Gold Price: పాకిస్తాన్లో గ్రాము బంగారం ఎంతో తెలుసా? పాపం అక్కడి ప్రజలు
Gold Price: మనదేశంలో బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతుండడంతో ఏ దేశంలో తక్కువ బంగారం ధరలు ఉంటాయో తెలుసుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే మన పక్క దేశం పాకిస్తాన్లో ధరలు ఎలా ఉంటాయో తెలిస్తే ఒక్కసారిగా షాక్ అవుతారు.

పెరిగిపోతున్న బంగారాలు
బంగారం ధరలు మనదేశంలో ప్రతిరోజు పెరిగిపోతూ ఉన్నాయి. గ్రాము బంగారం కొనాలంటే 14,000 రూపాయలు ఖర్చు పెట్టాలి. అదే తులం బంగారంతో ఒక వస్తువు తీసుకోవాలంటే కనీసం రెండు లక్షలు దాకా వెచ్చించాల్సిన పరిస్థితి. మరి మన పక్క దేశం పాకిస్తాన్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయి? అక్కడ కూడా బంగారం ధరలు గత కొంతకాలంగా వేగంగా పెరుగుతూనే ఉన్నాయి. అక్కడ సాధారణ ప్రజలకు బంగారం కొనడం అనేది అసాధ్యంగా మారిపోయింది. వివాహాలు, పండుగలు వస్తే బంగారం కొనుగోలు చేసే వారి సంఖ్య పాకిస్తాన్లో చాలా తక్కువ. గతంతో పోలిస్తే చరిత్రలోనే అత్యధిక ధరలను పాకిస్తాన్ చూస్తోంది. అక్కడ నగల వ్యాపారులు కూడా అమ్మకాలు లేక ఇబ్బంది పడుతున్నారు. బంగారం ధర పెరగడంతో అక్కడ పేద, మధ్యతరగతి ప్రజలు అటువైపుగా కూడా చూడడం లేదు.
ఒక గ్రాము బంగారం పాక్‌లో ఎంత?
మనదేశంలో గ్రాము బంగారం కొనాలంటే 14000 రూపాయలు ఖర్చు పెట్టాలి. అదే పాకిస్తాన్లో అయితే 40 వేల రూపాయలు ఖర్చు పెట్టాలి. అంటే మన కన్నా మూడు రెట్లు ఎక్కువ ధరలను పాకిస్తాన్ ప్రజలు చూస్తున్నారు. మా దేశంలో బంగారం ధరలు పెరుగుతున్నప్పటికీ... స్థిరమైన ఆర్థిక పరిస్థితులు కొంతవరకు ఈ ధరలను నియంత్రిస్తున్నాయి. కానీ పాకిస్థాన్లో మాత్రం అలాంటి పరిస్థితి లేదు. పాకిస్తాన్ రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. అందుకే అక్కడ బంగారం ధర పెరిగిపోతోంది. భారత్‌లో రూపాయి విలువ స్థిరంగా కొనసాగుతూ ఉండటం వల్ల కొంతవరకు ఈ ధరలపై నియంత్రణ సాగుతోంది.
ధరలు ఎందుకు పెరిగింది?
పాకిస్తాన్‌లో బంగారం ధరలు పెరగడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధరలు పెరగడం ప్రధాన కారణం. ముఖ్యంగా పాకిస్థాన్‌లో ఆర్థిక అనిశ్చితి, యుద్ధ పరిస్థితులు, రాజకీయ ఉద్రిక్తతలు ఇవన్నీ కూడా బంగారం ధరలను అక్కడ పెంచేసాయి. ఇక పాకిస్తాన్ రూపాయి విలువ తీవ్రంగా పడిపోవడం, బంగారం దిగుమతుల ఖర్చు పెరిగిపోవడం... ఆ భారాన్ని పాకిస్థాన్లోని పేద ప్రజలు మోయలేకపోవడం వల్ల అక్కడ మరింతగా గ్రాము ధర పెరిగింది.
పాక్ లో ఎందుకిలా?
ఇలా బంగారం ధరలు అధికంగా ఉండడంతో అక్కడ సామాన్య ప్రజలు లైట్ వెయిట్ బంగారాన్ని కొనడం లేదా పాత బంగారాన్ని మార్చుకోవడం వంటివి చేస్తున్నారు. అంతర్జాతీయ పరిస్థితులు, కరెన్సీలో మార్పులు, దేశీ ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి రాబోయే రోజుల్లో కూడా బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. పాకిస్థాన్లో కూడా ద్రవ్యోల్భణం ఆర్థిక పరిస్థితులు అంతా సవ్యంగా లేవు. వీటి వల్ల కూడా అక్కడ బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొన్నిచోట్ల కనీసం ఆహారం కూడా పుష్కలంగా దొరికే పరిస్థితి పాక్ లో లేదు. ఆహారానికే దిక్కు లేనప్పుడు బంగారాన్ని కొనడం గురించి అక్కడ పేద ప్రజలు ఆలోచించలేరు. అందుకే బంగారం మార్కెట్ అక్కడ వెలవెలలాడుతూ కనిపిస్తోంది.

