Zodiac Signs: వినాయకుడికి అత్యంత ఇష్టమైన రాశులు.. వీరికి డబ్బుకు లోటే ఉండదు!
హిందూ సంస్కృతి ప్రకారం.. ఏ శుభకార్యాన్ని మొదలు పెట్టినా.. ముందు వినాయకుడిని పూజిస్తారు. ఆయన అనుగ్రహం ఉంటే ఏ పనిలోనైనా విఘ్నాలు రావని నమ్ముతారు. విఘ్నాలను తొలగించే వినాయకుడికి ఇష్టమైన కొన్ని రాశులున్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.

మేష రాశి
మేష రాశికి అధిపతి కుజుడు. ఈ రాశి.. గణేశుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. వినాయకుడి అనుగ్రహంతో ఈ రాశివారికి చేపట్టిన పనులు త్వరగా పూర్తవుతాయి. ఈ రాశివారికి డబ్బుకు కొరత ఉండదు. గణేశుడి ఆశీస్సులతో ఈ రాశివారు సుఖ సంతోషాలతో జీవిస్తారు. వ్యాపారంలో విజయం సాధిస్తారు.
మిథున రాశి
మిథున రాశికి అధిపతి బుధుడు. ఈ రాశి కూడా విఘ్నేశ్వరుడికి ఇష్టమైనది. ఈ రాశివారు మంచి మాటకారులు. చురుకుగా ఉంటారు. అద్భుతమైన తెలివితేటలు వీరి సొంతం. గణేశుడి అనుగ్రహంతో ఈ రాశివారి కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో చాలా ఫాస్ట్ గా ఉన్నత స్థానాన్ని పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. గణేశుడికి ఇష్టమైన రాశుల్లో ఇదొకటి. ఈ రాశివారి స్వభావం కొంచెం కోపంగా ఉంటుంది. కానీ కష్ట సమయాల్లో గణేశుడు వారిని కాపాడుతాడు. చెడు పనులకు దూరంగా ఉంచుతాడు. గణేశుడి అనుగ్రహంతో వీరు కష్టాలనుంచి బయటపడతారు.
మకర రాశి
గణేశుడికి ఇష్టమైన మరో రాశి.. మకర రాశి. ఈ రాశికి అధిపతి శని. ఈ రాశివారు న్యాయంగా, నిజాయితీగా ఉంటారు. ఈ రాశివారికి డబ్బు కష్టాలు ఎక్కువ కాలం ఉండవు. వినాయకుడి ఆశీర్వాదంతో ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు.
కుంభ రాశి
కుంభ రాశికి అధిపతి శని. ఈ రాశివారంటే వినాయకుడికి చాలా ఇష్టం. గణేశుడి అనుగ్రహంతో వీరు సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఉద్యోగంలో త్వరగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వ్యాపారంలో చాలా డబ్బు సంపాదిస్తారు. ఇతరులకు మంచి చేయడంలో వీరు ముందుంటారు.

