారు, కానీ శరీరంలో టాక్సిన్ల స్థాయిలు పెరగడం, జీర్ణ సమస్యలు, గొంతునొప్పులు వంటి సమస్యలు వీరిని బాధించగలవు. అధికంగా తినే అలవాటు, వేగంగా తినడం వల్ల సమస్యలు పెరుగుతాయి. తేలికపాటి ఆహారం తీసుకోవడం, నీటిని ఎక్కువగా తాగడం వల్ల ఉపశమనం లభిస్తుంది.
నెంబర్6..
ఏ నెలలో అయినా 6, 15, 24 తేదీల్లో జన్మించినవారు నెంబర్ 6 కిందకు వస్తారు. నెంబర్ 6 అనేది శుక్రుడికి చెందినది. వీరు ప్రేమ, అందం, సౌందర్యానికి ప్రాధాన్యం ఇస్తారు. కానీ వీరికి లైంగిక సంబంధ సమస్యలు, రుతుక్రమ సంబంధ సమస్యలు, సంతాన సంబంధమైన ఇబ్బందులు, చర్మవ్యాధులు వంటి సమస్యలు వచ్చే అవకాశముంది. హార్మోన్ మార్పులకు త్వరగా ప్రభావితమవుతారు. ఆయుర్వేదం ప్రకారం వీరు వీలైనంత వరకు శరీరానికి విశ్రాంతి ఇవ్వాలి. అదేవిధంగా హార్మోనల్ బ్యాలెన్స్ కోసం యోగా , మెడిటేషన్ వంటివి చేయాలి.
నెంబర్ 7..
ఏ నెలలో అయినా 7, 16, 25 తేదీల్లో జన్మించినవారు న్యూమరాలజీ ప్రకారం నెంబర్ 7 కిందకు వస్తారు. 7 అనేది కేతువుకు సంబంధించిన సంఖ్య. ఈ తేదీల్లో జన్మించిన వారికి ఆత్మశోధన, ఆధ్యాత్మికత ఎక్కువగా ఉంటుంది. కానీ శరీరపరంగా వీరిని ఆందోళన, మానసిక ఒత్తిడి, నాడీ సంబంధ సమస్యలు, కాళ్ళ నొప్పి వంటి ఇబ్బందులు వెంటాడవచ్చు. వీరు గమనించాల్సింది ఏమిటంటే, మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, మైండ్‌ఫుల్‌నెస్ ప్రాక్టీస్ లాంటివి చేపట్టడం చాలా ఉపయోగకరం.
నెంబర్ 8..
ఏ నెలలో అయినా 8, 17, 26 తేదీల్లో జన్మించినవారు నెంబర్ 8 కిందకు వస్తారు. ఇది శని గ్రహానికి సంబంధించిన నెంబర్. వీరు ఆత్మవిశ్వాసంతో ఉండేవారు, కానీ మానసిక ఒత్తిడి ఎక్కువగా తీసుకుంటారు. శరీరపరంగా వీరిని కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్, కండరాల బలహీనత, తలనొప్పులు తరచూ బాధించవచ్చు. శరీరాన్ని శక్తివంతంగా ఉంచేందుకు మంచి ఆహారం, నిద్ర, వ్యాయామం అనేవి అవసరం. ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యానికి
ముగింపు
ఈ సమాచారం సంఖ్యాశాస్త్రం , జ్యోతిష శాస్త్రం ఆధారంగా అభిప్రాయాల రూపంలో ఇచ్చాం. ఇవి వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయంగా పరిగణించరాదు. ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే, వెంటనే వైద్యుల్ని సంప్రదించడం మంచిది. పుట్టిన తేదీ ప్రకారం ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండటం ద్వారా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవచ్చు.