- Home
- Astrology
- Mercury, Saturn Conjunction: 2 రోజులు ఓపిక పడితే చాలు.. ఈ 3 రాశుల వారికి డబ్బు, విదేశీ ఉద్యోగం!
Mercury, Saturn Conjunction: 2 రోజులు ఓపిక పడితే చాలు.. ఈ 3 రాశుల వారికి డబ్బు, విదేశీ ఉద్యోగం!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధ, శని గ్రహాలు కలిసి త్వరలో నవపంచమ రాజయోగాన్ని ఏర్పరచనున్నాయి. దీనివల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసివస్తుందట. వారు కోరుకున్నవన్నీ నెరవేరుతాయట. మరీ ఈ రాజయోగం ఏ రాశి వారికి మంచిదో ఇక్కడ చూద్దాం.

నవపంచమ రాజయోగం
జ్యోతిష్యం ప్రకారం గ్రహాలు కాలానుగుణంగా సంచరిస్తూ శుభ, అశుభ యోగాలు ఏర్పరుస్తాయి. జూన్ 28న బుధ, శని నవపంచమ రాజయోగాన్ని ఏర్పరచనున్నాయి. ఆ రోజు శని, బుధ గ్రహాలు 120 డిగ్రీల దూరంలో ఉంటాయి. దీనివల్ల నవపంచమ రాజయోగం ఏర్పడుతుంది. ఈ ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి మంచి రోజులు మొదలవుతాయి. వారికి ధనప్రాప్తి, అభివృద్ధి కలుగుతుంది. పిల్లలకు సంబంధించి శుభవార్తలు అందుతాయి. మరి ఆ రాశులేంటో చూద్దామా..
వృషభ రాశి
వృషభ రాశి వారికి నవపంచమ రాజయోగం శుభప్రదం. వాహనం లేదా ఆస్తి కొనుగోలు చేయవచ్చు. ఉద్యోగంలో పదోన్నతి లేదా కొత్త ప్రాజెక్ట్ వస్తుంది. వ్యాపారం చేసేవారికి కొత్త ఒప్పందాలు, లాభాలు వస్తాయి. ఈ రాశివారికి ప్రజాదరణ పెరుగుతుంది. ప్రశంసలు దక్కుతాయి. ఊహించని ఆర్థిక లాభాలు అందుతాయి. కొత్త పని ప్రారంభించడానికి ఈ సమయం అనుకూలం.
తుల రాశి
తుల రాశి వారికి నవపంచమ రాజయోగంతో మంచి రోజులు ప్రారంభమవుతాయి. ప్రజాదరణ లభిస్తుంది. గౌరవం పెరుగుతుంది. విదేశీ ప్రయాణం లేదా విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
మతపరమైన లేదా సామాజిక కార్యకలాపాల్లో చురుకుదనం పెరుగుతుంది. కొన్ని శుభవార్తలు అందుతాయి. ఈ రాశివారికి సౌకర్యాలు పెరుగుతాయి. ప్రణాళికలు విజయవంతమవుతాయి. డబ్బు ఆదా అవుతుంది.
కుంభ రాశి
కుంభ రాశి వారికి నవపంచమ రాజయోగం శుభప్రదం. ఈ రాశివారికి ఆదాయం బాగా పెరుగుతుంది. ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. అదృష్టం వీరికి అనుకూలంగా ఉంటుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి.
ఈ సమయంలో కుంభ రాశివారికి సౌకర్యాలు పెరుగుతాయి. గౌరవం, ప్రతిష్ట పెరుగుతుంది. వీరు చేపట్టే పనుల్లో విజయం సాధించే అవకాశాలు పెరుగుతాయి. కోరికలు నెరవేరుతాయి.