MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు మంచి మాటతీరుతో అందరనీ ఆకట్టుకుంటారు!

Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు మంచి మాటతీరుతో అందరనీ ఆకట్టుకుంటారు!

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 20.05.2026 బుధవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

2 Min read
Author : Kavitha G
Published : May 20 2026, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
నేటి రాశి ఫలాలు
Image Credit : AI

నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

ఆర్థికంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. వ్యాపారాలు కొంత మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో తోటివారి వల్ల ఊహించని సమస్యలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. రుణదాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.

Related Articles

Related image1
Astrology Predictions: ఈ 6 రాశులవారికి రాజయోగం.. ఆరు నెలల వరకు డబ్బే డబ్బు!
Related image2
Chanakya Niti: చాణక్యుడి ప్రకారం ఎదుటివారి మనసులో ఏముందో ఇలా ఈజీగా తెలుసుకోవచ్చు!
313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

సమాజంలో పరిచయాలు విస్తృతమవుతాయి. స్థిరాస్తి వివాదాలకు సంబంధించి ప్రముఖుల నుంచి ముఖ్యమైన సమాచారం సేకరిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ఆశించిన మార్పులుంటాయి.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. ఒక వ్యవహారంలో సన్నిహితుల నుంచి అందిన సమాచారం నిరాశ కలిగిస్తుంది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి, వ్యాపారాలలో శ్రమ తప్పదు. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

ఆస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. ఆర్థికంగా అనుకూలత కలుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో అంచనాలు నిజం అవుతాయి.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

వృత్తి, వ్యాపారాలలో సొంత ఆలోచనలు కలిసివస్తాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. స్థిరాస్తి క్రయవిక్రయాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

ప్రయాణాలలో శ్రమ అధికమవుతుంది. విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ఆప్తులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ఉద్యోగాలలో చికాకులు అధికమవుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు.

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. ఆర్థికంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి ఉండదు.

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని పాత జ్ఞాపకాలు పంచుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఉంది. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

కుటుంబ సభ్యుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆప్తుల నుంచి అవసరానికి డబ్బు లభిస్తుంది. చిన్ననాటి మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. విలువైన వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

ఇంటా బయటా పరిస్థితులు అనుకూలించవు. వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. ఆర్థిక ఇబ్బందులు మరింత బాధిస్తాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. దైవదర్శనాలు చేసుకుంటారు.

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది.

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. నూతన వాహన యోగం ఉంది. వ్యాపారులకు నూతన పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగుల యత్నాలు ఫలిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగాలలో సమస్యలను అధిగమిస్తారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Trigrahi Yoga: ఒకే రాశిలో మూడు గ్రహాల కలయిక.. 5 రాశులకు ఊహించని ధనప్రాప్తి
Recommended image2
Sun Transit: ఈ 3 రాశులకు రాబోయే నెల రోజుల పాటూ కష్టకాలమే.. ఆ సమయంలో జాగ్రత్తగా ఉంటే చాలు
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి అదృష్టయోగం, పట్టిందల్లా బంగారమే!
Related Stories
Recommended image1
Astrology Predictions: ఈ 6 రాశులవారికి రాజయోగం.. ఆరు నెలల వరకు డబ్బే డబ్బు!
Recommended image2
Chanakya Niti: చాణక్యుడి ప్రకారం ఎదుటివారి మనసులో ఏముందో ఇలా ఈజీగా తెలుసుకోవచ్చు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved