MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: ఈ రాశుల వారికి రియల్ ఎస్టేట్ లో లాభాలు.. నిరుద్యోగులకు శుభవార్తలు!

Today Rasi Phalalu: ఈ రాశుల వారికి రియల్ ఎస్టేట్ లో లాభాలు.. నిరుద్యోగులకు శుభవార్తలు!

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 25.05.2025 ఆదివారానికి సంబంధించినవి.

2 Min read
Kavitha G
Published : May 25 2025, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
112
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

చిన్ననాటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ పొందుతారు. కుటుంబ సభ్యుల నుంచి అవసరానికి డబ్బు సహాయం అందుతుంది. వాహన సంబంధిత వ్యాపారాలు రాణిస్తాయి. నిరుద్యోగులకు అనుకూలం.

212
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శుభకార్యాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి ఉపసమనం పొందుతారు.

Related Articles

Zodiac Signs: ఈ 5 రాశులకు నరదిష్టి ఎక్కువ.. జాగ్రత్తగా లేకపోతే కష్టం!
Zodiac Signs: ఈ 5 రాశులకు నరదిష్టి ఎక్కువ.. జాగ్రత్తగా లేకపోతే కష్టం!
Zodiac Signs: ఈ 4 రాశుల అమ్మాయిలకి మంచి భర్తలు వస్తారు!
Zodiac Signs: ఈ 4 రాశుల అమ్మాయిలకి మంచి భర్తలు వస్తారు!
312
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. పిల్లల చదువు, ఉద్యోగ విషయాలపై దృష్టి సారించడం మంచిది. కీలక వ్యవహారాల్లో బద్దకం పనికి రాదు. కుటుంబంలో కొందరి ప్రవర్తన బాధిస్తుంది.

412
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో నిదానంగా వ్యవహారించాలి. ఉద్యోగులకు శ్రమ పెరుగుతుంది. చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. దైవ చింతన పెరుగుతుంది. తల్లి తరఫు బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు.

512
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

దైవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆదాయ మార్గాలు ఆశించిన విధంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. రియల్ ఎస్టేట్ లో లాభాలు వస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

612
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

సోదరులతో కొన్ని విషయాల్లో మాటపట్టింపులు ఉంటాయి. డబ్బు పరంగా ఒడిదుడుకులు అధికం అవుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపారులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో సమస్యలు పెరుగుతాయి.

712
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ విలువ పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి డబ్బు సహయం అందుతుంది. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు.

812
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. వృథా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో ఇతరుల ప్రవర్తన వల్ల ఇబ్బందులు వస్తాయి.

912
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇంటా బయట వివాదాలు పరిష్కరించుకుంటారు.

1012
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. సంఘంలో పెద్దలతో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. రియల్ ఎస్టేట్ లో లాభాలు పొందుతారు.  

1112
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

దూరపు బంధువుల నుంచి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనుల్లో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమతో కానీ పనులు పూర్తి కావు. వృథా ఖర్చులు పెరుగుతాయి.

1212
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

వాహన ప్రయాణ విషయంలో జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం. ఇంటి నిర్మాణ పనుల్లో అవరోధాలుంటాయి. ఉద్యోగాల్లో ట్రాన్స్ ఫర్ సూచనలు ఉన్నాయి. నూతన రుణాలు చేయడం మంచిది కాదు. వ్యాపారంలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

Kavitha G
About the Author
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. Read More...
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved