Birth Date: ఈ నాలుగు తేదీల్లో పుట్టిన వారికి డబ్బు కొరత ఎప్పటికీ రాదు
కొన్ని తేదీల్లో పుట్టిన వారిలో నాయకత్వ లక్షణాలు మెండుగా ఉంటాయి. కాన్ఫిడెన్స్ లెవల్స్ కూడా చాలా ఎక్కువ. వారిలో చాలా క్రియేటివిటీ ఉంటుంది. మంచి లీడర్స్ గా నిలుస్తారు. వీరికి జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లోనూ డబ్బు కొరత ఎప్పటికీ రాదు.

న్యూమరాలజీ ప్రకారం ఒక వ్యక్తి పుట్టిన తేదీ ఆధారంగా వాళ్ల గుణగణాలు, ప్రవర్తన, కెరీర్ ఛాయిస్ ల గురించి తెలుసుకోవచ్చు. ఎవరైనా ఒక వ్యక్తి వారు పుట్టిన తేదీలోని అంకెల మొత్తం ఆధారంగా వారి లైఫ్ పాత్ నెంబర్ ని లెక్కిస్తారు. అలా లెక్కించగా వచ్చిన సంఖ్య ఆధారంగా వారి భవిష్యత్తు తెలుసుకుంటారు. ముఖ్యంగా నెంబర్ 1 కి చెందిన వ్యక్తులు జీవితంలో ఎప్పుడూ ఓడిపోరు. వారు పుట్టిందే విజయం సాధించడానికి. లైఫ్ లో వారు అనుకున్న లక్ష్యాన్ని చాలా సులభంగా చేరుకుంటారు. కేవలం లైఫ్ లోనే కాదు, కెరీర్ లోనూ సక్సెస్ వారి సొంతమౌతుంది.
ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా లక్కీ..
న్యూమరాలజీ ప్రకారం మీరు ఏ నెలలో అయినా సరే 1, 10, 19, 28 తేదీల్లో జన్మిస్తే చాలు. మీ లైఫ్ పాత్ నెంబర్ 1 అవుతుంది. ఈ సంఖ్య సూర్యుడి శక్తిని సూచిస్తుంది. ఈ తేదీల్లో పుట్టిన వారిలో నాయకత్వ లక్షణాలు మెండుగా ఉంటాయి. కాన్ఫిడెన్స్ లెవల్స్ కూడా చాలా ఎక్కువ. వారిలో చాలా క్రియేటివిటీ ఉంటుంది. మంచి లీడర్స్ గా నిలుస్తారు. వీరికి జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లోనూ డబ్బు కొరత ఎప్పటికీ రాదు. మంచిగా డబ్బు సంపాదించగల సత్తా వీరిలో ఉంటుంది.
Numerology
వాళ్లు నమ్మకమైనవాళ్లు. ఇండిపెండెంట్ గా ఆలోచిస్తారు. వాళ్ల యూనిక్ పర్సనాలిటీ తో అందరినీ ఆకర్షిస్తారు. ఎక్కడికి వెళ్లినా, ఏ ఫీల్డ్ లో ఉన్నా తమదైన ముద్ర వేస్తారు. లైఫ్ లో, కెరీర్ లో ఛాలెంజెస్ కి భయపడరు. వాటిని అవకాశాలుగా మార్చుకుంటారు.కానీ, వాళ్ల స్ట్రాంగ్ పర్సనాలిటీ వల్ల కొన్నిసార్లు మొండిగా, అహంకారంగా ప్రవర్తిస్తారు. కొన్నిసార్లు తమ మాటే సరైనదని అనుకుంటారు. ఇతరుల సలహాలు పట్టించుకోరు.కానీ మంచి మనసున్నవాళ్లు. అవసరంలో ఉన్నవాళ్లకి సాయం చేస్తారు. క్రియేటివ్ గా ఉంటారు. ఆర్ట్స్, రైటింగ్ లాంటి ఫీల్డ్స్ లో సక్సెస్ అవుతారు.
స్నేహం & ప్రేమ
లైఫ్ పాత్ నంబర్ 1 ఉన్నవాళ్లు ప్రేమ, రిలేషన్షిప్స్ లో పార్టనర్ కి లాయల్ గా ఉంటారు. ప్రేమించేవాళ్లని గౌరవిస్తారు. కానీ రిలేషన్షిప్ లో కొంత స్వేచ్ఛ కోరుకుంటారు. పార్టనర్ నుండి గౌరవం, అవగాహన ఆశిస్తారు. కోపం, మొండితనం వల్ల కొన్నిసార్లు గొడవలు రావచ్చు. చిన్న చిన్న విషయాలని పట్టించుకోకపోతే ప్రేమ జీవితం బాగుంటుంది. పార్టనర్ ఫీలింగ్స్ ని అర్థం చేసుకోవడం, ఓపెన్ గా మాట్లాడుకోవడం మంచిది.
కెరీర్ ఆప్షన్స్
లైఫ్ పాత్ నంబర్ 1 ఉన్నవాళ్లు భవిష్యత్ గోల్స్ పెట్టుకుని వాటిని సాధించడానికి కష్టపడతారు. లీడర్షిప్, కొత్త ఆలోచనలు, స్వేచ్ఛ ఉండే కెరీర్స్ వీళ్లకి సూట్ అవుతాయి. బిజినెస్, మేనేజ్మెంట్, మార్కెటింగ్, యాడ్స్, ఆర్ట్స్, రైటింగ్, టెక్నాలజీ లాంటి ఫీల్డ్స్ బాగుంటాయి.
హెల్త్ ఎలా ఉంటుంది?
యాక్టివ్ గా, ఎనర్జిటిక్ గా ఉంటారు. కానీ గోల్స్ కోసం చాలా కష్టపడతారు కాబట్టి స్ట్రెస్, అలసట వస్తాయి. యోగా, ధ్యానం, వ్యాయామం చేస్తే మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది. ఎప్పుడూ బిజీగా ఉంటారు కాబట్టి తినడం మర్చిపోతారు. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. యాక్టివ్ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి.