Zodiac Signs: చంద్ర, శుక్రుల కలయికతో అరుదైన యోగం.. ఈ 5 రాశులకు డబ్బే డబ్బు!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు తరచూ రాశులను మారుస్తుంటాయి. మరో గ్రహాంతో కలిసి రాజయోగాలను ఏర్పరుస్తుంటాయి. నేడు (శుక్రవారం) అత్యంత శుభప్రదమైన, అరుదైన కళానిధి యోగం ఏర్పడనుంది. ఇది 5 రాశుల వారి జీవితంలో వెలుగులు నింపనుంది. మరి ఆ రాశులేంటో చూద్దామా…

కళానిధి యోగం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల మార్పు, కదలికలు ప్రత్యేకమైన యోగాలను సృష్టిస్తాయి. ఈ ప్రభావం కొన్ని రాశులకు శుభ, మరికొన్ని రాశులకు అశుభ ఫలితాలను ఇస్తుంది. జూన్ 20 శుక్రవారం సాయంత్రం చంద్రుడు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. అక్కడే ఉన్న శుక్రుడితో కలిసి అరుదైన కళానిధి యోగాన్ని ఏర్పరుస్తాడు.
దీనివల్ల 5 రాశులవారి జీవితంలో ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. అదృష్టం వారి వెంటే ఉంటుంది. వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎప్పటినుంచో ఉన్న సమస్యలు తొలగి ఆనందంగా ఉంటారని జ్యోతిష్య నిపుణులు చెబుుతున్నారు. మరి ఏ రాశుల వారికి కళానిధి యోగం శుభ ఫలితాలను ఇవ్వనుందో ఇక్కడ తెలుసుకుందాం.
మేష రాశివారిపై కళానిధి యోగం ప్రభావం ఎలా ఉంటుంది?
మేషరాశి వారికి కళానిధి యోగం శుభప్రదం. ఆరోగ్యం బాగుంటుంది. వృత్తి, వ్యాపారంలో పురోగతి ఉంటుంది. అనుకున్న లక్ష్క్యాలను చేరుకుంటారు. కొత్త ప్రాజెక్టుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా ఉంటుంది.
గతంతో పోలిస్తే ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. జీవిత భాగస్వామి తరఫు నుంచి ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉంది. పిల్లల చదువు, ఉద్యోగం విషయాల్లో శుభవార్తలు వింటారు.
కర్కాటక రాశివారికి ఎలా ఉంటుందంటే?
కర్కాటక రాశి వారికి కళానిధి యోగం కొత్త శక్తి, అవకాశాలు తెస్తుంది. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ధైర్యంతో ముందుకు సాగుతారు. ఉద్యోగంలో ప్రతిభకు తగ్గ గుర్తింపు దక్కుతుంది. ప్రమోషన్ రావచ్చు. లేదా జీతం పెరగవచ్చు. ఉన్నతాధికారులు అండగా నిలుస్తారు.
నిరుద్యోగులకు కలిసివస్తుంది. వారు కోరుకున్న ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ సమేతంగా పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారంలో అంచనాలు నిజమవుతాయి. ఊహించని లాభాలు అందుకుంటారు.
తుల రాశి వారిపై కళానిధి యోగం ప్రభావం
తులారాశి వారికి కళానిధి యోగం అత్యంత శుభ ఫలితాలను ఇస్తుంది. అదృష్టం వీరి వెంటే ఉంటుంది. వ్యాపారాల్లో లాభాల పంట పండుతుంది. భాగస్వామ్యం వ్యాపారాలు సైతం కలిసివస్తాయి. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు.
ఉద్యోగంలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులతో ఉన్న అపర్థాలు, సమస్యలు తొలగిపోతాయి. మరింత బలమైన బంధాలు ఏర్పడుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
మకర రాశి వారి అదృష్టం ఎలా ఉంటుంది?
కళానిధి యోగం మకర రాశి వారికి సంపదను తీసుకువస్తుంది. వ్యాపారంలో మంచి అవకాశాలు వస్తాయి. ఇవి భవిష్యత్తులో కూడా లాభాలను తెచ్చిపెడతాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.
ఆరోగ్యం బాగుంటుంది. చేపట్టిన అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. శత్రువులు కూడా స్నేహితులుగా మారుతారు. ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఇంటా బయటా సంతోషకర వాతావరణం ఉంటుంది.
మీన రాశివారిపై కళానిధి యోగం ప్రభావం ఎలా ఉంటుందంటే?
మీనరాశి వారికి కళానిధి యోగం జ్ఞానం, సంపదను తీసుకువస్తుంది. మీ తెలివితేటలతో కొన్ని సమస్యల నుంచి సులువుగా బయటపడతారు. ఆదాయం పెరుగుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్తారు.
బంధుమిత్రులతో సఖ్యతగా ఉంటారు. దైవ కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తారు. అయితే ఖర్చులు కాస్త నియంత్రణలో ఉంచుకోవడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో మెరుగైన ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది.