Mars Moon Conjunction: కుజ చంద్రుల కలయిక.. ఈ 3 రాశుల వారి కష్టాలన్నీ తీరే కాలం ఇదే
Mars Moon Conjunction: కుజ చంద్రుల కలయిక జరగబోతోంది. ఒకరి జాతకంలో కుజుడు, చంద్రుడు కలవడం వల్ల ఏర్పడే చంద్ర మంగళ యోగం ఏ వ్యక్తినైనా కోటీశ్వరుడిని చేసతుంది. దీన్ని మహాలక్ష్మీ యోగం అని కూడా పిలుచుకుంటారు.

కుజ చంద్రుల కలయికతో
కుజుడు, చంద్రుడు… రెండూ ముఖ్యమైన గ్రహాలే. వీరిద్దరి గమనం రాశులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. అతి త్వరలో వీరిద్దరూ ఒకే రాశిలో కలవబోతున్నారు. జనవరి 18న కుజుడు, చంద్రుల కలయిక జరుగుతుంది. ఈ కలయిక మహాలక్ష్మి రాజయోగాన్ని ఏర్పరుస్తుంది. ఈ యోగం మూడు రాశుల వారిపై ప్రభావం చూపబోతోంది. ఆ మూడు రాశుల వారికి ఈ యోగం ఉన్నంత కాలం మట్టి పట్టకున్నా బంగారమే అవుతుంది. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 2026 సంవత్సరం ప్రారంభంలో జనవరి 18న కుజుడు, చంద్రుల కలయిక వల్ల ఏర్పడే ఈ యోగం కొత్త ఏడాదిలో మొదటి రాజయోగం కావడంతో రాశులకు కూడా అత్యధిక మేలు జరిగే అవకాశం ఉంది. దాదాపు 18 నెలల తర్వాత ఈ యోగం మళ్లీ ఏర్పడుతుంది. దీని వల్ల మూడు రాశుల వారి జీవితంలో సంపద, సంతోషం, గౌరవం అందుతాయి.
మేష రాశి
అతి త్వరలో ఏర్పడే మహాలక్ష్మి రాజయోగం మేషరాశికి ఎంతో శుభప్రదమైనది. వీరికి కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. అప్పుగా ఇచ్చి ఇతర వ్యక్తుల చేతుల్లో ఇరుక్కుపోయిన డబ్బు తిరిగి చేతికి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు చాలా వరకు తొలగిపోయే అవకాశం ఉంది. వ్యాపారం చేస్తున్న వారికి ఇది కలిసొచ్చే సమయం. ఈ యోగం ఏర్పడిన కాలంలోనే ఇల్లు, వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇన్నాళ్లు వీరు పడిన కష్టాలు ఈ యోగం వల్ల చాలా వరకు తగ్గుతాయి.
వృషభ రాశి
వృషభ రాశి వారికి జనవరి 18న ఏర్పడే మహాలక్ష్మి రాజయోగం నిజానికి ఒక మలుపుగానే చెప్పుకోవాలి. ఈ రాశి వారి అధిపతి శుక్రుడు. దీని వల్ల వీరికి ఈ యోగం రెట్టింపు లాభాలను అందిస్తుంది. కొత్త ఇల్లు, వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారం చేస్తున్న వారికి అనేక లాభాలు రావచ్చు. అప్పులు తీరి సంతోషంగా ఉంటారు. ఇక పెళ్లికాని వారికి వివాహం జరిగే అవకాశం అధికంగ ఉంది.
మకర రాశి
మకర రాశి వారికి కుజ చంద్రుల కలయిక బాగా కలిసి వస్తుంది. వీరికి జీవితంలో ఈ యోగం కొత్త ప్రారంభాన్ని అదిస్తుంది. అనుకున్న పనులు జరిగే కాలం ఇది. వ్యాపారాన్ని కూడా బాగా విస్తరించవచ్చు. కొత్త ఒప్పందాలు కుదుర్చుకుని వ్యాపారాలను మరింత పెంచుతారు. ఇక ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్, జీతం పెంపు వంటి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ పనుల్లో జాప్యం జరగకుండా త్వరగా పనులు పూర్తయ్యే ఛాన్స్ అధికంగా ఉంది.

