MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈ 5 నక్షత్రాల్లో పుట్టిన అబ్బాయిలు భార్యను విపరీతంగా ప్రేమిస్తారు!

ఈ 5 నక్షత్రాల్లో పుట్టిన అబ్బాయిలు భార్యను విపరీతంగా ప్రేమిస్తారు!

జ్యోతిష్య శాస్త్రంలో రాశులు, నక్షత్రాలకు చాలా ప్రాధాన్యం ఉంది. కొన్ని ప్రత్యేకమైన నక్షత్రాల్లో పుట్టిన అబ్బాయిలు వారి భార్యను అమితంగా ప్రేమిస్తారట. వారిని సంతోషంగా ఉంచేందుకు ఏమైనా చేస్తారట. ఇంతకీ ఏ నక్షత్రాల్లో జన్మించిన వారు ఇలా ఉంటారో తెలుసుకోండి.

1 Min read
Author : Kavitha G
Published : Jun 15 2025, 12:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఏ నక్షత్రాల్లో పుట్టిన వారు భార్యను బాగా ప్రేమిస్తారు?
Image Credit : Freepik

ఏ నక్షత్రాల్లో పుట్టిన వారు భార్యను బాగా ప్రేమిస్తారు?

పెళ్లి సమయంలో జాతకాలు చూడటం సహజం. రాశులు, నక్షత్రాలు కలిస్తేనే చాలామంది పెళ్లికి రెడీ అవుతారు. అయితే కొన్ని నక్షత్రాలు పెళ్లికి అనుకూలంగా ఉండవచ్చు. మరి కొన్ని అనుకూలంగా లేకపోవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అబ్బాయి పుట్టిన నక్షత్రాన్ని బట్టి.. అతనికి వచ్చే భార్య అదృష్టాన్ని అంచనా వేయచ్చు. ఎందుకంటే కొన్ని నక్షత్రాల్లో పుట్టిన అబ్బాయిలు భార్యను విపరీతంగా ప్రేమిస్తారట. భార్య కోసం ఏమైనా చేస్తారట. మరి అమ్మాయిలకు అదృష్టాన్ని తెచ్చే ఆ నక్షత్రాలేంటో ఓసారి చూసేయండి.  

24
ఉత్తర ఫల్గుణి నక్షత్రం:
Image Credit : our own

ఉత్తర ఫల్గుణి నక్షత్రం:

ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలు చాలా నమ్మకమైనవారు. నిబద్ధత కలిగినవారు. వీరు తమ భార్యను చాలా ప్రేమిస్తారు. వారిపట్ల శ్రద్ధ కలిగి ఉంటారు. వారిని సంతోషంగా ఉంచేందుకు.. వారికి ఎలాంటి లోటు రాకుండా చూసుకునేందుకు నిత్యం కష్టపడతారు.  

Related Articles

Related image1
Birth Date: ఈ మూడు తేదీల్లో పుట్టినవారు ఏ ఉద్యోగం సరిగ్గా చేయరు..!
Related image2
Birth Date: ఈ 3 తేదీల్లో పుట్టినవారు రెండో పెళ్లి చేసుకునే అవకాశాలు ఎక్కువ!
34
అనురాధ నక్షత్రం:
Image Credit : our own

అనురాధ నక్షత్రం:

ఈ నక్షత్రంలో పుట్టిన పురుషులు చాలా శ్రద్ధ కలిగినవారు. మొదటి నుంచి కూడా వీరు కుటుంబానికి బాగా ప్రాధాన్యం ఇస్తారు. పెళ్లి తర్వాత వారి భార్య జీవితంలో అన్ని తానై ఉండాలని కోరుకుంటారు. భార్య అభిప్రాయలను గౌరవిస్తారు. ఆమెను సంతోషంగా చూసుకోవడానికి ప్రయత్నిస్తారు.  

హస్త నక్షత్రం:

ఈ నక్షత్రంలో పుట్టిన పురుషులు చాలా తెలివైనవారు. ప్రతిభ కలిగిన వారు. జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. తనకు తగిన మహిళను ఎంచుకొని.. జీవితాంతం వారిని హ్యాపీగా చూసుకోవాలని అనుకుంటారు. 

44
రోహిణి నక్షత్రం:
Image Credit : Freepik

రోహిణి నక్షత్రం:

ఈ నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలు విశ్వాసపాత్రులు. భార్య భర్తల బంధంలో చాలా నిజాయతీగా ఉంటారు. భార్యతో మనస్ఫూర్తిగా జీవిస్తారు. కుటుంబానికి ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటారు.  

శ్రవణ నక్షత్రం:

ఈ నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలు చాలా వినయంగా ఉంటారు. క్రమశిక్షణ కలిగినవారు. వీరు భార్య పట్ల చాలా శ్రద్ధగా ఉంటారు. వారిని విడిచి ఉండేందుకు ఇష్టపడరు. తాను కష్టపడినా కుటుంబం సుఖంగా ఉండాలని కోరుకుంటారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
ఆధ్యాత్మిక విషయాలు
రాశి ఫలాలు
బంధుత్వం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Stars: ఈ 5 నక్షత్రాల్లో పుట్టినవారు మహా ముదుర్లు.. మాటలతో మాయ చేసేస్తారు!
Recommended image2
Baba Vanga: ఈ 4 రాశులవారికి త్వరలో ధన యోగం, కోటీశ్వరులు అవ్వడం ఖాయం
Recommended image3
Shukra Gochar: మార్చిలో ఈ 2 రాశుల వారి జీవితం మార‌నుంది.. నాలుగు సార్లు శుక్ర గ‌హ సంచారం
Related Stories
Recommended image1
Birth Date: ఈ మూడు తేదీల్లో పుట్టినవారు ఏ ఉద్యోగం సరిగ్గా చేయరు..!
Recommended image2
Birth Date: ఈ 3 తేదీల్లో పుట్టినవారు రెండో పెళ్లి చేసుకునే అవకాశాలు ఎక్కువ!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved