- Home
- Astrology
- Numerology: ఈ 4 తేదీల్లో పుట్టినవారికి 35 ఏళ్ల తర్వాత అసలైన రాజయోగం.. కోటీశ్వరులవుతారు
Numerology: ఈ 4 తేదీల్లో పుట్టినవారికి 35 ఏళ్ల తర్వాత అసలైన రాజయోగం.. కోటీశ్వరులవుతారు
Numerology: న్యూమరాలజీ ప్రకారం ఒక నెలలో నాలుగు రకాల తేదీల్లో పుట్టిన వారికి 35 ఏళ్ల తర్వాతే అదృష్టం వరిస్తుంది. అప్పటివరకు పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం, కెరీర్ లో గ్రోత్, ఆర్థిక స్థిరత్వం అన్నీ 35 ఏళ్లు దాటాకే దక్కుతాయి. ఆ నాలుగు నెంబర్లు ఇవే.

నంబర్ 3
ఏ నెలలోనైనా 3, 12, 21, 30 పుట్టిన వారి రాడిక్స్ నెంబర్ 3 అవుతుంది. గురు గ్రహం (బృహస్పతి) ఆధిపత్యం వహించే 3వ నంబర్ లో పుట్టిన వారు చాలా టాలెంటెడ్. ఎప్పుడూ పాజిటివ్ గా ఉంటారు. తమ క్రియేటివిటీని ప్రపంచానికి చూపించాలని వీరు ఆరాటపడుతుంటారు. కెరీర్ ప్రారంభంలో వీరు చాలా కష్టపడాల్సి వస్తుంది. సక్సెస్ రావడం కాస్త లేట్ అవుతుంది. ఎన్నో అనుభవాలు ఎదుర్కొన్నాక, 35 ఏళ్లు దాటాక వీరికి సరైన గుర్తింపు వస్తుంది. వ్యాపారం, ఉద్యోగంలో ఊహించని గ్రోత్ చూస్తారు.
నంబర్ 4
ఏ నెలలోనైనా 4, 13, 22, 31 పుట్టిన వారి రాడిక్స్ నెంబర్ 4 అవుతుంది. రాహువు ప్రభావం ఉండే 4వ నంబర్ వ్యక్తులు ఎప్పుడూ కొత్తగా ఆలోచిస్తారు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి, వాటి గురించి లోతుగా తెలుసుకోవడానికి వీరు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. యవ్వనంలో వీరు చాలా గందరగోళ పరిస్థితులు, క్లారిటీ లేకపోవడం, ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటారు. 35 ఏళ్లు రాగానే వీరిలో మెచ్యూరిటీ పెరుగుతుంది. సరైన నిర్ణయాలు తీసుకుంటారు. కెరీర్, పర్సనల్ లైఫ్ లో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తారు.
నంబర్ 9
ఏ నెలలోనైనా 9, 18, 27 పుట్టిన వారి రాడిక్స్ నెంబర్ 9 అవుతుంది. నవగ్రహాల్లో ధైర్యానికి, పరాక్రమానికి ప్రతీక అయిన కుజ (అంగారక) గ్రహం కంట్రోల్ లో ఉండేది 9వ నంబర్. ఈ తేదీల్లో పుట్టిన వారు దేనికీ భయపడరు. ఎలాంటి సవాళ్లనైనా ఈజీగా ఎదుర్కొంటారు. తొలినాళ్లలో వీరు తీసుకునే తొందరపాటు నిర్ణయాలు, కోపం వీరి ఎదుగుదలకు అడ్డుకట్ట వేస్తాయి. వయసుతో పాటు వచ్చే అనుభవంతో వీరు ప్రశాంతంగా ఉండటం నేర్చుకుంటారు. 35 ఏళ్ల తర్వాత పక్కా నిర్ణయాలు తీసుకుని, ఆర్థికంగా భారీ సక్సెస్ సాధిస్తారు.
నంబర్ 8
ఏ నెలలోనైనా 8, 17, 26 పుట్టిన వారి రాడిక్స్ నెంబర్ 8 అవుతుంది. న్యాయ దేవుడైన శని భగవానుడి ఆధిపత్యం ఉండే 8వ నంబర్ లో పుట్టిన వారు చాలా కష్టపడతారు. ఎంతో క్రమశిక్షణతో ఉంటారు. వీరికి లైఫ్ లో ఏదీ అంత ఈజీగా రాదు. ప్రతి చిన్న సక్సెస్ కోసం ఎన్నో పోరాటాలు చేయాల్సిందే. శని దేవుడి దయతో, వీరు పడ్డ కష్టానికి 35 ఏళ్ల తర్వాతే పూర్తి ఫలితం దక్కుతుంది. సమాజంలో మంచి హోదా, కెరీర్ లో స్థిరమైన ఎదుగుదల సొంతం చేసుకుంటారు.





