MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Astrology
  • Ketu Blessings: కేతువు ఆశీర్వాదంతో ఈ 6 రాశులవారికి రాజులాంటి జీవితం! మీ రాశి ఉందా?

Ketu Blessings: కేతువు ఆశీర్వాదంతో ఈ 6 రాశులవారికి రాజులాంటి జీవితం! మీ రాశి ఉందా?

Ketu Blessings: జ్యోతిష్య శాస్త్రంలో కేతువును ముఖ్యమైన గ్రహంగా భావిస్తారు. కేతువు అనుగ్రహం ఉంటే జీవితంలో అనుకోని ధనలాభాలు, విజయాలు ఉంటాయి. త్వరలో కేతువు నక్షత్రం మారనుంది. దానివల్ల 6 రాశులవారు సడెన్ గా ధనవంతులవుతారట. ఆ రాశులేవో చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : May 20 2026, 12:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కేతువు ఆశీర్వాదంతో రాజయోగం పొందే రాశులు
Image Credit : Twitter

కేతువు ఆశీర్వాదంతో రాజయోగం పొందే రాశులు

జ్యోతిష్య శాస్త్రంలో కేతువును పాప గ్రహంగా భావిస్తారు. కానీ కేతువు కొన్నిసార్లు జీవితాన్ని మార్చే అద్భుతమైన ఫలితాలనూ ఇస్తాడు. ప్రస్తుతం సింహరాశిలో ఉన్న కేతువు, తన సొంత నక్షత్రమైన మఖలోకి ప్రవేశించాడు. దీనివల్ల కొన్ని రాశుల వారికి ఊహించని మార్పులు ఉంటాయని పండితులు చెబుతున్నారు. అంతేకాదు కేతువు నక్షత్రమార్పు ప్రభావం ఈ ఏడాది డిసెంబర్ 5 వరకు బలంగా ఉంటుందట. మరి ఏ రాశులవారు కేతువు ఆశీర్వాదంతో రాజయోగం పొందుతారో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మేష, మిథున రాశులు
Image Credit : Getty

మేష, మిథున రాశులు

కేతువు నక్షత్ర మార్పుతో మేష రాశివారికి అకస్మాత్తుగా ప్రమోషన్, డబ్బు వస్తాయి. సమాజంలో గౌరవం పెరిగే అవకాశం ఉంది. విజయానికి మార్గం సుగమం అవుతుంది. చిన్న ప్రయత్నంతో మంచి ఫలితాలు పొందుతారు.

మిథున రాశి వారికి కేతువు సంచారం శుభప్రదం. చాలాకాలంగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. వ్యాపారం, ఉద్యోగంలో ఊహించిన దానికంటే వేగంగా పురోగతి సాధిస్తారు. గత పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వస్తాయి.

Related Articles

Related image1
Astrology Predictions: ఈ 6 రాశులవారికి రాజయోగం.. ఆరు నెలల వరకు డబ్బే డబ్బు!
Related image2
Chanakya Niti: చాణక్యుడి ప్రకారం ఎదుటివారి మనసులో ఏముందో ఇలా ఈజీగా తెలుసుకోవచ్చు!
34
సింహ, తుల రాశులు
Image Credit : Pixabay

సింహ, తుల రాశులు

కేతువు సింహరాశిలోనే సంచరిస్తున్నందున ఈ రాశివారికి ప్రత్యేక ఫలితాలు ఉంటాయి. ఈ సమయంలో ఈ రాశి వారి జీవితాన్నే మార్చేసే కొత్త అవకాశాలు వస్తాయి. ఊహించని ధనలాభం కలుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

తుల రాశివారికి కేతువు సంచారంతో ఆస్తి లాభం కలుగుతుంది. స్థిరాస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. విదేశీ ఉద్యోగ అవకాశాలు వచ్చే సూచనలు బలంగా ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది.

44
ధనుస్సు, మీన రాశులు
Image Credit : Pixabay

ధనుస్సు, మీన రాశులు

ధనుస్సు రాశి వారికి విదేశీ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. పెళ్లి, ఉద్యోగానికి సంబంధించి శుభవార్తలు వింటారు. బంధువులతో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగాలలో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. వ్యాపారాలతో కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి గతంకంటే మెరుగుపడుతుంది. 

మీన రాశి వారికి గతంలో ఉన్న మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. ఆరోగ్యం చక్కగా సహకరిస్తుంది. ఆదాయం పెరగడంతో పాటు ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనం చేసుకుంటారు. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rakhi 2026: రాఖీ ఎప్పుడు క‌ట్టాలి.? స‌రైన సమయం ఏంటో తెలుసా.?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు!
Recommended image3
Vinayaka Chavithi 2026: వినాయక చవితి తర్వాత ఈ 4 రాశులవారి దశ తిరగడం ఖాయం!
Related Stories
Recommended image1
Astrology Predictions: ఈ 6 రాశులవారికి రాజయోగం.. ఆరు నెలల వరకు డబ్బే డబ్బు!
Recommended image2
Chanakya Niti: చాణక్యుడి ప్రకారం ఎదుటివారి మనసులో ఏముందో ఇలా ఈజీగా తెలుసుకోవచ్చు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved