- Home
- Astrology
- Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ప్రతిభకు తగిన గుర్తింపు.. నిరుద్యోగులకు శుభవార్తలు!
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ప్రతిభకు తగిన గుర్తింపు.. నిరుద్యోగులకు శుభవార్తలు!
Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 03.11.2026 మంగళవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ఆర్థిక ఇబ్బందులు తప్పవు. చేపట్టిన పనులు మందగిస్తాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వృత్తి, వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. ఉద్యోగాలలో ఊహించని మార్పులుంటాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.
వృషభ రాశి ఫలాలు
చిన్ననాటి మిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు. వ్యాపార విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో సహోద్యోగుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభదాయకం.
మిథున రాశి ఫలాలు
చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు కలసివస్తాయి. ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది.
కర్కాటక రాశి ఫలాలు
బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు చికాకు పరుస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు దక్కదు. ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
సింహ రాశి ఫలాలు
పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. శ్రమతో కానీ కొన్ని పనులు పూర్తి కావు. వృథా ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో చిన్నపాటి చికాకులు తప్పవు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
కన్య రాశి ఫలాలు
సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
తుల రాశి ఫలాలు
సమాజంలో ప్రత్యేక గౌరవ మర్యాదలు పొందుతారు. నిరుద్యోగులకు అనుకూలం. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు.
వృశ్చిక రాశి ఫలాలు
కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. చేపట్టిన పనులలో అవరోధాలు తప్పవు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి. వృత్తి , ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరపు బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి.
ధనుస్సు రాశి ఫలాలు
ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేస్తారు. రుణదాతల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. బంధువులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో మార్పులుంటాయి.
మకర రాశి ఫలాలు
దూరపు బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారం దిశగా సాగుతాయి.
కుంభ రాశి ఫలాలు
బంధువులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఉద్యోగాలలో అధికారుల నుంచి వ్యతిరేకత పెరుగుతుంది. వ్యాపారాలలో సమస్యలు తప్పవు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
మీన రాశి ఫలాలు
వ్యాపారాల్లో అంచనాలు నిజమవుతాయి. చేపట్టిన పనులు చకచకా పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో మీ పనితీరుతో అధికారులను సైతం ఆకట్టుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు విస్తృతమవుతాయి.




