Moon Transit: శుక్రుని ఇంట్లో చంద్రుడు.. ఈ 3 రాశులవారికి బీభత్సంగా కలిసొస్తుంది
Moon Transit: చంద్రుడు గ్రహాలలో ముఖ్యమైనవాడు. కొత్త ఏడాది 2026 వచ్చాక మొదటిసారిగా చంద్రుడు శుక్రుని రాశి అయిన తులారాశిలోకి ప్రవేశించాడు. దీని వల్ల మూడు రాశల వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. వీరు మట్టి ముట్టినా బంగారమయ్యే రోజులు ఇవి.

శుక్రుని రాశిలో అడుగపెట్టిన చంద్రుడు
కొత్త ఏడాది 2026 వచ్చి 10 రోజులు గడిచి పోయాయి. జనవరి 11వ రోజున చంద్రుడు తులా రాశిలోకి ప్రవేశించాడు. తులా రాశి శుక్రుని సొంత రాశి. ఈ చంద్ర సంచారం జనవరి 11, 2026న ఉదయం 5 గంటల ప్రాంతంలో జరిగింది. ఈ మార్పు అన్ని రాశులపై విపరీతమైన మార్పులను కలిగిస్తుంది. ఇది రాబోయే రోజుల్లో మూడు రాశుల వారికి అదృష్టాన్ని తెస్తుంది. ఆ రాశుల్లో మీ రాశి ఉందో లేదో తెలుసుకోండి.
కర్కాటక రాశి
తులారాశిలోకి చంద్రుడు అడుగపెట్టడం కర్కాటక రాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఇది వారికి వరం లాంటిదేనని చెప్పాలి. ఈ రాశి వారు చంద్రుని చలవ వల్ల జీవితంలో కోరుకున్నవి సాధిస్తారు. కొత్త శిఖరాలను చేరుకుంటారు. అంతేకాదు వీరి ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. పెద్ద ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. పెళ్లి కాన వారికి తమకు నచ్చిన వ్యక్తితో పెళ్లి జరిగే అవకాశాలు ఉన్నాయి. వీరు చేసే సామాజిక సేవకు మంచి గుర్తింపు వస్తుంది. మీరు మీ తల్లిదండ్రులను గర్వించే విధంగా ఉంటారు.
తులా రాశి
తులా రాశిలోకే చంద్రుడు అడుగుపెట్టాడు, దీని వల్ల తులారాశి వారు కూడా అదృష్టవంతులే అవుతారు. వీరు ప్రతి పనిలో ఎక్కువ ఏకాగ్రత పెట్టి పనిచేస్తారు. కోరుకున్న ప్రతి అంశంలో వీరు విజయం సాధించే అవకాశం ఉంది. తులా రాశివారికి తమ తల్లితో అనుబంధం రోజురోజుకు బలపడుతుంది. జనవరి మూడవ వారంలో కొత్త వస్తువులు కొనే అవకాశాలు ఉన్నాయి. వీరు డబ్బులు కూడా పొదుపు చేసే అవకాశం ఉంది. వీరు చంద్రుడి కరుణ వల్ల ఎలాంటి మానసిక ఒత్తిడి బారిన పడకుండా ఉంటారు.
మకర రాశి
కర్కాటక, తులారాశి వారితో పాటూ మకర రాశి వారికి కూడా చంద్రుని సంచారం అన్ని రకాలుగా కలిసివస్తుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వీరిలో మానసిక ఒత్తిడి మొత్తం మాయమవుతుంది. మానసిక ఆరోగ్యం చక్కగా ఉంటుంది. మకర రాశి వారు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలంటే తల్లితో ఎక్కువ సమయం గడపాలి.

